దుష్టుల గతి, సజ్జనుల గతి
దావీదు కీర్తన
37 1. దుష్టులను చూచి నీవు వ్యవసపడవలదు.
దుర్మార్గుల పనులను గాంచి
అసూయ చెందవలదు.
2. వారు గడ్డివలె త్వరితముగా ఎండిపోవుదురు.
పొలములోని మొక్కలవలె వాడిపోవుదురు.
3. నీవు ప్రభువును నమ్మి మంచిని చేయుము.
అతని దేశమున వసించుచు
సురక్షితముగా జీవింపుము.
4. ప్రభువునొక్కనినే ఆనందప్రదునిగా భావింపుము.
అతడు నీ కోర్కెలు తీర్చును.
5. ప్రభువు మీదనే భారము వేయుము.
నీవతనిని నమ్మినచో అతడు
నీ కార్యమును నెరవేర్చును.
6. అతడు నీ మంచితనమును
వెలుగువలె ప్రకాశింపజేయును.
నీ ధర్మవర్తనమును
మధ్యాహ్నపు సూర్యునివలె భాసిల్లజేయును.
7. దేవుని ముందట నెమ్మదిగా నిలిచియుండుము.
అతని అనుగ్రహము కొరకు
ఓపికతో వేచియుండుము.
ఇతరులు సంపదలు ఆర్జించుటను గూర్చిగాని,
కుతంత్రములు పన్నుటను గూర్చిగాని
ఆందోళనము చెందకుము.
8. కోపమును విడనాడి
ఆగ్రహావేశములను అణచుకొనుము.
కోపము వలన కీడేకాని మేలు కలుగదు.
9. ప్రభువు దుష్టులను తరిమివేయును.
ఆయన కొరకు వేచియుండువారు
మాత్రము దేశమును స్వాధీనము చేసికొందురు.
10. కొంచెము కాలములోనే
దుష్టులు అణగారిపోవుదురు.
అటుపిమ్మట నీవు వారికొరకు
గాలించినను వారు దొరకరు.
11. దీనులు దేశమును స్వాధీనము చేసికొందురు.
మిక్కుటమైన శాంతిని అనుభవింతురు.
12. దుష్టుడు నీతిమంతునిమీద కుట్రలు పన్నును.
అతనిని చూచి పండ్లుకొరుకును.
13. కాని ప్రభువు ఆ దుష్టుని చూచి నవ్వును.
వానికి పోగాలము దాపురించినదని
ఆయనకు తెలియును.
14. దీనులను, దరిద్రులను కూలద్రోయుటకై
యదార్ధవర్తనులను మట్టుబెట్టుటకై
దుష్టులు కత్తిదూసి, విల్లెక్కుపెట్టుదురు.
15. కాని వారి కత్తి వారి గుండెలలోనే
గ్రుచ్చుకొనును. వారి విండ్లు విరిగిపోవును.
16. దుష్టులందరి సొత్తు ఏకము చేసినను
సజ్జనుని కొద్దిపాి సొత్తుతో సమానము కాజాలదు.
17. ప్రభువు దుష్టుల చేతులను విరుగగ్టొి,
సజ్జనులను ఆదుకొనును.
18. ఆయన సత్పురుషులను కాపాడును.
వారు కలకాలము వారినేలను
వారు హక్కుభుక్తము చేసికొందురు.
19. కష్టకాలము ప్రాప్తించినపుడు
వారు అవమానములకు గురికారు.
కరువుకాలమున వారికి
వలసినంత తిండి దొరకును.
20. కాని దుష్టులు సర్వనాశమగుదురు.
గడ్డి మైదానము త్వరితముగా
సొబగును కోల్పోయినట్లే
ప్రభువు విరోధులును చత్తురు,
పొగవలె అదృశ్యులగుదురు.
21. దుష్టుడు బాకీ తీసికొని అప్పు తీర్చడు.
కాని సత్పురుషుడు ఉదారముగా ఇచ్చును.
22. దేవుడు దీవించువారు
దేశమును స్వాధీనము చేసికొందురు.
ఆయన శపించువారు
దేశమునుండి బహిష్క ృతులగుదురు.
23. ప్రభువే నరుని నడిపించును.
ఆయనెవనివలన ప్రీతిజెందునో
వాడు అభ్యుదయమును బడయును.
24. ఆ నరుడు పడిపోయినను మరల లేచును.
ప్రభువే అతనిని చేయి పట్టుకొని పైకిలేపును.
25. నేనిపుడు యవ్వనము గతించిన వృద్ధుడను.
కాని ప్రభువు నీతిమంతుని పరిత్యజించుటగాని,
అతని పిల్లలు బిచ్చమెత్తుకొనుటగాని
నేను ఇంత వరకును చూడలేదు.
26. అతడెల్లవేళల ఎల్లరికిని
కరుణతో ఇచ్చుచుండును.
అతని పిల్లలు దీవెనలు బడయుదురు.
27. నీవు చెడునుండి వైదొలగి మంచిని చేయుము.
అపుడు శాశ్వతముగా జీవింతువు.
28. ప్రభువు నీతిని మెచ్చుకొనును.
అతడు తన భక్తులను
చేయివిడువక సదా కాపాడును.
దుష్టుల పిల్లలు మాత్రము
దేశమునుండి బహిష్క ృతులగుదురు.
29. నీతిమంతులు దేశమును స్వాధీనము చేసికొని
దానియందు శాశ్వతముగా వసింతురు.
30. పుణ్యపురుషుడు విజ్ఞానవాక్యములు పలుకును.
నీతిని ప్రకించును.
31. దేవుని ధర్మశాస్త్రమును
హృదయమున నిలుపుకొనియుండును.కనుక అతడు పాపము చేయడు.
32. దుష్టుడు సత్పురుషుని పొంచి చూచుచుండును.
అతనిని చంపయత్నించుచుండును.
33. కాని ప్రభువు సజ్జనుని
దుర్మార్గుని చేతికి చిక్కనీయడు.
తీర్పునందు దోషిగా గణింపబడు
దౌర్భాగ్యమును అతనికి పట్టనీయడు.
34. నీవు ప్రభువును నమ్మి,
ఆయన ఆజ్ఞలు పాింపుము.
ఆయన నీకు దేశమును
ఆక్రమించుకొను శక్తినొసగును.
నీవు చూచుచుండగా దుష్టులు
దేశమునుండి బహిష్క ృతులగుదురు.
35. దుష్టుడు వృద్ధిలోనికివచ్చి లెబానోను
దేవదారువలె ఎదుగుటను నేను చూచితిని.
36. కాని కొంతకాలము తరువాత
నేనటు వెళ్ళిచూడగా అతడు లేడయ్యెను.
అతనికొరకు గాలించితినిగాని
అతడు నాకు కనిపింపడయ్యెను.
37. సత్పురుషుని గమనింపుము,
నీతిమంతుని పరిశీలింపుము.
శాంతికాముని సంతతి సదా వర్ధిల్లును.
38. కాని దుర్మార్గులు సర్వనాశనమగుదురు.
వారి సంతానము నిర్మూలమగును.
39. ప్రభువు నీతిమంతులను రక్షించును.
ఆపత్కాలమున వారినాదరించును.
40. నీతిమంతులు ప్రభువును ఆశ్రయింతురు కనుక
అతడు వారికి సాయముచేసి వారిని కాపాడును.
దుష్టుల బారినుండి వారిని సంరక్షించును.