యిర్మీయా కూజాను పగులగొట్టుట

19 1. ప్రభువు నాతో ”నీవు వెళ్ళి కుమ్మరి చేయు మ్టికూజాను కొనుము. కొందరు పెద్దలను, వృద్ధులైన యాజకులను నీ వెంటకొనిపొమ్ము.

2. నీవు కుండ పెంకుల ద్వారముగుండ హిన్నోము లోయకు వెళ్ళుము. అచట నేను నీకు తెలియజేయు సందేశమును నీవు ప్రజలకు వినిపింపుము” అని చెప్పెను.

3. ‘ప్రభువు నన్ను ఈ మాటలు చెప్పుమనెను: ”యూదా రాజు లారా! యెరూషలేము పౌరులారా! సైన్యములకు అధి పతియు యిస్రాయేలు దేవుడనైన నా పలుకు లాలింపుడు. నేను ఈ తావునకు ఘోరవిపత్తు కలి గింతును. ఈ ఉదంతముగూర్చి వినినవారెల్ల విస్మ యము చెందుదురు.

4. నేను ఈ కార్యమునెందుకు చేయబూనితిని అనగా, ప్రజలు నన్ను పరిత్యజించిరి. వారిచట అన్యదైవములకు బలులర్పించి, ఈ తావును అపవిత్రము చేసిరి. ఆ దైవములగూర్చి ఆ ప్రజలకు గాని, వారి పితరులకుగాని, యూదా రాజులకుగాని ఏమియు తెలియదు. ప్రజలు ఈ తావును నిర్దోషుల నెత్తురుతో నింపివేసిరి.

5. వారు బాలు దేవతకు బలి పీఠములు నిర్మించి, తమ కుమారులను దహన బలిగా కాల్చిరి. నేను ఏనాడును వారితో మీరు ఈ కార్యము చేయుడని చెప్పలేదు. నాకు అి్ట ఆలోచన కూడ తట్టలేదు.

6. కనుక జనులిక దీనిని తోఫెతు అనికాని, హిన్నోము లోయ అనికాని పిలువక, వధ లోయ అని పిలచు రోజులు వచ్చును.

7. ఈ తావున నేను యూదా ప్రజలయొక్కయు, యెరూషలేము పౌరుల యొక్కయు పథకములను భంగపరతును. వారి శత్రు వులు యుద్ధమున వారిని జయించి, వధించునట్లు చేయుదును. వారి శవములను పకక్షులకును, వన్య మృగములకును ఆహారము చేయుదును.

8. నేను ఈ పట్టణమును సర్వనాశనము చేయుదును. దారిన బోవు వారెల్లరును దానిని చూచి విస్మయమొందు దురు. దానికి ప్టినగతి చూచి అపహాసము చేయు దురు.

9. శత్రువులు నగరమును ముట్టడించి దాని పౌరులను చంపజూతురు. ఘోరమైన ఆ ముట్టడికి తట్టుకోజాలక నగరములోని పౌరులు ఒకరినొకరు భక్షింతురు. తమ పిల్లలనే భక్షింతురు.”

10. అటుపిమ్మట ప్రభువు నీ చెంతనున్న కూజాను నీతో వచ్చిన జనులు చూచుచుండగా పగుల గొట్టుమని నాతో చెప్పెను.

11. నన్ను వారితో ఇట్లు చెప్పుమనెను: ‘సైన్యములకధిపతియైన ప్రభువు పలుకులివి. నేను ఈ పట్టణమును, ఈ ప్రజలను ఈ కుమ్మరిపాత్రవలె పగులగొట్టుదును. పగిలిపోయిన ఈ కూజా పెంకులవలె వారినిగూడ ఎవరును మరల అతికింపజాలరు. పాతిపెట్టుటకు తోఫెతులో స్థలము లేకపోవునంతగా వారిని అక్కడ పాతిపెట్టుదురు. 12. నేను ఈ నగరమును, దాని పౌరులను తోఫెతు వలె చేయుదును.

13. యెరూషలేములోని గృహము లును, యూదారాజుల మేడలును తోఫెతువలె అపవిత్ర ములగును. మిద్దెలమీద నక్షత్రములకు సాంబ్రాణిపొగ వేసిన ఇండ్లును, పరదైవములకు పానీయార్పణము చేసిన ఇండ్లును అట్లే అపవిత్రములగును.’

14. అటుపిమ్మట ప్రభువు నన్ను ప్రవచనము చెప్పుమనిన తోఫెతునుండి వెళ్ళిపోయి దేవాలయము ముంగిట నిలుచుండి ప్రజలతో ఇట్లు పలికితిని.

15. ”సైన్యములకధిపతియు, యిస్రాయేలు దేవుడునైౖన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు: ‘ఈ నగరము మీదికిని, దీని పరిసర పట్టణములమీదికిని నేను రప్పింతునన్న శిక్షలన్నిని రప్పింతును. మీరు మొండికి దిగి నా పలుకులు ఆలింపకున్నారు.’ ”