యిర్మీయా, నిబంధనము

11 1. ప్రభువు యిర్మీయాకు తన వాక్కునిట్లు విన్పించెను: 2. ”నీవు నిబంధనపు షరతులను ఆలింపుము.

3. యిస్రాయేలు దేవుడనైన నేను నిబంధనపు షరతులు పాింపని వానిని శపింతునని యూదా ప్రజలతోను యెరూషలేము పౌరులతోను చెప్పుము.

4. నేను వారి పితరులను కొలిమివిం ఐగుప్తునుండి వెలుపలికి తోడ్కొని వచ్చినపుడు, వారితో ఈ నిబంధనమును చేసికొింని. వారు నాకు విధేయులై నేను చెప్పినదెల్ల చేయవలెనని ఆజ్ఞాపించి తిని. అట్లు విధేయులైనచో నేను వారికి దేవుడనగుదు ననియు, వారు నాకు ప్రజలగుదురనియు చెప్పితిని.

5. అపుడు నేను వారి పితరులకు చేసిన వాగ్ధానమును నిలబెట్టు కొందుననియు, వారి స్వాధీనముననున్న నేలను వారికి భుక్తము చేయుదుననియు చెప్పితిని”. ”ఆ మాటలకు నేను ”ప్రభూ! అట్లే జరుగునుగాక!” అని అంిని.

6. అంతట ప్రభువు నాతో ఇట్లనెను: నీవు యూదా నగరములలోనికిని యెరూషలేము వీధులలోనికిని వెళ్ళి ఇట్లు ప్రకింపుము. ”మీరు నా నిబంధనపు షరతులను విని వానిని పాింపుడు.

7. నేను మీ పితరులను ఐగుప్తునుండి తోడ్కొని వచ్చి నపుడు వారు నాకు విధేయులు కావలెనని ఖండిత ముగా ఆజ్ఞాపించితిని. ఈ రోజు వరకును నేను ప్రజలను హెచ్చరించుటను మానలేదు.

8. కాని వారు నా మాట వినలేదు, నాకు విధేయులు కాలేదు. ప్రతివాడును తన దుష్టహృదయము ప్రకారము నడచెను. నేను వారిని నిబంధన పాింపుడని చెప్పితిని, గాని వారు వినలేదు. కనుక నేను వారిని ఆ నిబంధనమున చెప్పబడిన శిక్షలన్నికిని గురిచేసితిని.”

9. అటుపిమ్మట ప్రభువు నాతో ఇట్లనెను: యూదా ప్రజలును, యెరూషలేము నివాసులును నా మీద కుట్ర పన్నుచున్నారు.

10. వారుకూడ తమ పితరుల వింవారై నేను చెప్పిన పనిని చేయుటలేదు. అన్యదైవములను పూజించుచున్నారు. యిస్రాయేలీయు లును, యూదా ప్రజలును గూడ నేను తమ పితరులతో చేసికొనిన  నిబంధనను మీరిరి.

11. కనుక ప్రభుడనైన నేనిపుడు వారిని వినాశమునకు గురిచేయుదుననియు, వారు దానిని తప్పించు కోజాలరనియు హెచ్చరించు చున్నాను. వారు నాకు మొరప్టిెనను నేను వినను.

12. యూదా నగరములలోని ప్రజలును, యెరూషలేము పౌరులును తాము సాంబ్రాణిపొగ వేసిన దేవతల యొద్దకుపోయి, వారికి మొరపెట్టుకోవచ్చును. కాని ఆ దేవతలు వారిని వినాశనమునుండి కాపాడ జాలరు.

13. యూదా నివాసులు తమకెన్ని నగరములు ఉన్నవో, అన్ని  దేవతలన  కొలుచుచున్నారు. యెరూషలేము ప్రజలు తమ పట్టణమున ఎన్ని వీధులు కలవో అన్ని బలిపీఠములను హేయమైన బాలుదేవతకు నిర్మించిరి.

14. యిర్మీయా! ”నీవు ఈ ప్రజల తరఫున మనవి కాని, ప్రార్థన కాని చేయ వలదు. వారు ఆపదలో చిక్కి నాకు మొరపెట్టుదురేని, నేను వినను.

దేవాలయమునకు పోవువారిని మందలించుట

15.          నేను ప్రేమించుప్రజలు లజ్జాకరమైన

               పనులు చేయుచున్నారు.

               వారికి నా దేవాలయమున నిలుచుటకు

               అర్హత ఎక్కడిది?

               వారి మ్రొక్కుబడులును, జంతుబలులును

               రానున్న విపత్తునుండి వారిని కాపాడునా?

               ఆ విపత్తు వచ్చినపిమ్మట

               వారు సంతసింపగలరా?

16.          వారు పచ్చని ఆకులతోను, మనోహర ఫలములతోను నిండిన ఓలివుచెట్టువిం వారని

               నేను పూర్వము పలికితిని.

               కాని ఇపుడు నా గర్జనమను పిడుగుతో

               దాని ఆకులను కాల్తును,

               దాని కొమ్మలను విరుతును.

17. సైన్యములకు అధిపతియు, ప్రభుడనైన నేను యిస్రాయేలును, యూదా ప్రజలను చెట్టువలె నాితిని. కాని ఇపుడు వారికి వినాశము దాపురించినది. వారి దుష్కార్యముల వలననే వారికి ఈ గతి ప్టినది. వారు బాలు దేవతకు సాంబ్రాణి పొగ వేసి నా కోపమును రెచ్చగ్టొిరి.”

ప్రజలు యిర్మీయాను

స్వీయనగరముననే హింసించుట

18. నా విరోధులు నామీదపన్ను కుట్రలను ప్రభువు నాకు తెలియజేసెను.

19. నా మట్టుకు నేను తనను తోలుకొనిపోవువారిని నమ్మి వధ్యస్థానమునకు వెళ్ళు గొఱ్ఱెపిల్లవలె నుింని. వారు నాపై కుట్రలు పన్నుచున్నారని నాకు తెలియదు. నా విరోధులు ”పుష్టిగా నున్నపుడే చెట్టును నరికివేయుదము. ఇతనిని నరలోకము నుండి తుడిచి పెట్టుదము. ఇక ఇతని పేరు కూడ విన్పింపకూడదు” అని పలికిరి.

20.        నేను ఇట్లు మనవి చేసితిని:

               సైన్యములకు అధిపతియైన ప్రభూ!

               నీవు న్యాయము తప్పని న్యాయాధిపతివి.

               నరుల హృదయమును,

               మనసును పరిశీలించువాడవు.

               నేను నా వ్యాజ్యెమును నీకు అప్పగించితిని.

               నీవు నా విరోధులకు ప్రతీకారముచేయగా

               నేను చూతునుగాక!

21. అనాతోతు ప్రజలు నన్ను చంప నిశ్చయించు కొనిరి. ”నీవు ప్రభువు సందేశము ప్రకించినచో మేము నిన్ను వధింతుము” అని పలికిరి.

22. కనుక ప్రభువు ఇట్లనెను: ”నేను వారిని శిక్షింతును. వారి యువకులు పోరున చత్తురు. వారి పిల్లలు ఆకలితో చత్తురు.

23. నేను అనాతోతును నాశనము చేయుటకు నిర్ణీతకాలమును ఎన్నుకొింని. ఆ సమయమురాగానే ఆ పట్టణములోని ప్రజలెల్లరును చత్తురు.”