2 1. మీరు నా ప్రజలని మీ యిస్రాయేలు సోదరుల తోను, జాలినొందినవారని మీ సోదరీమణులతోను మీరు చెప్పుడు.
వ్యభిచారిణియైన గోమేరు, వ్యభిచారిణివింవారైన యిస్రాయేలీయులు
2. ”బిడ్డలారా! మీరు మీ తల్లిని బ్రతిమాలుడు.
ఆమె నాకికభార్యకాదు, నేను ఆమెకు భర్తనుకాను.
ఆమె తన వ్యభిచారమును,
వేశ్యావృత్తిని మానవలెనని చెప్పుడు.
3. మానదేని, ఆమె ప్టుిననాడువలె
ఆమెను దిగంబరను చేయుదును.
ఆమెను ఎడారిగను,
ఎండిన నేలనుగను మార్చెదను.
అప్పుడామె దాహముతో చచ్చును.
4. నేనామె బిడ్డలపై నెనరుచూపను.
వారు వ్యభిచారిణి సంతానము.
వారి తల్లి వ్యభిచారిణిగా ప్రవర్తించెను.
ఆమె సిగ్గుమాలిన కులటయై ఆ బిడ్డలను కనెను.
5. ఆమె ‘నేను నా విటులవద్దకేగెదను.
వారు నాకు అన్నపానీయములు,
ఉన్ని, నార, ఓలివుతైలము,
ద్రాక్షాసారాయమును ఇచ్చెదరు’ అని పలికెను.
6. కనుక నేనామెకు అడ్డముగా
ముళ్ళకంచె వేయుదును.
ఆమె గమనమును
నిరోధించుటకు గోడ కట్టుదును.
7. ఆమె తన విటులవెంటబడునుగాని
వారు ఆవిడకు దొరకరు.
వారికొరకు ఆమె గాలించునుగాని
వారావిడ కంటబడరు.
అప్పుడామె ‘నేను నా మొది భర్తవద్దకేగెదను, ఇప్పికంటె అప్పుడే
నేను సుఖముగానుింని’ అని పలుకును.
8. తనకు ధాన్యమును, ద్రాక్షాసారాయమును,
ఓలివుతైలమును ఇచ్చినది నేనేయనియు,
నేనొసగిన వెండిబంగారములనే
తాను బాలుపూజకు వినియోగించుకొనెననియు, ఆమె అంగీకరింపదుకదా!
9. కావున కోతకాలము వచ్చినపుడు
నేనావిడకు ధాన్యమును,
ద్రాక్షాసారాయమును ఈయను.
బట్టలు తయారుచేసికొనుటకు
ఆమెకిచ్చిన ఉన్నిని, నారను మరల తీసికొందును.
10. ఆమె విటులఎదుటనే
ఆమెను దిగంబరను చేయుదును.
నా బారినుండి ఆమెనెవరును కాపాడజాలరు.
11. ఆమె ఉత్సవములను మాన్పింతును.
అమావాస్యనాడును, విశ్రాంతిదినములందును,
సాంవత్సరిక దినములందును
ఆమె చేయు పండుగలను ఆపుదును.
12. ఆవిడ ‘నా విటులు నాకు కట్నముగానిచ్చిరి’
అని చెప్పుకొను ద్రాక్షతోటలను,
అంజూరపుతోటలను నాశనము చేయుదును. ఆ తోటలను బీళ్ళుగా మార్చెదను.
వన్యమృగములు వానిని పాడుచేయును.
13. నన్ను మరిచిపోయినందులకు
బాలుదేవతకు సాంబ్రాణిపొగ వేసినందులకు,
నగలతో సింగారించుకొని బయలుదేరి
విటుల వెంటబడినందులకు
నేనామెను శిక్షింతును.
ఇది ప్రభువు వాక్కు.
ప్రభువునకు తన ప్రజలపైగల ప్రేమ
14. నేనామెను మరల ఆకర్షించి
ఎడారిలోనికి కొనిపోవుదును.
అచామెతో ప్రేమసంభాషణములు నడుపుదును.
15. ఆమె ద్రాక్షతోటలను
ఆమెకు మరల ఇచ్చివేయుదును.
కష్టమయమైన ఆకోరు లోయను
ఆమెకు మరల ఆశాజనకమైన
దానినిగా చేయుదును.
తాను యువతిగానున్నప్పుడువలె,
ఐగుప్తునుండి తరలి వచ్చినపుడువలె
ఆ ఎడారిలో ఆమె నాపట్ల
మరల ప్రేమచూపును.
16. అంతట ఆమె ఇక ‘నేను తన బాలును’1
అని కాక, ‘నేను తన భర్తను’ అని చెప్పును.
ఇది ప్రభువు వాక్కు.
17. నేనామెను బాలుదేవర అన్న పదమును
ఉచ్చరింపకుండునట్లు చేయుదును.
ఇక బాలుదేవర అన్న శబ్ధమును
ఆమె జ్ఞప్తియందుంచుకొనదు.
18. ఆ కాలమున నేను వన్యమృగములతోను,
ఆకాశపకక్షులతోను, ప్రాకెడిజంతువులతోను
నిబంధనము చేసికొందును.
కనుక అవి నా ప్రజలను బాధింపజాలవు.
నేను దేశమునుండి యుద్ధసామగ్రిని,
కత్తులను, విండ్లను తొలగింతును.
కావున నా ప్రజలు శాంతిభద్రతలలో జీవింతురు.
19. యిస్రాయేలూ!
నేను నిన్ను నా భార్యగా చేసికొందును.
నీతితో, న్యాయముతో, కరుణతో, కృపతో
నిన్ను కలకాలము నాదానిగా చేసికొందును.
20. నమ్మదగినతనముతో నిన్ను
నా భార్యగా చేసికొందును.
నేను ప్రభుడనని నీవు గ్రహింతువు.
21-22. ఆ కాలమున నేను
నా ప్రజలైన యిస్రాయేలీయుల
మనవులను ఆలింతును.
ఆకసమునుండి నేలమీదికి వానను పంపుదును.
భూమిమీద ధాన్యము,
ద్రాక్షలు, ఓలివులు పండును.
23. నేను నా ప్రజలు తమ దేశమునవసించి
పెంపుచెందునట్లు చేయుదును.
‘జాలినొందనివారు’ అనబడువారికి
జాలిని చూపుదును.
‘నా ప్రజలు కానివారు’ అనబడువారితో
‘మీరు నా ప్రజలు’ అని చెప్పుదును.
వారు ”నీవు మా దేవుడవు” అని
బదులు పలుకుదురు.