యిర్మీయా లేఖ
6 1. బబులోనియారాజు యెరూషలేము పౌరులను బంధించి బందీలనుగా కొనిపోకముందు యిర్మీయా వారికి పంపిన లేఖకు నకలు ఇది. ప్రభువు యిర్మీయాను వారితో చెప్పుమనిన సందేశమిందు కలదు.
ప్రవాసము దీర్ఘకాలము కొనసాగును
2. మీరు ప్రభువునకు ద్రోహముగా పాపము చేసితిరి. కావుననే బబులోనియరాజగు నెబుకద్నెసరు మిమ్ము బందీలుగా కొనిపోవుచున్నాడు.
3. మీరు ఆ దేశమున చాలకాలము, అనగా ఏడుతరముల వర కును ప్రవాసమున గడిపెదరు. అటు తరువాత దేవుడు మిమ్ము క్షేమముగా ఇంికిగొనివచ్చును.
4. మీరు బబులోనియా దేశమున కొయ్యతోను, వెండిబంగారములతోను చేయబడిన దైవములను చూతురు. విగ్రహారాధకులు వానిని భుజములపై మోసికొని పోవుచుందురు. అవి వారికి భీతిని ప్టుించు చుండును.
5. మీరు ఆ అన్యజాతి ప్రజలను అనుక రింపవలదు. ప్రజలు ఆ దైవములను ఊరేగించుచు, వానిని ఆరాధించునపుడు మీరు వానిని చూచి వెరగందకుడు.
6. మీరు మీ మనస్సులలో ”ప్రభూ! మేము నిన్ను మాత్రమే పూజింపవలయును” అని అనుకొనుడు.
7. అచట దేవదూత మీతోనుండి మిమ్ము కాపాడుచుండును.
8. వారు విగ్రహములకు వెండిబంగారములు పొదుగుదురు. వడ్రంగులు వానికి నాలుకలు అమర్చు దురు. అయినను అవి నిజమైన దైవములుకావు కనుక మ్లాడలేవు.
9. ప్రజలు బంగారు కిరీటములుచేసి వాని తలలపై పెట్టుదురు. సొమ్ములు పెట్టుకొనుటకు అవి ఆడపిల్లలా ఏమి? 10. కొన్నిసారులు పూజారులు తమ వేల్పులనుండి వెండిబంగారములు దొంగిలించి తమ ఇష్టము వచ్చినట్లు వాడుకొందురు.
11. వానిని దేవాలయములలో వసించు దేవదాసీలకు గూడ ఇత్తురు. ఆ కొయ్య, వెండి, బంగారు దైవములకు నరులకువలె బట్టలు కట్టబెట్టుదురు.
12. వానిని రాజులవలె ముదురుకెంపువన్నె ఉడుపులతో అలంక రించినను అవి మాసిపోకమానవు. చెదలు వానిని క్టొివేయకమానదు.
13. దేవాలయ ధూళి వారి మొగములమీద క్రమ్ముకొనినపుడు ఇతరులు దానిని తుడిచివేయవలెను.
14. అవి న్యాయాధిపతివలె చేతిలో రాజదండము తాల్చును. కాని తమకు ఎవరైన ద్రోహము చేసినచో వారిని శిక్షింపజాలవు.
15. కొన్నిమార్లు అవి చేతిలో కత్తులను, గొడ్డళ్ళను పట్టుకొనియుండును. కాని యుద్ధమున శత్రువులు తమను నాశనము చేయునపుడు కాని, దొంగలు తమను దోచుకొనునపుడుగాని అవి తమ్ము తాము రక్షించుకోజాలవు. 16. దీనినిబ్టి అవి దైవములు కావని ఋజువగుచున్నది. కనుక వానిని పూజింపకుడు.
17. దేవాలయములలో కూర్చుండియున్న ఆ దైవములు పగిలిపోయిన కుండలవలె నిష్ప్రయోజన మైనవి. గుడిలోనికి వచ్చువారు రేపుదుమ్ము వాని కన్నులనిండ పడును.
18. దొంగలు పడకుండుటకు పూజారులు గుళ్ళను తలుపులతోను, అడ్డు గడియల తోను బిగింతురు. కావున రాజద్రోహము చేయగా ఉరితీయుటకు బంధించి ఉంచిన ఖైదీలనువలె ఆ దైవములను చెరలోప్టిె తలుపులు బిగింతురు.
19. పూజారులు తాము మ్టుించు కొనిన దానికంటెకూడ అదనముగా తమ వేల్పులకు దీపములు మ్టుింతురు. కాని విగ్రహములు ఆ దివ్వెలలో ఒక్కదానిని గూడ చూడలేవు.
20. గుడి దూలములనువలె ఆ బొమ్మల అంతర్భాగమును గూడ చెదలు తినివేయును. వాని బట్టలను నాశనము చేయును. కాని వానికీ సంగతి కూడ తెలియదు.
21. గుడిలోని పొగవలన వాని మొగములు నల్లబారును.
22. గబ్బిలములు, వానకో విలలు, ఇతరపకక్షులు వాని తలలమీద, దేహముల మీద వాలును. పిల్లులు వాని పైకెక్కి కూర్చుండును.
23. దీనినిబ్టి అవి దైవములు కావని ఋజువగు చున్నది. కనుక మీరు వానిని పూజింపకుడు.
24. అందముగా ఉండుటకై ఆ బొమ్మలకు బంగారము పొదుగుదురు. కాని ఎవరైన వానిని రుద్దిననేగాని అవి మెరవవు. మూసలలో బొమ్మలుగా పోసినపుడు వానిక్టిె బాధయు కలుగలేదు.
25. ఎంత వెల ఇచ్చి కొనినను ఊపిరి పీల్చుకోజాలవు.
26. అవి తమ కాళ్లతో తాము నడవలేవు. ఇతరులు వానిని మోసికొని పోవలెను. దీనిని బట్టే అవెంత నిష్ప్రయోజనమైనవో తెలియుచున్నది.
27. ఆ దైవ ములను కొలుచువారుకూడ అవి క్రిందబడగా మరల పైకెత్తవలసి వచ్చినపుడు సిగ్గుపడుదురు. ఒకచోట నిలబ్టెిన పిదప అవి అడుగులు వేయలేవు. ప్రక్కకు ఒరిగినచో మరల నిలువుగా నిలబడలేవు. వానికి కాను కలు అర్పించుట శవముల కర్పించుటతో సమానము.
28. ఆ దైవములకర్పించిన అర్పణలను పూజారులు అమ్మి సొమ్ము జేసికొందురు. పూజారుల భార్యలు ఆ అర్పణములను పేదలకు అనాథలకు పంచి పెట్టరు. ఉప్పువేసి పదిల పరచుకొందురు.
29. ముట్టుతలు, బాలింతరాండ్రు గూడ వానిని ముట్టుకొందురు. దీనిని బ్టి అవి దైవములు కావని ఋజువగుచున్నది. కనుక మీరు వానిని గూర్చి భయపడకుడి.
30. కొయ్యతోను, వెండి బంగారముల తోను చేయబడిన ఈ విగ్రహములకు స్త్రీలు కూడ బలుల ర్పింతురు. అవి దైవములెట్లగును?
31. పూజారులు విలపించునపుడు చినిగినబట్టలుతాల్చి శిరస్సులు గొరి గించుకొని తలలు కప్పుకొనకయే గుళ్ళలో కూర్చుందురు.
32. జనులు చనిపోయిన దినమునందువలె పూజా రులు ఆ దైవములెదుట పెద్దగా అరచుచు కేకలు వేయుదురు.
33. వారు ఆ దేవతలకు తొడిగిన బట్టలను తమ ఆలుబిడ్డల కిత్తురు.
34. ఆ విగ్రహములకు అపకారము చేసినను ఉపకారముచేసినను ఒకటే. అవి తిరిగేమియు చేయజాలవు. అవి రాజులను చేయ జాలవు. రాజులను తలక్రిందులు చేయలేవు.
35. అవి ఎవరిని సంపన్నులను చేయలేవు. ఎవరికీ డబ్బీ యలేవు. ఎవడైన మ్రొక్కుబడిచేసి తీర్పకుండెనేని వానిచే ఆ మ్రొక్కుబడిని చెల్లింపజేయలేవు.
36. అవి ఎవనిని చావునుండి తప్పింపలేవు. దుర్బలుని బల వంతునినుండి కాపాడలేవు.
37. గ్రుడ్డివారికి చూపు నీయలేవు. ఆర్తిలోనున్నవారిని రక్షింపలేవు.
38. వితంతువులను, అనాథలను, కరుణతో ఆదుకొని సాయము చేయలేవు.
39. కొయ్యతో చేసి, వెండి బంగారములతో పొదిగిన ఈ దైవములు, కొండనుండి పగులగ్టొిన బండవలె నిరర్థకమైనవి. వానిని కొలుచు వారు అవమానము తెచ్చుకొందురు.
40. వానిని దైవములుగా భావించుట ఎట్లు? పేర్కొనుటెట్లు?
విగ్రహారాధనవలన ఫలితము లేదు
41. బబులోనీయులు తమ దైవములకే అపకీర్తి తెచ్చుచున్నారు. ఎవడైన మూగవాడు కన్పించినచో వానిని దేవాలయమునకు కొనిపోయి వాక్చక్తిని ప్రసాదింపుమని బేలు దేవతను అర్థింతురు. ఆ దేవత ఈ సంగతి నేమియు అర్థము చేసికోలేదు.
42. తాము కొలుచు దైవములు తమకు సాయము చేయలేవని తెలిసియు, ప్రజలు మూర్ఖముగా వానినే కొలుచు చుందురు.
43. ఇంకను స్త్రీలు నడుముచుట్టు త్రాళ్ళు చుట్టుకొని తవుడును సాంబ్రాణివలె కాల్చుచు, వేశ్య లుగా వర్తించుచు దారిప్రక్కన కూర్చుందురు. ఎవడై నను వారిలో ఒకతెను కొనిపోయి కూడెనేని, ఆమె తిరిగివచ్చి తన ప్రక్కన కూర్చుండి ఉన్న ఉవిదను పరిహాసము చేయును. నీవు అందగత్తెవు కాదు కనుక ఎవడును నీ త్రాిని త్రెంచి నిన్ను తీసికొని పోలేదని పలుకును.
44. ఈ విగ్రహములకు సంబంధించి నదంతయు వ్టి అనృతము. వానిని దేవతలని భావించుటకాని, పిలుచుటకాని తగునా?
45. వడ్రంగులును, కంసాలులును చేసిన ఇవి దైవములా? ఆ పనివారు ఉద్దేశించిన దానికంటే అవి ఎక్కువ కాజాలవు.
46. ఈ విగ్రహములను చేయువారే చిరకాలము జీవింపరు. మరి వారు దైవముల నెట్లు చేయుదురు?
47. ఈ పనివారు భావితరముల వారికి వంచనను, అవమాన మును వదిలిప్టిెపోవుచున్నారు.
48. యుద్ధములు, క్షోభములు సంభవించినపుడు విగ్రహములను తీసికొనిపోయి ఎక్కడ దాగుకొందమా అని పూజారులు ఆలోచన చేయుదురు.
49. ఈ విగ్రహములు ఆ సంఘటనలనుండి తమను తామే రక్షించుకోలేవు. కనుక ఇవి దైవములు కావని నరులేల గ్రహింపరు?
50. ఇవి వెండిబంగారములు పొదిగిన కొయ్యలు. వీని మోసము ఒక రోజున బయటపడకపోదు.
51. ఎల్ల జాతులును, ఎల్ల రాజులును విగ్రహములు నరమాత్రులు చేసినవనియు, వానికి దైవశక్తి లేదనియు గ్రహింతురు.
52. ప్రతివాడును అవి దైవములు కావని తెలిసికోవలెను.
53. అవి దేశమునకు రాజును నియమింపలేవు. ప్రజలకు వర్షము కురిపించలేవు.
54. తమ విషయ మును తామే చక్కబెట్టుకోలేవు. అన్యాయము జరిగిన వానికి న్యాయము చేకూర్చిపెట్టలేవు. కనుక అవి ఆకాశముననెగురు కాకులవలె నిరర్థకమైనవి.
55. దేవాలయమునకు నిప్పంటుకొనినచో పూజారులు పారిపోయి ప్రాణములు దక్కించుకొందురు. కొయ్యతో చేసి, వెండిబంగారములు పొదిగిన ఈ బొమ్మలు ఆ దేవాలయములోని దూలములతో పాటు కాలిపో వును.
56. అవి రాజులతోగాని, విరోధులతోగాని యుద్ధములు చేయలేవు. అవి దైవములని ఎవడు నమ్మును?
కొయ్యతో చేసి వెండిబంగారములను పొదిగిన ఈ ప్రతిమలు దొంగలనుండియు, దోపిడికాండ్ర నుండియు తమను తాము రక్షించుకోలేవు.
57. వారు వాని వెండి బంగారములను, ఉడుపులను దొంగి లించుకొని పోవుదురు. ఆయినను ఈ దైవములు వారినాపలేవు.
58. శూరుడైన రాజుకాని, గృహకృ త్యములకు ఉపయోగపడెడి కుండకాని ఈ దొంగ దైవములకంటెను మెరుగు. ఇంిలోని వస్తువులను కాపాడును గనుక తలుపు, ఈ దబ్బర దేవతలకంటె మేలు. ప్రాసాదమునందలి కొయ్యకంబము ఈ కల్ల దేవతలకంటే నయము.
59. దేవుడు వెలుతురునిచ్చుటకు సూర్యచంద్ర నక్షత్రములను చేసెను. అవి ఆయనమాట పాించును.
60. మెరుపులును, వాయువులును ఇట్లే మెలగును. మెరుపులను దూరమునుండి చూడవచ్చును. గాలి ఎల్ల తావులందును వీచును.
61. దేవుడు మబ్బులకు లోకమంతట క్రమ్మవలెనని ఆజ్జ ఈయగా అని అట్లే చేయును.
62. ఆయన కొండలను, అడవులను తగుల బెట్టుటకు ఆకసమునుండి అగ్గిని పంపును. అది ఆయన మాటమీరదు. రూపమునగాని, శక్తిలోగాని విగ్రహములు ఈ ప్రకృతి శక్తులతో సమానము కాజా లవు.
63. విగ్రహములు మనకు మేలుగాని, కీడుగాని చేయలేవు. కనుక వానినెవరును వేల్పులని ఎంచనక్కర లేదు, పిలువనక్కరలేదు.
64. అవి దైవములు కావు. కనుక మీరు వానికి భయపడవలదు.
65. ఈ దైవములు రాజులను దీవింపలేవు, శపింపలేవు. వారిపై వీనికి అధికారము లేదు.
66. అవి జాతుల మేలుకొరకు ఆకాశమున గురుతులు చూపింపలేవు. సూర్యచంద్రులవలె ప్రకాశింపలేవు.
67. వీని కంటె వన్యమృగములే మెరుగు. అవి కనీ సము అపాయమునుండి తప్పించుకొని పారిపోవును.
68. కనుక అవి దైవములు కావని రూఢిగా తెలియు చున్నది. కనుక మీరు వానిని పూజింపకుడు.
69. కొయ్యతోచేసి, వెండి బంగారములు పొదిగిన అన్యుల విగ్రహములు దోసతోటలోని దిష్టిబొమ్మతో సమానము. అవి కావలి కాయలేవు.
70. అవి పూల తోటలోని ముండ్లచెట్టు వింవి. పకక్షులను తోలివేయు టకు మారుగా తమమీదికి ఎక్కించుకొనును. అవి చీకిలోనికి విసరివేసిన శవములవింవి.
71. అవి ధరించిన నీల, రక్తవర్ణ వస్త్రములు చివికిపోవును. కనుక అవి దైవములు కావు. కడన చెదలు వానిని క్టొివేయును. అటు పిమ్మట ఎల్లరును వానిని చీదరించుకొందురు.
72. సజ్జనుడు విగ్రహములను పెట్టుకొని నగుబాట్లు తెచ్చుకొనడు. కనుక అతడు ఉత్తముడు.