64 1.      నీవు గగనమును చీల్చుకొని

                              క్రిందికి దిగిరావేల?

                              అప్పుడు కొండలు నిన్ను చూచి

                              గడగడవణకును.

2.           అవి అగ్నికి కాలిపోయెడు పొదవలెను,

               నిప్పునకు కాగెడు నీివలెను కంపించును.

               నీవు వచ్చి నీ విరోధులకు

               నీ నామమును తెలియజేయుము.

               జాతులు నిన్ను చూచి

               భీతితో కంపించునట్లు చేయుము.

3.           పూర్వము నీవు మేము ఊహింపని

               అద్భుతకార్యములు చేసినపుడు,

               కొండలు నిన్నుచూచి గడగడవణకెను.

4.           తనను నమ్మినవారికి

               ఇి్ట ఉపకారములు చేసిన దేవుని

               ఇంతవరకు ఎవరును చూచియుండలేదు.

               ఎవరును అి్టవానిని గూర్చి వినియుండలేదు.

5.           ధర్మమును ప్రీతితో పాించుచు,

               నీ మార్గములను విస్మరింపని వానిని

               నీవు ఆహ్వానింతువు.

               నీవు కోపించినను లెక్కచేయక

               మేము పాపము కట్టుకొింమి.

               నీ ఆగ్రహమును లెక్కచేయక

               పూర్వము నుండియు

               మేము పాపము చేయుచునే యుింమి.

6.           మేమెల్లరమును అపవిత్రులమైతిమి.

               మా పుణ్యక్రియలు మలినవస్త్రము వింవయ్యెను.

               మేము ఆకులవలె ఎండిపోయితిమి.

               మా కిల్బిషములు

               మమ్ము గాలివలె ఎగురగొట్టెను.

7.            నీకు ప్రార్థనచేయు వాడెవడును లేడయ్యెను.

               నిన్నాశ్రయించు వాడెవడును కన్పింపడయ్యెను.

               నీవు నీ దివ్యముఖమును

               మా నుండి మరుగు జేసికొింవి.

               మా అపరాధములను చూచి

               మమ్ము చేయి విడచితివి.

8.           అయినను ప్రభూ! నీవు మాకు తండ్రివి.

               మేము మ్టిమి, నీవు కుమ్మరివి.

               నీవే మమ్మెల్లరిని సృజించితివి.    

9.           ప్రభూ! మా మీద మిక్కుటముగా కోపింపకుము.

               మా పాపములను సదా

               జ్ఞప్తియందుంచుకొనకుము.

               మమ్ము కరుణతో వీక్షింపుము.

               మేమెల్లరమును నీ ప్రజలము.

10.         నీ పవిత్రనగరములు ఎడారులైనవి

               సియోను పాడువడినది.

               యెరూషలేము బీడు వడినది.

11.           పవిత్రమును, సుందరమునైన మా దేవళమును,

               మా పితరులు నీకు ప్రార్థన చేసిన

               ఆ మందిరమును నిప్పుతో తగులబ్టెిరి.

               మాకు ప్రీతిపాత్రములైన

               స్థలములన్నియు నాశనమయ్యెను.

12.          ప్రభూ! ఈ కార్యములెల్ల చూచి

               నీవు ఊరకుందువా?

               నీవు మౌనము వహించి

               మమ్మధికముగా శిక్షింతువా?