యిస్రాయేలు స్వీయదేశమునకు

తిరిగి వచ్చును

31 1. ప్రభువు ఇట్లనుచున్నాడు:

                              ”నేను యిస్రాయేలు తెగలన్నింకి

                              దేవుడను. కాగా వారు

                              నాకు ప్రజలగు రోజులు వచ్చుచున్నవి.

2. ”మృత్యువును తప్పించుకొన్నవారికి

               ఎడారిలో నేను కరుణచూపితిని.

               యిస్రాయేలీయులు విశ్రాంతిని కోరగా

3.           నేను దూరమునుండి వారికి దర్శనమిచ్చితిని.

               యిస్రాయేలీయులారా!

               శాశ్వతమైనప్రేమతో నేను మిమ్ము ప్రేమించితిని.

               ఇప్పుడుకూడ మిమ్ము నిత్యప్రేమతో ప్రేమింతును.

4.           నేను మిమ్ము పునర్నిర్మింతును.

               మీరు మరల తంత్రీవాద్యములు గైకొని,

               సంతసముతో నాట్యము చేయుదురు.

5.           మీరు తిరిగి సమరియా కొండలమీద

               ద్రాక్షతోటలు నాటుదురు.

               నాి ఆ తోటలు కాయుఫలములను ఆరగింతురు

6.           ఎఫ్రాయీము కొండలమీదినుండి కావలివారు

               ‘లెండు, సియోనునవున్న మన దేవుడైన

               ప్రభువు చెంతకు పోవుదము రండు’

               అని అరచు రోజులు నిర్ణయమయ్యెను.”

7.            ప్రభువు ఇట్లనుచున్నాడు:

               ”మీరు జాతులన్నిలోను తలమానికమైన

               యిస్రాయేలును తలంచుకొని

               సంతసముతో పాడుడు.

               ‘ప్రభువు తన ప్రజలను రక్షించెను,

               శేషజనమును విమోచించెను’

               అని పలుకుచు స్తుతి గానముచేయుడు.

8.           ఉత్తరదేశమునుండి నేను వారిని తోడ్కొనివత్తును.

               నేల అంచులనుండి వారిని కొనివత్తును.

               గ్రుడ్డివారును, కుింవారును, గర్భవతులును,

               ప్రసవించుటకు సిద్ధముగానున్నవారును

               ఎల్లరును కలిసి మహాసమూహముగా తిరిగివత్తురు

9.           నేను వారిని నడిపించుకొనిరాగా

               వారు ఏడ్పులతోను, ప్రార్థనలతోను తిరిగివత్తురు.

               నేను ఆ ప్రజలను

               తిన్నని మార్గమున నడిపింతును.

               వారు కాలుజారి పడిపోరు.

               వారిని జలప్రవాహముల వద్దకు కొనివత్తును.

               నేను యిస్రాయేలునకు తండ్రిని అగుదును. ఎఫ్రాయీము నాకు తొలిచూలు బిడ్డడగును.

10. ప్రభువిట్లు నుడువు చున్నాడు:

               ”అన్యజాతి ప్రజలారా!

               మీరు నా పలుకులు ఆలింపుడు.

               దూరప్రాంతముల వారికి

               నా పలుకులు ఇట్లు వినిపింపుడు.

               ‘నేను యిస్రాయేలును చెల్లాచెదరు చేసితిని.

               కాని వారిని మరల ప్రోగుచేయుదును.

               కాపరి మందనువలె

               వారిని కాచి కాపాడుదును.’

11.           నేను యిస్రాయేలునకు

               దాస్యవిముక్తి కలిగించితిని.

               వారికంటె బలాఢ్యులైన వారినుండి

               వారిని విడిపించితిని.

12. వారు తిరిగివచ్చి సియోను కొండమీద

               సంతసముతో పాటలు పాడుదురు.

               నా ఔదార్యమునుగాంచి సంతసింతురు.

               నేను వారికి ధాన్యమును, ఓలివుతైలమును,

               గొఱ్ఱెలమందలను, గొడ్లమందలను

               బహూకరింతును.

               వారిక విచారమునకు గురికాక

               నీరుక్టిన తోటవలె కళకళలాడుదురు.

13.          అపుడు యువతులు ఆనందముతో

               నాట్యము చేయుదురు.

               వృద్ధులును, యువకులును సంతసింతురు.

               నేను వారి శోకమును నాట్యముగామార్చి

               వారికి ఓదార్పు దయచేయుదును.

               సంతాపమునకు బదులుగా

               ప్రమోదమును ఒసగుదును.

14. నేను నా యాజకులకు

               ప్రశస్తభోజనము పెట్టుదును.

               నా ప్రజలకు మేలివస్తువులు అనుగ్రహింతును. 

               ఇది ప్రభుడనైన నా వాక్కు.”

ప్రభువు యిస్రాయేలునకు దయజూపును

15. ప్రభువు ఇట్లనుచున్నాడు:

               రామానుండి అంగలార్పులు విన్పించుచున్నవి.

               దారుణమైన శోకాలాపములు

               చెవిని బడుచున్నవి.

               రాహేలు తన బిడ్డలకొరకై విలపించుచు

               ఓదార్పును పొందజాలకున్నది.

16. ప్రభువిట్లనుచున్నాడు:

               నీ ఏడ్పును ఆపుకొనుము.

               నీ కన్నీిని తుడుచుకొనుము.

               నీ బిడ్డలకు నీవు చేసిన సేవకు ఫలితము దక్కును.

               వారు శత్రుదేశమునుండి మరలివత్తురు.

17. నీ సంతతికి మంచిరోజులు వచ్చును.

               నీ బిడ్డలు స్వీయదేశమునకు తిరిగివత్తురు.

18. ‘ప్రభూ! నీవు కాడికిలొంగని

               కోడెను శిక్షించినట్లుగా నన్ను శిక్షించితివి.

               నీవు నా మనసును మరలింపుము.

               నా దేవుడవైన నీ చెంతకు నేను తిరిగివత్తును’

               అని ఎఫ్రాయీము పరితపించుచుండగా

               నేను వింని.

19. నేను నీ నుండి వైదొలగితిని.

               కాని ఇప్పుడు నీ చెంతకు రాగోరెదను.

               నీవు నన్ను శిక్షించినపిదప

               నేను దుఃఖముతో రొమ్ము బాదుకొనుచున్నాను.

               నేను యవ్వనమున చేసిన పాపములకుగాను

               సిగ్గుతో తలవంచుకొనుచున్నాను.

20. ఎఫ్రాయీము! నీవు నాకు ఇష్టుడవైన పుత్రుడవు.

               నాకు ప్రీతిపాత్రుడవు.

               నేను నీ గూర్చి మ్లాడునపుడెల్ల

               నీ జ్ఞాపకము నన్ను విడువకున్నది.

               నీ గూర్చి నా కడుపులో చాల వేదనగానున్నది.

               నేను నీమీద తప్పక కరుణచూపెదను.

               ఇది ప్రభువు వాక్కు.

21.          మార్గనిర్ధేశక రాళ్ళను నెలకొల్పుడు.

               సంజ్ఞాస్తంభములను పాతుడు.

               నీవు వెళ్ళిపోయిన త్రోవను గుర్తింపుము.

               యిస్రాయేలు కన్యా! నీవు మరలిరమ్ము.

               ఈ నీ నగరములకు మరలిరమ్ము.

22.        విశ్వాసహీనులైన ప్రజలారా!

               మీరెన్నాళ్ళు సందేహింతురు?

               నేను భూమిపై నూతనమైన కార్యమును

               సృజించితిని: ‘స్త్రీ1 పురుషుని ఆవరించును.’

యూదాకు చెరనుండి విముక్తి

23. సైన్యములకు అధిపతియు యిస్రాయేలు దేవుడునైన ప్రభువు ఇట్లు అనుచున్నాడు: ”నేను ప్రజలను చెరవిడిపించి, వారి దేశమునకు గొనివచ్చిన పిదప వారు యూదా దేశమునను, దాని నగరముల లోను

‘రక్షణపర్వతమా! పవిత్రనగరమా!

ప్రభువు నిన్ను దీవించునుగాక!’

అని పలుకుదురు.

24. ప్రజలు యూదా దేశమునను, దాని నగరములలోను వసింతురు. రైతులును, మందలతోగూడిన కాపరులును కలిసి జీవింతురు.

25. నేను అలసిపోయిన వారికి ఓదార్పు నొసగుదును. ఆకలివలన కృశించిన వారిని ఆహార ముతో సంతృప్తిపరతును.”

26. కనుక జనులు:

‘మేము మేలుకొని ఆలోచింపగా

నిద్ర బహు వినోదమాయెను’

అని పలుకుదురు.

యిస్రాయేలు, యూదా

27. ప్రభువు ఇట్లనుచున్నాడు: ”నేను యిస్రా యేలు, యూదా దేశములను మరల ప్రజలతోను, పశువులతోను నింపుకాలము వచ్చుచున్నది.

28. నేను పూర్వము వారిని దీక్షతో పెల్లగించితిని, పడగ్టొితిని, నేలమట్టము చేసితిని, నాశనము చేసితిని, కూలద్రోసి తిని. ఆ రీతినే ఇపుడు వారిని దీక్షతో నాటుదును, నిర్మింతును. ఇది ప్రభుడనైన నా వాక్కు.

వ్యక్తిగతమైన బాధ్యత

29. ఆ కాలము వచ్చినపుడు ప్రజలు:

‘తండ్రులు పుల్లని ద్రాక్షపండ్లు భుజింపగా,

     తనయులకు పండ్లుపులుపెక్కెను’

అని అనరు.

30. ఎవడు పుల్లని ద్రాక్షపండ్లు భుజించునో వానికే పండ్లు పులుపెక్కును. ఎవని పాప మునకు వాడేచచ్చును.

నూత్న నిబంధనము

31. ప్రభువు ఇట్లనుచున్నాడు: నేను యిస్రా యేలు ప్రజలతోను, యూదా ప్రజలతోను నూత్న నిబంధనము చేసికొను రోజులు వచ్చుచున్నవి.

32. కాని అది పూర్వము నేను పితరులను చేతితో బట్టుకొని ఐగుప్తునుండి వెలుపలికి తోడ్కొని వచ్చినప్పుడు వారితో చేసికొనిన నిబంధనము విందికాదు. నేను వారికి ప్రభుడనైనను, వారు నా నిబంధనమును మీరిరి.

33. ఆ దినము వచ్చినపుడు నేను యిస్రాయేలు ప్రజలతో చేసికొను నిబంధనమిది. నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగముననుంతును. వారి హృదయము లపై లిఖింతును. నేను వారికి దేవుడనగుదును, వారు నా ప్రజలగుదురు.

34. వారిలో ఎవడును తన పొరుగువానికి ‘దేవుని తెలిసికొనుటనుగూర్చి బోధింప నక్కరలేదు. అల్పులు, అధికులెల్లరు నన్ను తెలిసి కొందురు. నేను వారి పాపములను మన్నింతును. వానినిక జ్ఞప్తియందు ఉంచుకొనను. ఇవి ప్రభుడనైన నా పలుకులు.”

యిస్రాయేలు శాశ్వతముగా మనును

35. పగలు వెలుతురునిచ్చుటకు సూర్యుని,

               రేయి వెలుగునిచ్చుటకు చంద్రతారకలను

               నియమించినవాడును,

               సముద్రతరంగములనురేపి

               వానిచే ఘోషణ చేయించువాడును,

               సైన్యములకు అధిపతియని పిలువబడువాడును

               అయిన ప్రభువిట్లు చెప్పుచున్నాడు:

36. ”నియమబద్ధమైన ఈ జగత్తు

               నా యెదుటనుండి తొలగిపోయెనేని,

               యిస్రాయేలు సంతతికూడ నా యెదుట

               ఒక జాతిగా శాశ్వతముగా మనకపోవును.

               ఇదే యావే వాక్కు.

37.         పైనున్న ఆకాశామును కొలుచుటయు,

               క్రిందనున్న భూమి పునాదులను శోధించుటయు,

               ఎవనికైన శక్యమైనయెడల

               యిస్రాయేలు చేసిన అంతినిబ్టి

               నేను వారినందరిని తోసివేతును.

               ఇది ప్రభుడనైన నా వాక్కు.

యెరూషలేము పునర్నిర్మాణము

38. ప్రభువు ఇట్లు అనుచున్నాడు: ”హనన్యేలు నుండి బురుజు మూలద్వారమువరకును, యెరూషలేము నా నగరముగా నిర్మింపబడు రోజులు వచ్చుచున్నవి.

39. దాని సరిహద్దు అచినుండి గారేబు కొండ వరకును, అచినుండి గోయావరకును పోవును.

40. మృతులను పాతిప్టిె చెత్తచెదారము కుమ్మరించు లోయయంతయు నా పేరిట పవిత్రస్థలమగును. అట్లే కెద్రోనునది మీదిభాగమునను, తూర్పున అశ్వ ద్వారము వరకును వ్వాపించియున్న పొలములు  కూడ నా పేరిట పవిత్రస్థలమగును. ఈ పట్టణమునిక ఎవరును పడగొట్టరు. నాశనము చేయరు.”