తుఫానుకు కర్తయైన ప్రభువు

 దావీదు కీర్తన

29 1. దైవతనయులారా! ప్రభువును స్తుతింపుడు.

                              ఆయన మహిమ ప్రతాపములను

                              కీర్తింపుడు.

2.           మహిమాన్వితమైన

               ఆయన దివ్యనామమును కొనియాడుడు.

               ప్రభువు పవిత్రమందిరమున నివేదితమైన

               ఆభరణములను ధరించి సాగిలపడుడు.

3.           ప్రభువుస్వరము

               జలములమీద విన్పించుచున్నది. మహిమాన్వితుడైన ప్రభువు

               ఉరుములతో గర్జించుచున్నాడు.

               ఆయన స్వరము

               సాగరముమీద విన్పించుచున్నది.

4.           ప్రభువు స్వరము మహాబలమైనది.

               మహాప్రభావము కలది.

5.           ప్రభువు స్వరము దేవదారులను పెల్లగించును.

               లెబానోను కొండలమీది

               దేవదారులను ముక్కచెక్కలు చేయును.

6.           అతడు లెబానోను కొండలను

               దూడలనువలె దూకించును.

               షిర్యోను కొండను కోడెదూడనువలె

               గంతులు వేయించును.

7.            ప్రభువు స్వరము మిలమిల మెరయు

               నిప్పులను వెదజల్లును

8.           ఆయన స్వరమువలన ఎడారి తల్లడిల్లును.

               కాదేషు ఎడారి కంపించును.

9.           ప్రభువు స్వరము

               సింధూరములను అల్లల్లాడించును.

               అడవిలోని మ్రాకులను మోడులుచేయును.

               ఆయన మందిరమున మాత్రమెల్లరును

               ”ప్రభువునకు మహిమ” అని

               నినాదము చేయుదురు.

10.         ప్రభువు ప్రళయజలములమీద

               సింహాస నాసీనుడయ్యెను.

               ఆయన కలకాలము రాజుగానుండి

               పరిపాలనము చేయును.

11.           ఆయన తన ప్రజలకు బలమును దయచేయును.

               శాంతిసమాధానములతో వారిని దీవించును.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము