ఉపోద్ఘాతము:

పేరు: యోవేలు అను పదమునకు  ”యావే దేవుడు” అని అర్థము. (1 రా.ది.చ. 4:35; 5:4; ఎజ్రా 10:43).ఇతడు పెతూవేలు కుమారుడు.

కాలము: క్రీ.పూ. 4వ శతాబ్ధము.

రచయిత:   యోవేలు.

చారిత్రక నేపథ్యము: యూదా, యెరూషలేము దేవాలయము గూర్చిన ప్రవచనములు గ్రంథమునందు ఉండుటనుబ్టి  ఈ గ్రంథము యూదా పతనానంతర కాలమునకు సంబంధించినదై ఉండును.

ముఖ్యాంశములు: ‘యావే దినము’ సమీపములో ఉన్నదను సందేశమును అందించడము యోవేలు ప్రవచనములోని ప్రధానాంశము.  యిస్రాయేలునకు వారి పాపములను బ్టి మిడుతలదండు ద్వారా సంభవించబోయే నాశనము అనివార్యము అని వెల్లడించెను. అయితే పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగేవారు క్షమాభిక్ష , దేవుని దీవెనలు పొందగలరని తెలియజేసెను. ఈ గ్రంథములోని ప్రధాన బోధ యావే తీర్పుదినము. యావే దేవుడు తన ప్రజలపై తీర్పు విధించి మానవచరిత్రను తిరగవ్రాయుననునది దీని సారాంశము.  ఆ దినమునకు ముందు అనేక అసాధారణ సంఘటనలు చోటుచేసుకుాంయి (2:10; చూడుము -ఆమో 5:8-10; యెషయా 13:6-9; యెహెజ్కే 13:5; 30:2-3; ఓబ 5:5,15; జెఫ 1:7, 14; మలా 3:2-3). ఇందులో శిక్ష, క్షమాపణ, దేవునిఆత్మ, దేవుని వాగ్ధానమునకు సంబంధించిన వేదాంతాంశములను గుర్తించవచ్చును.

క్రీస్తుకు అన్వయము: గ్రంథములోని పవిత్రాత్మ రాకడ ప్రస్తావన గమనించదగినది (2:28-32; అ.కా. 2:16-21). దేవుని పేరున ప్రార్థించడము, యోవేలు ప్రజలను ఆహ్వానించడము (2:32 3:14) మొదలైనవి నూతననిబంధన ప్రజలకు ప్రేరణముగా నిలుచును (అ.కా. 2:21, 37-41; రోమీ 10:13; మత్త 24:29). యెహోషాపాతు లోయలో సకలజాతుల వారికి న్యాయము తీర్చు వ్యక్తి మరెవరోకాదు క్రీస్తేనని గుర్తించగలము (యోవే 3:2,12).

Home

Previous                                                                                                                                                                                                   Next