యెషయాకు కుమారుడు పుట్టుట

8 1. ప్రభువు నాతో ”నీవు వ్రాతపలకను దీసికొని దానిమీద స్పష్టమైన అక్షరములతో ”మహేర్‌ షాలాల్‌ హష్‌బాజ్‌”4 అని వ్రాయుము.

2. నమ్మదగిన సాకక్షుల నిరువురిని అనగా యాజకుడైన ఊరియాను, యెబెరెక్యా కుమారుడైన జెకర్యాను గొనిరమ్ము” అని చెప్పెను.

3. నేను నా భార్యను కూడగా ఆమె గర్భవతియై కుమారుని కనెను. ప్రభువు నాతో ”ఈ శిశువునకు మహేర్‌ షాలాల్‌ హష్‌బాజ్‌ అని పేరు పెట్టుము.

4. ఈ బిడ్డనికి అమ్మా! నాన్నా! అని పిలుచు ప్రాయము రాకమునుపే అస్సిరియారాజు దమస్కు సంపదలను, సమరియా సొమ్మును కొల్లగొనిపోవును” అని చెప్పెను.

షిలో, యూఫ్రీసు

5.           మరల ప్రభువు నాతో ఇట్లు చెప్పెను:

6.           ”ఈ ప్రజలు నెమ్మదిగాపారు

               షిలో జలములను నిరాకరించిరి.

               కావున రెజీనుని, రెమల్యా కుమారుని చూచి

               భయపడుచున్నారు.

7.            కావున ప్రభువైన నేను యూఫ్రీసు నది

               మహాప్రవాహమును వీరిమీదికి కొనివత్తును.

               అస్సిరియారాజు, అతనిదండు ఆ ప్రవాహము,

               ఆ వరద యేి అంచులవరకు పొంగి,

               గట్టులు త్రెంచుకొని పారును.

8.           ఆ వెల్లువ యూదా మీదికివచ్చి

               అంతట పొంగిపారును.

               జనులను కుతికవరకు ముంచివేయును.

               ఇమ్మానుయేలూ! ఆ వరద

               పక్షివలె రెక్కలువిప్పి నీ దేశమంతిని కప్పును.”

అస్సిరియా దాడి చేసినా గెలువజాలదు

9.           జనులారా! మీరు భయముతో గుమిగూడుడు.

               దూరప్రాంతపు దేశములారా! వినుడు

               మీరు యుద్ధమునకు సిద్ధముకండు.

               అయినను మీరు ఓడిపోయెదరు.

10.         మీర్టిె ఆలోచనలు చేసినను అవి వ్యర్థమగును. మీరెంత మాటలాడినను ప్రయోజనముండదు. ప్రభువు మాకు బాసటగానున్నాడు.

ప్రభువు, తట్టుకొనిపడురాయి యగును

11.           ప్రభువు నన్ను మహాబలముతో హెచ్చరించి

               నేను ప్రజలు పోవుత్రోవన పోరాదని చెప్పెను. మరియు ఆయన నాతో ఇట్లు నుడివెను:

12. ”మీరు ఈ ప్రజల పన్నాగములతో

               చేతులు కలుపవదు.్ద

               వారు భయపడు దానికి మీరుభయపడవలదు.

13.          సైన్యములకధిపతియును, ప్రభుడనైన నన్ను

               మీరు పవిత్రునిగా భావింపవలెను.

               నన్ను చూచి మీరు భయపడవలెను.

14.          నా పావిత్య్రము వలన నేను ప్రజలు తట్టుకొని

               పడిపోవు రాయివిం వాడనగుదును.

               యూదా, యిస్రాయేలు రాజ్యముల ప్రజలకును,

               యెరూషలేము జనులకును నేను బోనుగాను,

               చిక్కు వలనుగాను అగుదును.

15.          చాలమంది ఆ రాయితగిలి

               క్రిందపడి గాయపడుదురు.

               ఆ వలలో చిక్కుకొని బందీలగుదురు.”

యెషయా శిష్యవర్గము

16.          నేను ఈ సందేశము వ్రాసినపత్రమును చుట్టచ్టుి

               ముద్రవేసి నా శిష్యుల అధీనమున ఉంచెదను.

17.          ప్రభువు యాకోబు వంశజులకు

               దర్శనమీయడయ్యెను.

               నా మట్టుకు నేను ప్రభువునునమ్మి

               ఆయన కొరకు వేచియుందును.

18.          ఇదిగో! నేనును, ప్రభువు నాకు దయచేసిన

               ఈ బిడ్డలును ఇచట ఉన్నాము.

               సియోనుకొండమీద వసించు

               సైన్యముల కధిపతియైన ప్రభువు

               మమ్ము యిస్రాయేలు ప్రజలకు గురుతుగాను, సూచనగాను నియమించెను.

19.          ఏమేమో గొణగుచు,

               విన్పించనట్లు మ్లాడు సోదెకాండ్రను,

               మాంత్రికులను సంప్రతింపుడని

               ప్రజలు మిమ్ము మభ్యపెట్టుచున్నారు.

               మీరు భూతముల సందేశములు వినవలెననియు,

               బ్రతికియున్నవారిని గూర్చి మృతులను

               సంప్రతింపవలెననియు

               వారు మీతో చెప్పుచున్నారు.

20.        కాని మీరు వారితో,

               ‘మీరు ప్రభువు వాక్కులువినుడు.

               భూతముల సందేశములు వినుటవలన

               మీక్టిె ప్రయోజనము కలుగదు’ అని చెప్పవలెను.

చీకిలో తిరుగాడుట

21. ప్రజలు ఆకలిగొని, నిరుత్సాహముతో దేశమున

               తిరుగాడుదురు. ఆకలివలనను, కోపమువలనను,

               తమ రాజును, దేవుని శపింతురు.

22.        భూమివైపు పారజూతురు.

               కాని విషాదము, చీకితప్ప వారికేమి కనిపింపవు.

23.         వారు భయంకరమైన అంధకారమున చిక్కుకొందురు

               ఆ ఉపద్రవమునుండి తప్పించుకోజాలరు.