7. కాదేషునుండి మోవాబునకు తరలుట

మెరిబా వద్ద జలము

20 1. యిస్రాయేలు సమాజము మొదినెలలో సీను ఎడారి చేరి కాదేషున శిబిరము పన్నెను. అక్కడ మిర్యాము చనిపోగా యిస్రాయేలీయులు ఆమెను పాతిప్టిెరి.

2. అచట ప్రజలకు నీళ్ళు లభింపలేదు. వారు గుమిగూడి వచ్చి మోషేపై, అహరోనుపై తిరుగబడిరి.

3. వారు మోషేతో ”నాడు మా సోదరులు ప్రభువు గుడారము ముందట నాశనమైపోయినపుడు మేము కూడ వారితోపాటు చచ్చియుండవలసినది.

4. నీవు ప్రభువు ప్రజలను ఇక్కడికి తోడ్కొనిరానేల? మేమును, మా పశువులును చచ్చుటకేగదా?

5. నీవు మమ్ము ఐగుప్తునుండి తరలించుకొనిరానేల? ఈ పాడునేలకు చేర్చుటకొరకేనా? ఇచట ధాన్యము, అత్తిపండ్లు, ద్రాక్షపండ్లు, దానిమ్మపండ్లు లభింపవాయె! అసలు త్రాగుటకు చుక్కనీళ్ళయిన దొరుకుటలేదే” అని గొణగుకొనిరి.

6. మోషే అహరోనులు ప్రజలను వీడి సాన్నిధ్యపు గుడారము ఎదుికివచ్చి నేలపై బోరగిలబడిరి. అపుడు ప్రభు సాన్నిధ్యపుప్రకాశము వారికి గోచ రించెను.

7. ప్రభువు మోషేతో మ్లాడెను. 8. ”నీవు నీ కఱ్ఱను తీసికొనుము. నీవును, నీ సహోదరుడైన అహరోను ప్రజలను సమావేశపరుపుడు. వారందరు చూచుచుండగా ఆ ఎదుటనున్న బండతో మ్లాడుము. అది నీళ్ళిచ్చును. ఈ రీతిగా నీవు బండనుండి నీళ్ళు ప్టుింపుము. ఈ ప్రజలు, వారి పశువులు ఆ నీళ్ళు త్రాగవచ్చును” అనెను.

9. ప్రభువు ఆజ్ఞాపించినటులనే మోషే ప్రభు సాన్నిధ్యమునుండి ఆ కఱ్ఱను తీసికొనెను.

10. మోషే అహరోనులు ప్రజలను బండయెదుట ప్రోగుజేసిరి. మోషే వారితో ”ద్రోహులారా! మేము మీకు బండ నుండి నీళ్ళు ప్టుింపవలెనా?” అనెను.

11. అంతట మోషే తన చెయ్యినెత్తి కఱ్ఱతో రెండు సార్లు బండను మోదగా దానినుండి జలము పుష్కల ముగా వెలువడెను. ప్రజలు, పశువులు ఆ నీళ్ళు త్రాగిరి.

మోషే అహరోనులకు శిక్ష

12. అప్పుడు ప్రభువు మోషే అహరోనులను మందలించి ”యిస్రాయేలు ప్రజలకన్నుల యెదుట నా పవిత్రతను మీరు విశ్వసించరైరి. కనుక నేను వాగ్ధానముచేసిన భూమికి మీరు వీరిని నడిపించుకొని పోలేరు” అనెను.

13. ఈ సంఘటన మెరిబా1 వద్ద జరిగెను. అచట యిస్రాయేలీయులు ప్రభువుతో వాదులాడిరి. ప్రభువు వారిఎదుట తన పవిత్రతను వెల్లడిచేసెను.

ఎదోమీయులు దారినీయకపోవుట

14. మోషే కాదేషునుండి ఎదోమురాజు వద్దకు దూతలను పంపెను.

15. ‘ఎదోము రాజునకు నీ సోదరులగు యిస్రాయేలీయులు పంపువర్తమానము: మేము ఎన్ని కష్టములపాలయితిమో నీకు తెలియును. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి. అచ్చట మేము చాన్నాళ్ళు వసించితిమి. కాని ఐగుప్తీయులు మా పితరులను, మమ్ములను పెట్టరానిబాధలు ప్టిెరి.

16. మేము ప్రభువునకు మొరప్టిెతిమి. ఆయన మా మనవిని ఆలించి ఐగుప్తునుండి మమ్ము తర లించుకొని వచ్చుటకై ఒక దూతను పంపెను. కనుక మేము నీ పొలిమేరలలోనున్న కాదేషునొద్దకు వచ్చి చేరితిమి.

17. మమ్ము నీ దేశముగుండ ప్రయాణము చేయనిమ్ము. మేము మీ పొలములకు, ద్రాక్షతోటలకు అడ్డముగా పడిపోము. మీ బావులలోని నీరు ముట్టు కోము. వేయేల, నీ పొలిమేరలు దాటువరకు మా పశువులును, మేమును రాజమార్గమునుండి బెత్తెడైనను వైదొలగము” అని చెప్పి పంపెను.

18. కాని ఎదోము రాజు ”మీరు మా దేశముమీదుగా ప్రయాణము చేయ రాదు, చేసెదరేని మేము మిమ్ము కత్తితో ఎదిరింతుము” అని సమాధానము పంపెను.

19. యిస్రాయేలీయులు మరల ”మేము రాజమార్గమునుండి వైదొలగము. మా పశువులుకాని, మేముగాని మీ నీళ్ళు ముట్టు కొందుమేని మీకు పన్ను చెల్లింతుము. మీ దేశము గుండ మమ్ము కాలినడకన సాగిపోనిండు. మాకు ఈ మాత్రము అనుమతినిచ్చినచాలు” అని కబురంపిరి.

20. ఎదోమురాజు మరల ”మీరు మా దేశమున అడుగుపెట్టరాదు” అని సమాధానము పంపెను. పైపెచ్చు ఎదోమీయులు పెద్దదండుగా గుమిగూడి యిస్రాయేలీయుల మీదికి దండెత్తివచ్చిరి.

21. ఈ రీతిగా ఎదోము అడ్డుతగిలినందున యిస్రాయేలీయులు వైదొలగి మరియొక మార్గము ప్టిరి.

అహరోను మృతి

22. యిస్రాయేలు సమాజము కాదేషు నుండి బయలుదేరి ఎదోము పొలిమేరలలో ఉన్న హోరు పర్వతము చేరెను.

23. అచట ప్రభువు మోషే అహరోనులతో మ్లాడెను.

24. ”మీరిరువురు మెరిబావద్ద నామాట పాింపలేదు. కనుక నేను యిస్రాయేలీయులకు ఇచ్చెదననిన భూమిని అహరోను చేరుకోజాలడు. అతడు ఇక్కడనే చనిపోయి తన పూర్వులను కలిసికొనును.

25. అహరోనును, అతని కుమారుడు ఎలియెజెరును, హోరు కొండ మీదికి కొనిరమ్ము.

26. ఆ కొండమీద అహరోను యాజక వస్త్రములను తొలగించి వానిని అతని కుమారునికి తొడుగుము. అహరోను అక్కడనే కన్నుమూయును” అని చెప్పెను.

27. మోషే ప్రభువు చెప్పినట్లే చేసెను. సమాజ మంతయు చూచుచుండగా వారు హోరు కొండమీదికి ఎక్కిపోయిరి.

28. మోషే అహరోనునుండి యాజక వస్త్రములను తొలగించి ఎలియెజెరునకు తొడిగెను. అహరోను ఆ కొండమీదనే ప్రాణము విడిచెను. మోషే, ఎలియెజెరులు కొండమీదినుండి దిగివచ్చిరి.

29. అహరోను చనిపోయెనని విని యిస్రాయేలు సమాజ మంతయు అతనికొరకు ముప్పదిరోజులు విలపించెను.

Previous                                                                                                                                                                                                     Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము