విగ్రహములను గూర్చిన హెచ్చరికలు

10 1. సోదరులారా! మన పూర్వులకు ఏమి సంభవించినదో మీరు తెలిసికొనవలెనని నా కోరిక. వారు అందరు మేఘముక్రింద ఉండిరి. సముద్ర మును దాటి సురక్షితముగా ఆవలకు చేరిరి.

2. వారు మేఘమునందును, సముద్రమునందును మోషే సహ వాసములోనికి బప్తిస్మమును పొందిరి.

3. అందరును ఆధ్యాత్మికమగు ఒకే భోజనమును పుచ్చుకొనిరి.

4. అందరును ఆధ్యాత్మికమగు ఒకే పానీయమును త్రాగిరి. ఏలయన, వారు తమతోపాటు వెడలిన ఆధ్యాత్మి కమగు శిలనుండి దాహమును తీర్చుకొనిరి. ఆ శిల క్రీస్తే.

5. అయినప్పటికిని, వారిలో పెక్కుమందిని గూర్చి దేవుడు సంతోషింపలేదు. కనుక వారి ప్రేతములు ఎడారియందు చెల్లాచెదరు చేయబడినవి.

6. కావున, వారివలె మనము చెడును ఆశింపకుండుటకు ఈ విషయములు మనకు హెచ్చరికగా ఉన్నవి.

7.వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకు లుగా ఉండకుడు.

               ”తినుటకు, త్రాగుటకు ప్రజలు కూర్చుండిరి;

               నాట్యమాడుటకై లేచిరి”

అని వ్రాయబడినట్లు 8. వారిలో కొందరివలె మనము వ్యభిచరింపరాదు. వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క రోజుననే ఇరువది మూడువేలమంది మరణమునకు గురియైరి.

9. వారిలో కొందరివలె మనము ప్రభువును శోధింపరాదు. వారిలో కొందరు శోధించి పాములచే కాటు వేయబడి మరణించిరి. 10. వారిలో కొందరి వలె మనము సణుగుకొనరాదు. వారిలో కొందరు సణగి వినాశకర్తచే నాశనము చేయబడిరి.

11. దృష్టాంతములుగా ఉండుటకే వారికి ఇవి అన్నియు సంభవించినవి. యుగాంతపు చిట్టచివరి రోజులలో జీవించుచున్న మనకు హెచ్చరికగా ఉండుటకే ఇవి అన్నియు వ్రాయబడినవి.

12. కనుక తాను చక్కగా నిలబడితినని భావించు వ్యక్తి, పడిపోకుండునట్లు జాగ్రత్తగా ఉండవలెను.

13. మానవులకు సాధారణము కాని ఏ శోధనయు మీకు కలుగలేదు. ఏలయన, దేవుడు నమ్మదగినవాడు. మీ నిగ్రహశక్తిని మించి మిమ్ము శోధింపబడనీయడు. అంతే కాక, మీరు శోధింపబడునప్పుడు, దానిని సహింపగల శక్తిని మీకు ఒసగి, బయటపడు మార్గమును మీకు ఆయన చూపును.

14. కావున, ప్రియమిత్రులారా! విగ్రహారాధన నుండి తొలగిపొండు.

15. బుద్ధిమంతులని ఎంచి మీకు చెప్పుచున్నాను. నేను చెప్పుదానిని మీరే యోచింపుడు.

16. దీవెనపాత్రలోనిది మనము ఆశీర్వదించి త్రాగునపుడు క్రీస్తురక్తమున మనము పాలు పంచుకొనుట లేదా?  మనము   రొట్టెను  విరిచినపుడు క్రీస్తు శరీరములో పాలుపంచుకొనుట లేదా?

17. ఒకే రొట్టె అగుటచే, పెక్కుమందిమైనను, మనము అందరమును ఒకే శరీరము. ఏలయన, మనము అందరమును ఆ ఒకే రొట్టెయందు పాలుపంచుకొను చున్నాము.

18. హెబ్రీయ ప్రజల విషయము విచారింపుడు. బలిగా అర్పింపబడిన దానిని తినువారు బలి పీఠముపై దేవునిసేవలో భాగస్వాములుకారా?

19. దీని భావమేమి? విగ్రహముగాని, దానికి అర్పింప బడిన ఆహారముగాని నిజముగ లెక్కింపదగినదా?

20. కాదు! అన్యుల బలిపీఠములపై బలిచేయబడినది దేవునకు కాక, దయ్యములకు అర్పింపబడుచున్నది. కనుక మీరు దయ్యములతో భాగస్వాములు కారాదని నా కోరిక.

21. ప్రభువు పాత్రమునుండియు, సైతాను పాత్రమునుండియు రెండింటి నుండియు త్రాగజాలరు. ప్రభువు బల్లవద్దను, సైతాను బల్లవద్దను రెండింటి వద్ద తినజాలరు.

22. దేవునికి అసూయ కలిగింపవలెనని భావించుదమా? ఆయనకంటె మనము బలవంతులమని అనుకొందమా?

23. అన్నియును అనుమతింపబడినవే కాని, అన్నియును ఉపయోగకరములు కావు. అన్నియును అనుమతింపబడినవే కాని, అన్నియును అభివృద్ధిని కలిగింపవు.

24. ఏ వ్యక్తియు తన మేలునే చూచుకొనక ఇతరుల మేలు కొరకై చూచుచుండవలెను.

25. మనస్సాక్షి మూలకమగు ఎట్టి ప్రశ్నలు అడుగకయే మాంసపు విక్రయశాలయందుండు దేనిని అయినను మీరు తినవచ్చును. 26. ఏలయన, పవిత్ర గ్రంథము పలుకుచున్నట్లుగ,

”భువియు, భువియందలి సమస్తమును

ప్రభువునకు చెందినవే!”

27. అవిశ్వాసియగు వ్యక్తి ఒకడు మిమ్ము భోజనమునకు పిలిచెను అనుకొనుడు. మీరు పోదలచినచో, మనస్సాక్షికి సంబంధించిన ఎట్టి ప్రశ్నలు అడుగకయే మీముందు ఉంచబడిన దానిని భుజింపుడు.

28. (కాని ”ఇది విగ్రహములకు అర్పింపబడిన ఆహారము” అని ఎవరైన చెప్పినచో దానిని భుజింపకుడు. ఏలయన, మీకు అటుల చెప్పినవాని నిమిత్తమును, మనస్సాక్షి నిమిత్తమును దానిని భుజింపకుడు.

29. అనగా మీ మనస్సాక్షి నిమిత్తము కాదు. అతని మనస్సాక్షి నిమి త్తమే).ఏలయన, వేరొకని సంకోచిత మనస్సాక్షిని బట్టి నా స్వేచ్ఛ ఏల పరిమితము కావలెను?

30. నేను కృతజ్ఞతతో భోజనములో పాల్గొన్నచో, నేను కృతజ్ఞతా స్తుతులు అర్పించి తిను ఆహారమునుగూర్చి నన్ను విమర్శింపనేల?

31. నీవు తినినను, త్రాగినను, ఏమి చేసినను దానిని అంతిని దేవుని మహిమకొరకై చేయుము.

32. యూదులకుగాని, అన్యులకుగాని, దైవసంఘము నకుగాని ఎి్ట బాధయు కలుగకుండునట్లు జీవింపుడు.

33. నా స్వప్రయోజనమును ఆశింపక, ఇతరులు రక్షింపబడవలెనని వారి మేలును కోరుతు, నేను చేయు పనులన్నింయందు అందరిని ఆనందింపచేయుటకు ప్రయత్నించుచుంటిని.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము