ఆశ్వాసన గ్రంథము

యిస్రాయేలునకు ప్రభువు ప్రమాణములు

30 1. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు విని పించెను: 2. ”యిస్రాయేలు దేవుడైన ప్రభువిట్లు చెప్పు చున్నాడు. నేను నీకు చెప్పిన సంగతులెల్ల ఒక పొత్త మున వ్రాయుము.

3. నేను నా ప్రజలగు యిస్రాయేలు, యూదావాసులను చెరనుండి విడిపించు సమయము వచ్చుచున్నది. నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని తోడ్కొనివత్తును. వారు ఆ నేలను మరల స్వాధీనము చేసికొందురు. ఇది ప్రభుడనైన నా వాక్కు.

4. యూదా యిస్రాయేలు ప్రజలకు ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు:

5.           ”నేనొక ఆర్తనాదము వింని.

               అది శాంతినిగాక, భయమును సూచించునాదము.

6.           మీరు ఆలోచింపుడు. పురుషుడు ప్రసవించునా?

               అట్లయిన పురి నొప్పులలోనున్న స్త్రీవలె

               పురుషులు తమ నడుముపై చేతులను పెట్టుకోనేల?

               వారి మొగములు పాలిపోయి ఉండనేల?         

7.            అయ్యో! భీకరమైన దినము సమీపించుచున్నది. అి్టదినము మరియొకి ఉండబోదు.

               అది యిస్రాయేలునకు ఆపద తెచ్చును.

               కాని వారు దానినుండి తప్పించుకొందురు.

8. సైన్యములకు అధిపతియైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు. ఆ దినమున నేను వారి మెడమీద కాడిని విరుగగొట్టుదును. వారి బంధనములను త్రెంచి వేయుదును. వారు అన్యజాతులకిక దాస్యము చేయరు.

9. వారు తమ ప్రభుడను, దేవుడనైన నన్నును, నేను రాజుగా నియమించిన దావీదు వంశజుని సేవింతురు. 

10.         కనుక నా సేవకులగు యాకోబు వంశజులారా!

               మీరు భయపడకుడు.

               యిస్రాయేలీయులారా! మీరు భీతి చెందకుడు.

               నేను దూరదేశముననున్న మిమ్ము రక్షింతును. పరదేశమున చెరలోనున్న

               మీ సంతతిని కాపాడుదును.

               యాకోబు వంశజులకు మరల క్షేమము కలుగును

               వారు ఎవరి పీడయులేక సురక్షితముగా మనుదురు

11.           నేను మీకు తోడుగా నుండి మిమ్ము రక్షింతును.

               మిమ్ము చెల్లాచెదరు చేసిన దేశములను

               పాడు చేయుదును.

               కాని నేను మిమ్ము

               సమూలముగా నాశనము చేయను.

               మిమ్ము అసలు దండింపకుండ వదలివేయను

               కాని తగుమాత్రముగా శిక్షింతును.

12.          ప్రభువిట్లు చెప్పుచున్నాడు:

               మీ వ్రణములు మానవు.

               మీ గాయములు నయముకావు.

13.          మిమ్మెవరును పరామర్శింపరు.

               మీ పుండ్లు నయముకావు.

               మీకు చికిత్స లేదు.

14.          మీ వలపుకాండ్రు మిమ్ము విస్మరించిరి.

               వారు మిమ్ము ప్టించుకొనరు.

               మీరు పెక్కుపాపములుచేసి ఘోరమైన

               దుష్టవర్తనమునకు పాల్పడితిరి.

               కనుక నేను మిమ్ము శత్రువుమోదినట్లుగా మోదితిని.

               కఠినముగా దండించితిని.

15.          మీరు మీ గాయములనుగూర్చి

               ఫిర్యాదు చేయవలదు, అవి నయముకావు.

               మీరిన్ని పాపములుచేసి,

               ఇంతి దుష్టవర్తనమునకు పాల్పడితిరి కనుక

               నేను మిమ్మట్లు శిక్షించితిని.

16.          కాని ఇప్పుడు మిమ్ము మ్రింగువారిని

               నేను మ్రింగుదును.

               మీ శత్రువులను నేను బందీలను చేయుదును.

               మిమ్ము పీడించు వారిని నేను పీడింతును. మిమ్ము  దోచుకొనువారిని నేను దోచుకొందును.

17.          మీ శత్రువులు సియోనును వెలివేసి

               దానినిక ఎవరును ఆదరింపరని పలికినను

               నేను మీకు ఆరోగ్యము దయచేసి,

               మీ గాయములను మాన్పుదును.

18.          ప్రభువు ఇట్లనుచున్నాడు:

               నేను యిస్రాయేలీయులను చెరనుండి విడిపింతును

               వారి కుటుంబములన్నికిని దయచూపుదును యెరూషలేమును పునర్నిర్మింతురు.

               దాని ప్రాసాదమును

               దాని చోటనే తిరిగికట్టుదురు.

19.          అచట వసించు ప్రజలు నా స్తుతులను పాడుదురు,

               సంతసముతో కేకలు వేయుదురు.

               నేను వారి సంఖ్యను తగ్గనీయను, పెంచుదును.

               వారికి అపకీర్తికాక కీర్తి కలుగునట్లు చేయుదును.

20.        వారికి మరల పూర్వవైభవము దయచేయుదును.

               వారిని స్థిరముగా పాదుకొల్పుదును.

               వారిని పీడించువారిని శిక్షింతును.

21.          వారి పాలకుడు

               వారి జాతినుండియే ఉద్భవించును.

               వారి రాజు వారి ప్రజలనుండియే పుట్టును.

               అతడు నేను ఆహ్వానించినపుడు

               నా చెంతకు వచ్చును.

               నేను పిలువకుండనే

               నా దగ్గరకు వచ్చుటకెవడు సాహసించును?

22.        వారు నా ప్రజలగుదురు,

               నేను వారికి దేవుడనగుదును.

               ఇది ప్రభుడనైన నా వాక్కు.”

23.        ప్రభువు కోపము తుఫాను వింది.

               అది దుర్మార్గులపై ప్రభంజనమువలె దిగును.

24.         ప్రభువు తన సంకల్పమును నెరవేర్చుకొనువరకు

               ఆయన ఆగ్రహము చల్లారదు.

               రానున్న కాలమున ఆయన ప్రజలు

               ఈ సంగతిని బాగుగా అర్థము చేసికొందురు.