కుమార్తెలకు వారసత్వపు హక్కు

27 1. మహ్లా, నోవా, హోగ్లా, మిల్కా, తీర్సా అనువారు సెలోఫెహాదు పుత్రికలు. సెలోఫెహాదు హెఫేరు కుమారుడు, గిలాదు మనుమడు, మాహీరు మునిమనుమడు. వీరు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్తులు.

2-3. ఆ కుమార్తెలు సమావేశపు గుడా రము యొక్క ద్వారమునొద్ద మోషేను, యాజకుడగు ఎలియెజెరును యిస్రాయేలు ప్రజలను, ప్రజానాయకు లను కలిసికొని ”మా తండ్రి మగబిడ్డలు లేకయే ఎడారియందు చనిపోయెనుగదా! ఆయన తన పాపము వలన తాను చనిపోయెనుగాని దేవునిమీద తిరుగబడిన కోరా బృందమున చేరుటవలనకాదు.

4. మా తండ్రికి మగబిడ్డలు లేరు కనుక ఆయనపేరు మాసిపోవలెనా యేమి? మా తండ్రి సహోదరులతో పాటు మమ్మును మా తండ్రి వారసులనుగా చేయుడు” అని అడిగిరి.

5-6. మోషే ఆ మాట ప్రభువునకు విన్నవింపగా  ప్రభువు అతనితో 7. ”సెలోఫెహాదు కుమార్తెల విన్నపము ధర్మబద్ధమైనదే. వారి తండ్రి సహోదరులతో పాటు వారిని తండ్రి వారసులనుగా చేయుము.      

8. ఎవడైనను పుత్రులులేక చనిపోయినచో అతని ఆస్తి అతని కుమార్తెలకు సంక్రమించునని యిస్రాయేలీ యులతో చెప్పుము.

9. పుత్రికలును లేనిచో అతని ఆస్తి అతని సోదరులకు దక్కును.

10. సోదరులును లేనిచో ఆ ఆస్తి అతని తండ్రి సోదరులకు చెందును.

11. వారును లేనిచో దగ్గరి చుట్టమునకు చెందును. తరతరముల వరకు యిస్రాయేలీయులకు మోషే ద్వారా ప్రభుడనైన నేనుచేసిన న్యాయమిది” అనిచెప్పెను.

మోషేకు బదులుగా యెహోషువ నాయకుడగుట

12. ప్రభువు మోషేతో ”నీవు అబారీము కొండ నెక్కి నేను యిస్రాయేలీయులకు ఇచ్చిన భూమిని పారజూడుము.

13. ఆ దేశమును కన్నులారచూచిన పిదప అహరోనునివలె నీవును మరణింతువు.

14. మీరిరువురును సీను ఎడారిలో నా ఆజ్ఞలను జవదాిరి గదా! నాడు మెరిబావద్ద యిస్రాయేలు సమాజము నామీద గొణగుకొనగా మీరిరువురును వారిఎదుట నన్ను పవిత్రపరచక నామీద తిరుగబడితిరి” అనెను. (సీను ఎడారి యందలి కాదేషు వద్దనున్న చెలమయే మెరిబా.)

15-17. మోషే దేవునితో ”ప్రభూ! సకల ప్రాణు లకు జీవాధారము నీవే. ఈ ప్రజలకు ఒక నాయకుని నియమింపుము. అతడు యుద్ధములలో వీరిని నడి పించుచుండును. ఒక నాయకుడు లభించినచో ఈ ప్రజలకు కాపరిలేనిమంద దుర్గతి పట్టదు” అనెను.

18. ప్రభువు అతనితో ”నూను కుమారుడైన యెహోషువ ఆత్మశక్తి కలవాడు. నీవు అతనిపై చేతులు చాపుము.

19. యిస్రాయేలు సమాజము చూచు చుండగా అతనిని యాజకుడగు ఎలియెజెరు ముందు నిలిపి నీకు ఉత్తరాధికారినిగా ప్రకింపుము.

20. పిమ్మట యిస్రాయేలు సమాజము అంతయు అతనిని విధేయించునట్లు నీ అధికారమును కొంత అతనికి ఇమ్ము.

21. యెహోషువ, యాజకుడగు ఎలియెజెరు మీద ఆధారపడియుండును. ఎలియెజెరు నా చిత్త మును ఊరీము తీర్పువలన అతనికి యెరుకపరుచు చుండును. ఈ రీతిగా ఎలియెజెరు యెహోషువను, యిస్రాయేలు సమాజమునంతిని తన మాట చొప్పున సమస్త కార్యములలో నడిపించుచుండును” అని చెప్పెను.

22. మోషే ప్రభువు చెప్పిన ట్లేచేసెను. అతడు యిస్రాయేలుసమాజము చూచుచుండగా యెహోషువను యాజకుడగు ఎలియెజెరు ముందు నిలిపి అతనిపై చేతులుచాచెను.

23. అతనిని తనకు ఉత్తరాధికారినిగా నియమించెను.

Previous                                                                                                                                                                                                 Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము