ఉపవాసమును గూర్చి
58 1. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు:
”నీవు బిగ్గరగా కేకలిడుము,
బాకానూదినట్లుగా అరువుము.
నా ప్రజలకు
వారిపాపములను తెలియజేయుము.
యాకోబు వంశజులకు
వారి తప్పిదములను ఎరిగింపుము.
2. వారు ప్రతిరోజు నన్ను ఆరాధింతురు,
నా మార్గములను ఎరుగ గోరుదురు.
దేవుని ఆజ్ఞలు మీరక ధర్మబద్ధముగా
వర్తించుజాతివలె కన్పింప గోరుదురు.
నేను తమకు ధర్మయుక్తమైన
తీర్పులు ఒసగవలెననియు,
తాము నన్ను ఆరాధింప కోరుచున్నామనియు
చెప్పుదురు.
3. ప్రజలు ఇట్లు అడుగుచున్నారు:
‘ప్రభువు మమ్ము గమనింపనిచో
మేము ఉపవాసము చేయనేల?
ఆయన మమ్ము గుర్తింపనిచో
మేము ఒక్కప్రొద్దు ఉండనేల?’
ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు:
మీరు ఉపవాసము ఉండునపుడు
మీ లాభమును మీరు చూచుకొనుచున్నారు.
మీ పనివారిని పీడించుచున్నారు.
4. మీరు ఉపవాసము ఉండునపుడు
వివాదములుచేసి తగవులాడి కొట్టుకొనుచున్నారు.
మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా
మీరు ఈ దినము ఉపవాసముండరు.
5. మీరు ఉపవాసము ఉండునపుడు
రెల్లుకాడవలె వంగుదురు.
బూడిద మీదను, గోనె మీదను పరుండెదరు.
ఇి్టది ఉపవాస మనిపించుకొనునా?
నాకు ప్రీతి కలిగించునా?
6. నేను ఇష్టపడు ఉపవాసమిది:
మీరు అన్యాయపు బంధములను విప్పుడు.
ఇతరుల మెడమీదికెత్తిన కాడినితొలగింపుడు,
పీడితులను విడిపింపుడు.
వారిని ఎి్ట బాధలకును గురిచేయకుడు.
7. మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు.
ఇల్లువాకిలి లేనివారికి ఆశ్రయమిండు,
బట్టలులేనివారికి దుస్తులిండు.
మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు.
8. అప్పుడు నా కృప
ప్రాతఃకాల సూర్యునివలె మీపై ప్రకాశించును.
మీ గాయములు త్వరగా మానును.
మీ నీతి మీకు ముందుగా నడచును.
నా సాన్నిధ్యము మీ వెనువెంటవచ్చును.
9. మీరు ప్రార్థించునప్పుడు
నేను మీ వేడుకోలును ఆలింతును.
మీరు మొరప్టిెనపుడు
నేను మీకు ప్రత్యుత్తరమిత్తును,
మీరు ఇతరులను పీడింపకుడు,
అవమానింపకుడు,
దుష్టవాక్కులు పలుకకుడు.
10. ఆకలిగొనిన వారికి భోజనము పెట్టుడు.
బాధితులను ఆదుకొనుడు.
అప్పుడు చీకిలో మీమీద వెలుగు ప్రకాశించును.
మీ చుట్టునున్న అంధకారము
మిట్టమధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును.
11. నేనెల్లపుడును మిమ్ము నడిపింతును,
మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తిని ఒసగుదును.
మీకు బలమును దయచేయుదును.
మీరు నీరుక్టిన తోటవలె కళకళలాడుదురు.
వ్టిపోని చెలమవలె ఒప్పుదురు.
12. మీ జనులు బహుకాలమునుండి
శిథిలముగానున్న గృహములను పునర్నిర్మింతురు.
మీరు పూర్వపు పునాదుల మీదనే ఇండ్లుకట్టుదురు.
ప్రాకారములను మరల క్టినవారుగాను,
శిథిలగృహములను పునర్నిర్మించినవారుగాను
పేరు తెచ్చుకొందురు.
విశ్రాంతిదినమును పాించువారికి బహుమతి
13. మీరు విశ్రాంతిదినమును పవిత్రము చేయుడు.
నా పవిత్రదినమున
మీ వ్యాపారములను మానుడు.
దానిని సంతోషకరమైన దానినిగాను,
గౌరవార్హమైనదిగాను భావింపుడు.
ఆ దినమున ప్రయాణమును, పనిని,
ముచ్చట్లు చెప్పుకొనుటను మానుకొనుడు.
14. అప్పుడు నేను
మీకు ఆనందమును దయచేయుదును.
మిమ్ము భూమియందంతట
మాన్యులను చేయుదును.
మీరు మీ పితరుడైన
యాకోబు వారసభూమిని అనుభవింతురు.
ఇవి ప్రభువు పలుకులు.”