ప్రాసాదము

7 1. సొలోమోను ప్రాసాదమును కూడ క్టించెను. దానిని ముగించుటకు పదమూడేండ్లు ప్టినది.

2. ఆ మేడలో ”లెబానోను అరణ్యము” అను పేరుగల శాల కలదు. దాని పొడవు వందమూరలు, వెడల్పు యాబదిమూరలు, ఎత్తు ముప్పదిమూరలు. దానికి ఒక్కొక్క వరుసకు పదునేను చొప్పున నాలుగువరుసల దేవదారుస్తంభములు కలవు. ఈ స్థంభములపై దేవ దారు దూలములను నెలకొల్పిరి.

3. పైకప్పు కూడ దేవదారుపలకలతోనే నిర్మించిరి. ఈ కప్పు స్తంభ ములపై నిలిచెను.

4. ప్రక్కలనున్న రెండు గోడలలో, మూడేసివరుసలలో గవాక్షములు ఒకదానికొకి ఎదు రెదురుగా నుండెను.

5. ద్వారములకు, గవాక్షములకు నాలుగు కోణముల చతురస్రాకార ద్వారబంధములు కలవు. రెండు గోడలలో మూడువిభాగములు గల గవాక్షములుండెను. మూడు వరుసలలో గవాక్షములు ఒకదానికొకి ఎదురెదురుగానుండెను.

6. ప్రాసాద మున స్తంభములచావడి కలదు. దాని పొడవు యాబది మూరలు, వెడల్పు ముప్పదిమూరలు దాని ఎదుట స్తంభములపై నిలిచిన వసారా కలదు. దానియెదుట ఒకమంటపము ఉండెను.

7. సొలోమోను న్యాయ విచారణము జరుపుశాలకు సింహాసనశాల లేక న్యాయ శాల అని పేరు. అతడు దానిని క్రిందినేలనుండి మీది దూలములవరకు దేవదారుపలకలతో కప్పించెను.

8. ఈ న్యాయశాలకు వెనుక సొలోమోను నివసించు గృహము కలదు. దానినికూడ ప్రాసాదములోని ఇతర భవనములవలె నిర్మించిరి. అతడు పెండ్లియాడిన ఐగుప్తురాజు కుమార్తెనకుకూడ తన భవనమువిం భవనమునే క్టించెను.

9. ఈ భవనమునకు పునాదినుండి మీది కప్పు వరకు కావలసిన మేలిరకపు రాళ్ళనన్నిని గనిలోనే చెక్కించిరి. ఆ రాళ్ళను పరికరములతో పగుల క్టొించి, వాని అంచులు చదరముగానుండునట్లు రంపముతో కోయించిరి.

10. పునాదులకుగాను గని వద్దనే తయారుచేయించిన పెద్దరాళ్ళను వాడిరి. వీనిలో కొన్ని పదిమూరలు, మరికొన్ని ఎనిమిది మూరల పొడవుకలిగి, మిక్కిలి వెలగలవి.

11. వీనిపైని కావ లసిన కొలతలలో పగులక్టొించిన చిన్నరాళ్ళను పేర్చిరి. వానిమీద దేవదారుదూలములు నిలిపిరి. 12. వెలుపలి ఆవరణముకూడ, దేవాలయ ఆవ రణము, ముఖమంటపమువలెనె గోడలకు మూడు వరుసలు రాళ్ళు, ఒక వరుస దేవదారు దూలములు నుండెను.

ఇత్తడి పనివాడు హీరాము

13-14. సొలోమోనురాజు తూరు పట్టణము నుండి హీరాము అను ఇత్తడి పనివానిని పిలిపించెను. హీరాము తల్లి నఫ్తాలి తెగకు చెందినది. అతని తండ్రి తూరు పట్టణపౌరుడు, ఇత్తడిపనికి పేరుమోసినవాడు. కాని అతడు గతించెను. హీరాము తెలివితేటలు, అనుభవముగల ఇత్తడి పనివాడు. అతడు సొలోమోను ఆహ్వానమునందుకొని అతనికి ఇత్తడి పనులన్నిని చేసిపెట్టెను.

ఇత్తడి స్తంభములు

15. హీరాము రెండు ఇత్తడి స్తంభములను పోతపోసెను. అవి ఒక్కొక్కి పదునెనిమిది మూరల ఎత్తు, పన్నెండుమూరల చుట్టుకొలతనుండెను. అతడు వానిని దేవాలయము ఎదుట నిలిపెను.

16. ఐదు మూరల ఎత్తుగల రెండు ఇత్తడిపీటలను కూడ పోత పోసి వానిని ఆ ఇత్తడిస్తంభములపై నిలిపెను.

17-18. ఆ స్తంభముల పైభాగమును గొలుసుకట్టులతో, రెండువరుసల దానిమ్మపండ్లతో అల్లికగా అలంక రించెను.

19-20. స్తంభములమీద పీటలు నాలుగు మూరలవరకు కలువపూల నగిషి కలిగియుండెను. వానిని స్తంభములపై గొలుసుకట్టుకు పైగా నిలిపిరి. ఒక్కొక్కపీటకు రెండువందల దానిమ్మపండ్లు రెండేసి వరుసలలో అమర్చబడెను.

21. హీరాము పై స్తంభ ములు రెండిని దేవాలయ మంటపములో నిలి పెను. దక్షిణదిక్కున ఉన్నదానికి యాకీను1 అని, ఉత్తర దిక్కుననున్నదానికి  బోవసు2  అని పేర్లు.

22. కలువ పూవులవలెనున్న ఇత్తడిపీటలు స్తంభములపై అమర్చ బడెను. ఈ రీతిగా స్తంభములు పూర్తిచేయబడెను.

ఇత్తడిత్టొి

23. హీరాము సముద్రమంత పెద్దత్టొిని ఇత్తడితో పోతపోసెను. అది గుండ్రముగానుండెను. దాని లోతు ఐదుమూరలు, పై అంచులమధ్య దూరము పదిమూరలు, చుట్టుకొలత ముప్పదిమూరలు.

24. ఆ త్టొిచుట్టు వెలుపలిభాగమున ముప్పదిమూరలు పొడవున రెండువరుసలలో గుబ్బలు వ్రేలాడుచుండెను. ఈ గుబ్బలనుకూడ త్టొితో కలిసిపోవునట్లుగా పోత పోసెను.

25. ఈ త్టొిని పండ్రెండు ఇత్తడి ఎద్దులమీద నిలిపెను. ఆ ఎద్దులన్ని వెలుపలికి చూచుచున్నట్లుగా చేయబడెను. మూడేసిఎద్దులు ఒక్కొక్కదిక్కుకు అభి ముఖములైౖ యుండెను.

26. త్టొి మందము అర చేతిమందముండెను. దాని అంచు పూవురేకులవలె గుండ్రముగా వెనుకకు వంగియుండెను. ఆ త్టొిలో వేయి బుంగల నీళ్ళుపట్టును.

ఇత్తడి స్తంభములు

27. హీరాము పది ఇత్తడి స్తంభములను తయారు చేసెను. ఒక్కొక్క స్తంభము పొడవు నాలుగు మూరలు, వెడల్పు నాలుగుమూరలు, ఎత్తు మూడు మూరలు.

28. వాి ప్రక్క పలకలు కలిగియుండెను. పలకలు చట్రములమధ్య అమర్చబడెను.

29. పలకల మీద మరియు చట్రములమీదను, సింహములు, ఎద్దులు, కెరూబులు ఉండెను. వాిపైన మరియు క్రిందను వ్రేలాడుదండలవిం నగిషీ పని కలిగి యుండెను.

30. ప్రతి స్తంభమునకు నాలుగు ఇత్తడి చక్రములు, ఇత్తడి ఇరుసులు కలిగియుండెను. దాని నాలుగు మూలలును దిమ్మెలుకలవు. ఈ దిమ్మెలు త్టొిక్రింద అతికిన ప్రతి తావుదగ్గర దండలవిం నగిషీపనితో పోతపోయబడెను.

31. దాని మూతిపైకి మూరెడు నిడివి కలిగిన జవలమధ్య మూరెడున్నర లోతున గుండ్రని సందు కలిగిన పీఠమువలెనుండెను. ఆ మూతిమీది ప్రక్క పలకలు గుండ్రనివికాక, చచ్చౌవుకముగ చెక్కినవైయుండెను.

32. ప్రక్క పలకల క్రింద నాలుగు చక్రములు కలవు. చక్రముల ఇరుసులు స్తంభములలో అతుకబడియుండెను. ఒక్కొక్క చక్రము మూరెడున్నర నిడివి కలదైయుండెను. ఈ చక్రములు రథచక్రముల పనివలెనుండెను.

33. దాని ఇరుసులు, అడ్డలు, పూీలు, ఆకులు పోతపనివైయుండెను.

34. ఒక్కొక్కస్తంభపు నాలుగు మూలలును నాలుగు దిమ్మెలు కలవు. ఈ దిమ్మెలును, స్తంభములును ఏకాండముగా నుండెను.

35. బండ్ల పైభాగమున అరమూర గుండ్రని ఇత్తడిబద్దకలదు. స్తంభముపైనున్న చట్రములు, ప్రక్క పలకలు దానితో ఏకాండముగా నుండెను.

36. దాని చట్రములమీదను, ప్రక్క పలకల మీదను ఖర్జూరవృక్షములతోను, సింహములతోను, కెరూబుదూతల చిత్రములతోను, గుండ్రని బొమ్మల తోను దానిదాని స్థలమునుబ్టి చుట్టు దండలతో నగిషీపనిగా అలంకరింపబడెను.

37. ఈ రీతిగా అతడు పదిస్తంభములను తయారుచేసెను. వాని పరిమాణము, కొలతలు, పోత ఒకేరీతిగా నుండెను.

38. హీరాము ఒక్కొక్క స్తంభమునకు ఒక్కొక్కి చొప్పున పది ఇత్తడి తొట్లనుకూడ చేసెను. అవి ఒక్కొక్కి ఇరువదిబుంగలు నీళ్ళుపట్టును. వాని చుట్టుకొలత నాలుగుమూరలు.

39. అతడు దేవాలయ మునకు దక్షిణమున ఐదు స్తంభములను ఉత్తరమున ఐదు స్తంభములను ఉంచెను. పెద్ద ఇత్తడిత్టొిని దేవాలయమునకు ఆగ్నేయపుమూలన ఉంచెను.

పరికరములు

40-45. హీరాము బిందెలను, గరిటెలను, గిన్నెలను తయారుచేసెను. అతడు సొలోమోను కోరి నట్లు దేవాలయమునకు కావలసిన పరికరములను అన్నిని సిద్ధము చేసెను. అతడు చేసిన వస్తువులు ఇవి: రెండు స్తంభములు, వాని పైనినుంచుటకు రెండు గిన్నెలవిం పీటలు, స్తంభములమీది భాగమునకు గొలుసుకట్లు, ఒక్కొక్క స్తంభమునకు అవి రెండు వరుసలు. ఒక్కొక్క వరుసకు వందచొప్పున మొత్తము నాలుగు వందల దానిమ్మపండ్లు, పది స్తంభములు, పది తొట్లు, సముద్రమువిం యొక పెద్దత్టొి, దానిని మోయుటకు పండ్రెండుఎడ్లు, బిందెలు, గరిటెలు, గిన్నెలు. సొలోమోను ఆజ్ఞను ననుసరించి హీరాము దేవాలయమునకుగాను చేసిన ఈ పరికరములన్నిని మేలిమి ఇత్తడితోనే చేసెను.

46. రాజు ఈ పరికర ములన్నిని సుక్కోత్తున సారెతానునకు నడుమగల యోర్దాను లోయలోనున్న జిగిమన్నులో పోత పోయించెను.

47. సొలోమోను ఈ ఇత్తడి పరికరము లను తూయించలేదు. పరికరములు చాలఉన్నందున వానిని తూచుట కష్టసాధ్యమయ్యెను.

48-50. సొలోమోను దేవాలయమునకు బంగారు పరికరములనుకూడ చేయించెను. అవి బంగారు ధూపపీఠము, సన్నిధి రొట్టెలకుగాను బల్ల. మేలిమి బంగారముతోచేసి మందిరమున కుడిప్రక్కన ఐదు, ఎడమప్రక్కన ఐదు ఉంచిన పది దీపస్తంభములు, వాని బంగారుపూలు, ప్రమిదెలు, పట్టుకారులు, సాంబ్రాణిపొగ కాల్చుటకు బంగారు పాత్రములు, కత్తెరలు, గిన్నెలు, నిప్పుకణికలను తెచ్చు పళ్ళెరములు, గర్భగృహమునకు, మందిరమునకు ద్వారబంధములు.

51. ఈ రీతిగా సొలోమోను ప్రభువునకు దేవాల యము క్టి పూర్తిచేసెను. అతడు తన తండ్రి దావీదు మందిరమునకు సమర్పించిన వెండిని, బంగారమును, పరికరములను కొనివచ్చి దేవాలయ ఖజానాకు అర్పించెను.