మందసమును దేవాలయమునకు కొనితెచ్చుట
8 1. సొలోమోను యెరూషలేము నుండి యిస్రా యేలు తెగలపెద్దలనందరిని తన చెంతకు పిలి పించెను. దావీదునగరమైన సియోనునుండి ప్రభు మందసమును తెప్పింపవలెనని వారితో చెప్పెను.
2. ఏతానీము అనబడు ఏడవనెలలో గుడారముల పండుగ జరుగునప్పుడు యిస్రాయేలు పెద్దలందరు సొలోమోను చెంతకు వచ్చిరి.
3-4. అపుడు యాజ కులు ప్రభుమందసమును ఎత్తి దేవాలయమునకు కొనివచ్చిరి. వారితోపాటు లేవీయులు గుడారమును, దాని పరికరములనుకూడ కొనివచ్చిరి.
5. సొలోమోను రాజు, యిస్రాయేలు ప్రజలు యావేమందసము ఎదుటప్రోగై లెక్కలేనన్ని పొట్టేళ్ళను, ఎడ్లను బలిగా సమర్పించిరి.
6. అంతట యాజకులు నిబంధన మందసమును ఎత్తి దేవాలయమునందలి మహా పవిత్రమయిన గర్భగృహమున కెరూబుదూతల ప్రతి మల రెక్కలక్రింద ఉంచిరి.
7. ఆ కెరూబుదూతల రెక్కలు నిబంధనమందసమును, దానిని మోయు గడలనుకూడ కప్పుచుండెను.
8. ఆ గడలు చాల పొడవుగా ఉన్నందున గర్భగృహమునకు ఎదురుగా దేవాలయములోని పవిత్రస్థలమునందు నిలబడి చూచువారికి కూడ కనిపించునంత నిడివిగలవై యుండెను. కాని బయటనిలబడి చూచువారికి మాత్రము కనిపింపవయ్యెను. నేికిని అవి అక్కడనే యున్నవి.
9. హోరేబు కొండవద్ద మోషే ఉంచిన రెండు రాతిపలకలుతప్ప మందసమున మరియేమియు లేవు. యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలివచ్చి నప్పుడు ప్రభువు ఆ కొండచెంతనే వారితో నిబంధన చేసికొనెను.
ప్రభువు దేవాలయమున నెలకొనుట
10. యాజకులు దేవాలయము నుండి వెలుపలికి రాగానే మేఘము ఆ దేవాలయమున క్రమ్ముకొనెను. 11. ప్రభువుతేజస్సు నిండుకొనియుండుటచే వారు మరల దేవాలయమున ప్రవేశించి అర్చన చేయలేక పోయిరి. 12-13. అపుడు సొలోమోను ఇట్లు ప్రార్థించెను.
”ప్రభూ!
కారుమబ్బున నెలకొనియుండుట నీకిష్టము.
నేను నీకొక మందిరము నిర్మించితిని.
నీవు ఎల్లవేళల వసించుటకు
ఒక దేవళము క్టితిని.”
సొలోమోను ప్రజలతో సంభాషించుట
14. అంతట సొలోమోను యిస్రాయేలు సమా జమువైపు మరలి వారిని దీవించెను.
15. అతడు వారితో ఇట్లనెను ”ప్రభువు మా తండ్రియైన దావీదు నకు చేసిన ప్రమాణములను నిలబెట్టుకొనెను. ఆయన స్తుతింపబడునుగాక!
16. అతడు ‘నా ప్రజలను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చినప్పినుండియు యిస్రా యేలు దేశమున ఏ పట్టణమునగూడ నా నామము దాని యందుండునట్లు ఏ దేవాలయమును నిర్మించుటకు నేను అంగీకరింపలేదు. కాని నా ప్రజలను పరిపా లించుటకు దావీదును ఎన్నుకొింని’ అనెను.
17. మా తండ్రి దావీదు యిస్రాయేలు దేవుడైన యావేను కొలుచుటకై మందిరమును కట్టగోరెను.
18-19. కాని ప్రభువు అతనితో ‘నీవు నాకు మందిరమును కట్టగోరి తివి. అది మంచి కోరికయే. అయినను నీవు నాకు దేవాలయమును కట్టజాలవు. నీకు పుట్టబోవు కుమా రుడు నాకు దేవాలయము నిర్మించును’ అని చెప్పెను.
20. యావే తాను చేసిన వాగ్ధానమును నిలబెట్టు కొనెను. మా తండ్రి దావీదు స్థానములో నేను యిస్రా యేలీయులకు రాజునైతిని. యిస్రాయేలు దేవుడు యావేను ఆరాధించుటకై నేను దేవాలయమును నిర్మించితిని.
21. అందులో యావే నిబంధన మందసమునకు స్థలమును ప్రత్యేకించితిని. ప్రభువు మన పితరులను ఐగుప్తునుండి తరలించుకొని వచ్చి నపుడు వారితో చేసుకొనిన నిబంధన అందులోనే యున్నది.
సొలోమోను తన కొరకు ప్రభుని మనవి చేయుట
22. సొలోమోను యిస్రాయేలీయుల నడుమ యావే బలిపీఠమునకు ఎదురుగా నిలుచుండి చేతులు పైకెత్తి ఇట్లు ప్రార్థించెను.
23. ”యిస్రాయేలు ప్రభుడవైన దేవా!
పై ఆకాశమునందుగాని,
క్రింది భూమినందుగాని నీ విం దేవుడు లేడు.
నీవు చెప్పిన నిబంధనవాగ్ధానములను
నెరవేర్చుకొందువు.
పూర్ణహృదయముతో
నీ ఆజ్ఞలను పాించు భక్తులను
ఆదరముతో చూతువు.
24. నీవు మా తండ్రి దావీదునకిచ్చిన
మాట నిలబెట్టుకొింవి.
ఈనాడు నీ వాగ్ధానములు
క్రియాపూర్వకముగా నెరవేరినవి.
25. యిస్రాయేలు ప్రభుడవైన దేవా!
నీవు మా తండ్రికి చేసిన
మరియొక వాగ్ధానమునుకూడ నిలబెట్టుకొనుము.
‘నీవలె నీసంతతివారును
నా ఆజ్ఞలను పాింతురేని,
నీ తరువాత యిస్రాయేలును పరిపాలించుటకై
వీరినుండి ఎప్పుడును
ఒక రాజును ఎన్నుకొనుచునే ఉందును’
అని నీవు బాసచేసితివి!
26. కనుక ప్రభూ! నీ సేవకుడును,
మా తండ్రియైన దావీదునకు
నీవిచ్చిన ఈ మాటపట్టునుకూడ
దక్కించుకొనుమని మనవి చేయుచున్నాను.
27. అయినను దేవుడు భూమిమీద వసించునా?
ప్రభో! ఆకాశమహాకాశములు సహితము
నిన్ను ఇముడ్చుకోజాలవనిన
ఇక నేను క్టిన ఈ కొద్దిపాి
దేవాలయమున నీవు ఇముడుదువా?
28. ప్రభో! ఈ సేవకుని దీనాలాపములు ఆలింపుము.
చెవియొగ్గి ఈ భక్తుని మొరవినుము.
29. రేయింబవళ్ళు ఈ దేవాలయమును
కాచి కాపాడుచుండుము.
కనుక నేడు నీ సేవకుడు
ఈ దేవళమునందు చేయు ప్రార్థననాలింపుము.”
సొలోమోను ప్రజలకొరకు ప్రభుని మనవిచేయుట
30. ”ప్రభో! నీ సేవకుడనైననేను,
నీ ప్రజలైన ఈ యిస్రాయేలీయులు
ఈ దేవాలయమునుండి
చేయు ప్రార్థనలను వినుము.
ఆకాశమునందలి నీ నివాసమునుండి
మా వేడికోలు ఆలింపుము.
ఆలించి మా తప్పిదములను మన్నింపుము.
31. ఎవడైనను తన తోడినరునికి
అపరాధము చేసినచో,
ఆ తోినరుడు అతనిని ఈ దేవాలయమునందలి
బలిపీఠమెదుికి కొనివచ్చి
అతనిచే ప్రమాణము చేయించినచో,
32. ఆకాశమునుండి నీవు వారి పలుకులు ఆలింపుము.
ఆలించి దోషులను కఠినముగా శిక్షింపుము.
నిర్దోషులను తగినరీతిగా సన్మానింపుము.
33. నీ ప్రజలైన యిస్రాయేలీయులు
పాపము చేసినందున
తమ శత్రువులచేత ఓడిపోయి
మరల నీ శరణుజొచ్చి ఈ దేవళమున
నిన్నుస్తుతించి క్షమాపణము అడుగుకొన్నచో,
34. ఆకాశమునుండి నీవు
వారి వేడుకోలును ఆలింపుము.
వారి తప్పిదమును మన్నింపుము.
నీవు వారి పూర్వులకిచ్చిన
ఈ నేలకు వారిని మరల చేర్చుము.
35. ఈ ప్రజలు తప్పిదము చేసినందున
నీవు వానలు కురియింపనిచో,
వారు ఈ దేవళమునకు వచ్చి
నిన్ను స్తుతించి తమ పాపములకు
పశ్చాత్తాపపడినచో,
36. నీవు ఆకాశమునుండి
వారి మొరలను ఆలకింపుము.
రాజు, ప్రజలు చేసిన పాపములను క్షమింపుము.
వారు నడువవలసిన మార్గమును చూపింపుము.
నీ ప్రజలకు వారసత్వభూమిగా ఇచ్చిన
ఈ నేలమీద మరల వానలు కురిపింపుము.
37. ఈ దేశమున కరువుగాని, అంటువ్యాధిగాని
అలముకొనుట, బెట్టవలనగాని, చిత్తడివలనగాని,
మిడుతలదండు లేక చీడపురుగువలనగాని
పైరు నాశనమగుట, శత్రువులు వచ్చి
పట్టణములను ముట్టడించుట,
వ్యాధులు సోకుట – మొదలైన
38. ఉపద్రవములు కలుగగా
ఈ ప్రజలు నీకు మొరపెట్టుకొన్నచో
నీవు వారి వేడికోలును ఆలింపుము.
నీ ప్రజలైన యిస్రాయేలీయులలో
ఎవరైన పూర్ణపశ్చాత్తాపముతో
ఈ దేవాలయమువైపు చేతులెత్తి ప్రార్థనచేసినచో నీవు ఆకాశమునుండి
39. వారి మనవి నాలకింపుము.
వారి తప్పిదములను మన్నించి
వారికి మేలుచేయుము.
ఎవరెవరి శీలమునకు తగినట్లుగా
వారిని సన్మానింపుము.
నరుల హృదయములు తెలిసినవాడవు నీవొక్కడివే.
40. ఇటులయినచో ఈ జనులు,
నీవు మా పితరులకిచ్చిన
ఈ నేలమీద వసించునంత కాలము
నీయెడల భయభక్తులు చూపుదురు.
ఇతరాంశములు
41. దూరదేశములందు నివసించు
అన్యజాతిజనులు నీ కీర్తిని విని,
42. ఈ ప్రజలను రక్షించుటకై
నీవుచేసిన గొప్పకార్యములను తెలిసికొని,
నిన్ను ప్రార్థించుటకు ఈ దేవళమునకు వచ్చినచో
43. నీవు వారి మొరనాలింపుము.
ఆకాశమునందలి నీ నివాసమునుండి
వారి వేడుకోలువిని వారి కోర్కెలు తీర్చుము.
ఇట్లయినచో ప్రపంచములోని
అన్యజాతి జనులెల్లరు నీ సొంత ప్రజలవలె
నీయెడల భయభక్తులు వెల్లడింతురు.
నేను నిర్మించిన ఈ దేవాలయములోనే
నీ పేరు ప్రసిద్ధమైనదని వారెల్లరు తెలిసికొందురు.
44. నీవు పంపిన నీ ప్రజలు
శత్రువులమీదికి యుద్ధమునకు పోయినపుడు,
ఏ మార్గములోనైనా వారిని నీవు పంపినపుడు,
నీవెన్నుకొనిన ఈ పట్టణమువైపు,
నేను నిర్మించిన ఈ దేవాలయమువైపు తిరిగి
నిన్ను ప్రార్థించినచో,
45. ఆకాశమునుండి నీవు వారి మొరనాలకింపుము.
వారికి విజయమును ప్రసాదింపుము.
46. నరులలో పాపము చేయనివారెవరును లేరు
కనుక ఈ ప్రజలు
నీకు ద్రోహముగా పాపముచేయగా,
నీవు వీరిపైకోపించి వీరిని శత్రువులపాలుచేయగా,
ఆ శత్రువులు వీరిని దూరముననో,
దగ్గరనో ఉన్న తమదేశమునకు చెరగొనిపోగా,
47. ఆ పరదేశమున వీరు పశ్చాత్తాపపడి
తాము దుర్మార్గపుపనులు చేసిన పాపులమని
ఒప్పుకొని నిన్ను ప్రార్థించినచో
నీవు వీరి మొర ఆలింపుము.
48. ఆ శత్రుదేశమున వీరు చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడి,
నీవు పితరులకిచ్చిన ఈ నేలవైపు
నీవు ఎన్నుకొనిన ఈ పట్టణమునుండి
నేను క్టిన ఈ దేవాలయమువైపు తిరిగి
ప్రార్థన చేయగా,
49. ఆకాశమునందలి నీ నివాసస్థలమునుండి
నీవు వీరి వేడుకోలు ఆలింపుము.
50. ఈ ప్రజల తప్పిదమును, వీరు నీ మీదచేసిన
తిరుగుబాటును, మన్నింపుము.
వీరి శత్రువులు వీరిని
దయతో ఆదరించునట్లు చేయుము.
51. వీరు ఐగుప్తునుండి
ఆ దేశప్రజల ఇనుప పిడికిళ్ళనుండి
నీవు కొనివచ్చిన నీ సొంత జనము.
52. నీ ప్రజలైన యిస్రాయేలీయులుగాని,
నీ దాసుడనైన నేనుగాని నీకు మొరపెట్టుకోగా
నీవు ఆదరముతో ఆలకించి
వారి ఇక్కట్టులను తొలగింపుము.
53. నీవు మా పితరులను ఐగుప్తునుండి
తరలించుకొని వచ్చినపుడు
నీ సేవకుడు మోషేతో చెప్పినట్లుగా
సమస్త జాతులనుండి ఈ ప్రజను
నీ సొంత జనముగా ఎన్నుకొింవిగదా!”
ప్రార్థనానంతరము, ప్రజలకు దీవెనలు
54. సొలోమోను బలిపీఠము ముందు మోకా ళ్ళూని చేతులెత్తి పైవిధముగా ప్రభుని ప్రార్థించెను. అటుతరువాత అతడు లేచినిలుచుండెను.
55. అతడు గొంతెత్తి యిస్రాయేలు సమాజమును దీవించుచు ఇట్లనెను:
56. ”ప్రభువు తాను మాటఇచ్చినట్లే
యిస్రాయేలు ప్రజలకు శాంతిని ప్రసాదించెను.
యావే తన సేవకుడు మోషేద్వారా చేసిన
మంచి మాటపట్టులన్నియు నెరవేరినవి.
ఆయనకు స్తుతికలుగు గాక!
57. ప్రభువు మన పితరులకువలె
మనకు బాసటయై ఉండునుగాక!
ఆయన మనల చేయివిడువకుండునుగాక!
58. ప్రభువు మనపితరులకిచ్చిన ఆజ్ఞలన్నియు
మనము పాించునట్లును,
నిరంతరము ఆయనకు
విధేయులమైయుండునట్లును
మన హృదయములకు ప్రబోధముకలిగించుగాక!
59. నేనిపుడుచేసిన ఈ వేడికోలు రేయింబవళ్ళు
మన దేవుడైన యావేసన్నిధిని ఉండునుగాక!
ఆయన యిస్రాయేలును,
వారి రాజును ఎల్లవేళల గుర్తుంచుకొనుచు,
ప్రతిదినము వారి కోర్కెలు తీర్చుచుండునుగాక!
60. ఈ రీతిగా జరిగినచో భూమిమీది జనులెల్లరు
ప్రభువుతప్ప మరొక దేవుడు లేడని విశ్వసింతురు.
61. మీరు కూడ నేివలె ఎల్లప్పుడును
ప్రభువు అజ్ఞలను పాించుచు
ఆయనమీదనే మనసునిలిపి జీవింతురుగాక!”
దేవాలయ ప్రతిష్ఠ, పశుబలులు
62. సొలోమోను రాజు, యిస్రాయేలు ప్రజలు ప్రభువునకు బలులర్పించిరి.
63. అతడు ఇరువది రెండువేలఎడ్లను, లక్ష ఇరువదివేల పొట్టేళ్ళను సమా ధానబలిగా సమర్పించెను. ఆ రీతిగా రాజు ప్రజలు కలిసి దేవాలయమును ప్రతిష్ఠించిరి.
64. రాజు ఆ రోజుననే దేవాలయమునకు ముందటనున్న ఆవరణపు మధ్యభాగమును కూడ దేవునికి ప్రతిష్ఠించెను. అచటనే అతడు దహనబలులు, ధాన్యబలులు, క్రొవ్వువేల్చిన సమాధానబలులు సమర్పించెను. దేవాలయము ఎదుటనున్న ఇత్తడి బలిపీఠము చిన్నదైనందున దాని మీద ఈ బలులన్నిని సమర్పించుటకు వీలుపడలేదు.
65. అంతట సొలోమోను, ఉత్తరమున హమాతు కనుమనుండి దక్షిణమున ఐగుప్తు సరిహద్దు వరకుగల దేశమునుండి వచ్చిన యిస్రాయేలు మహాజనులంద రునుకూడి ప్రభుసమక్షమున ఏడురోజులపాటు గుడార ముల పండుగ జరుపుకొనిరి.
66. ఎనిమిదవ దిన మున సొలోమోను ప్రజలను పంపివేసెను. వారు ప్రభువు తనసేవకుడైన దావీదునకును, యిస్రాయేలు ప్రజలకును చేసిన మంచికార్యములు తలచుకొని సంతోషించుచు, రాజును కొనియాడుచు, తమ తమ నివాస ములకు వెడలిపోయిరి.