మొదికాన్పు బిడ్డల చావును మోషే ఎరిగించుట

1. యావే మోషేతో ”ఫరోకు, ఐగుప్తుదేశము నకు ఇంకొక్క ఉపద్రవము మాత్రమే కలిగింతును. దానితరువాత అతడు మిమ్ము ఇక్కడినుండి పోనిచ్చును. పోనిచ్చుట మాత్రమేగాదు, మిమ్ము ఇక్కడినుండి గిెం వేయును.

2. కాబ్టి మీలో ప్రతిపురుషుడును ప్రతి స్త్రీయు తమ ఇరుగుపొరుగున ఉన్న పురుషుని స్త్రీని అడిగి వెండినగలు బంగారునగలు తీసికొనవలయు నని యిస్రాయేలీయులతో చెప్పుము” అనెను.

3. యావే యిస్రాయేలీయులను ఐగుప్తుదేశీయుల కింకి గొప్పవారు అగునట్లు చేసెను. అదియునుగాక మోషే  అనునతడు ఐగుప్తుదేశములో గొప్పపలుకుబడి గడించెను. ఫరో కొలువువారికి ప్రజలకు మహాఘన నీయుడాయెను.

4. మోషే ఫరోతో ”యావే నీకు ఈ వార్తను పంపెను. అర్ధరాత్రమున నేను ఐగుప్తుదేశము మీదుగ పోవుదును.

5. ఈ దేశములో ప్టుిన మొదికాన్పు పిల్లలందరును చచ్చెదరు. సింహాసనమునకు వారసుడైన ఫరో మొదిబిడ్డనుండి, తిరుగిలో పిండివిసరు పనికత్తె మొదిబిడ్డ వరకును ఎల్లరును చత్తురు. పశువులలోను తొలిచూలుపిల్లలు చచ్చును.

6. ఐగుప్తు దేశమంతట శోకారావము మిన్నుముట్టును. అి్ట ఆక్రందన ఇంతకుముందు పుట్టలేదు, ఇక పుట్టబోదు.

7. కాని యిస్రాయేలీయులలో మనుష్యుని మీదగాని, పశువుమీదగాని ఒక్క కుక్కకూడా నాలుక ఆడించదు. దీనినిబ్టి యావే యిస్రాయేలీయులను ఐగుప్తుదేశీ యుల నుండి వేరుచేసెనని నీవు తెలిసికొందువు.

8. అప్పుడు ఇక్కడనున్న నీ కొలువువారు అందరు నన్ను వెదకుకొనుచు వచ్చి, నా ఎదుట మోకరిల్లి ‘నీవును నీ అనుచరులును అందరు వెళ్ళిపొండు’ అందురు. అప్పుడుగాని నేను వెళ్ళను” అనెను. ఈ మాటలుపలికి కోపముతో మండిపడుచు ఫరో సమ్ముఖము నుండి మోషే వెడలిపోయెను.

9. ”ఐగుప్తుదేశములో నేను ఇంకను నా మహ త్కార్యములు విస్తరింపవలయును కనుక నీ మాట ఫరో చెవినదూరదు” అని యావే మోషేతో అనెను.

10. మోషే అహరోనులు ఫరోరాజు కన్నుల ఎదుటనే ఈ మహత్కార్యములన్నిని చేసిరి. కాని యావే ఫరో రాజును కఠినహృదయునిగాచేసెను. అతడేమో యిస్రా యేలీయులను తనదేశము విడిచి వెళ్ళనీయలేదు.

Previous                                                                                                                                                                                                 Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము