దావీదునకు వారసులు

దావీదు చివరి రోజులు

1 1. దావీదు పండుముదుసలిఅయ్యెను. కంబళ్ళతో కప్పినను అతని దేహమునకు వేడి పుట్టదయ్యెను.

2. కావున దావీదు కొలువుకాండ్రు అతనితో ”ప్రభూ! నీకొక పడుచును కొనివత్తుము. ఆమె మీ యొద్దనే యుండి మీకు పరిచారము చేయును. మీ ప్రక్కలో పరుండి మీ మేనికి వేడి ప్టుించును” అని చెప్పిరి.

3. వారు అందమైన పడుచుకొరకై యిస్రాయేలు దేశమెల్ల గాలించిరి. కడన షూనేమున అబీషగు అను యువతి దొరకగా ఆమెను రాజు వద్దకు కొనివచ్చిరి.

4. అబీషగు మిక్కిలి అందగత్తె. ఆమె రాజు వద్దనే ఉండి అతనికి పరిచర్యలు చేసెను. రాజు అబీషగును కూడలేదు.

అదోనీయా కుట్రలు

5. దావీదునకు హగ్గీతు వలన కలిగిన కుమారుడు అదోనీయా. అతనికి పొగరెక్కగా తానే రాజు కావలెనని కోరుకొనెను. కావున అదోనీయా రథమును, గుఱ్ఱము లను చేకూర్చుకొనెను. తన ముందు హెచ్చరికలు చేయుటకై ఏబదిమంది బంటులను నియమించెను.

6. దావీదు అదోనీయాను ఎప్పుడును మందలించి ఎరుగడు. అతడు మిగుల రూపవంతుడు. అబ్షాలోము తరువాత హగ్గీత్తు అతనిని కనెను.

7. అదోనీయా సెరూయా కుమారుడగు యోవాబును, యాజకుడగు అబ్యాతారును రాజ్యవిషయమై సంప్రదించెను. వారు అతని సహాయము తీసికొనిరి.

8. కాని యాజకుడైన సాదోకు, యెహోయాదా కుమారుడగు బెనాయా, ప్రవక్తయగు నాతాను, షిమీ, రేయి, దావీదుని యోధులు అతనివైపు చేరలేదు.

9. ఒకనాడు అదోనీయా ఎన్రోగేలు చెంతనున్న ”సర్పశిల” అను చోట పొట్టేళ్ళను, ఎద్దులను, బలిసిన కోడెలను వధించి బలిఅర్పించెను. అతడు తన సోద రులగు రాజకుమారులను, యూదా సీమనుండి రాజు కొలువున కుదిరిన ఉద్యోగులను విందుకు ఆహ్వా నించెను.

10. కాని ప్రవక్త నాతానును, బెనాయాను, రాజు యోధులను, సోదరుడగు సొలోమోనును పిలువ లేదు.

నాతాను, బత్షెబల పన్నాగములు

11. నాతాను సొలోమోను తల్లి బత్షెబ వద్దకు వెళ్ళి ”మన ప్రభువగు దావీదునకు తెలియకుండగనే హగ్గీతు కుమారుడు అదోనీయా రాజయ్యెను. ఈ సంగతి నీవు వింవా?

12. ఇపుడు నీ ప్రాణమును, నీ కుమారుని ప్రాణమును దక్కించుకోగోరెదవేని నా మాటలు వినుము.

13. నీవు వెంటనే రాజు చెంతకు వెళ్ళి ‘ప్రభూ! మీ తరువాత నా కుమారుడు సొలోమోను రాజగుననియు, అతడే మీ సింహాసనముపై అధిష్ఠించు ననియు ప్రభువులవారు మాట ఈయలేదా? మరి ఇప్పుడు అదోనీయా రాజగుటఎట్లు?’ అని అడుగుము.

14. నీవు ప్రభువుతో మాటలాడుచుండగనే నేనును వచ్చి నీ పలుకులు సమర్థింతును” అని చెప్పెను.

15. కనుక బత్షెబ రాజుతో మ్లాడుటకై అతని పడకగదికి వెళ్ళెను. అప్పికి దావీదు ముదుసలి. షూనేమునుండి వచ్చిన పడుచు అబీషగు అతనికి పరిచర్య చేయుచుండెను.

16. బత్షెబ సాగిలపడి రాజునకు నమస్కరించెను. అతడు ఏమి పనిమీద వచ్చితివి అని అడిగెను.

17. ఆమె ”ప్రభూ! మీ తరువాత నా కుమారుడు సొలోమోను రాజగునని, అతడే మీ సింహాసనముపై కూర్చుండునని ప్రభువుల వారు యావే పేర బాస చేయలేదా?

18. అయినను ఇప్పుడు అదోనీయా రాజయ్యెనుకదా! ఏలినవారికి ఈ సంగతి ఏమియు తెలియనట్లున్నది.

19. అతడు గొఱ్ఱెపోతులను, ఎడ్లను, బలిసినకోడెలను మిక్కుట ముగా వధించి బలిఅర్పించెను. రాజకుమారులను, యాజకుడగు అబ్యాతారును, సైన్యాధిపతియగు యోవాబును విందునకు ఆహ్వానించెను. కాని మీ కుమారుడు సొలోమోనును మాత్రము పిలువడయ్యెను.

20. ప్రభూ! మీ తరువాత ఎవరు రాజు అగుదురో తెలిసికోవలయునని యిస్రాయేలీయులందరు ఉవ్విళ్ళూ రుచున్నారు.

21. ఈ సంగతిని ప్రభువులవారు ఇప్పుడే నిర్ణయింపరేని తమరు కన్నుమూసిన పిదప నేను నా కుమారుడు సొలోమోను రాజద్రోహులముగా లెక్కింపబడుదుము” అని పలికెను.

22. ఆమె రాజుతో ఇట్లు మ్లాడుచుండగనే ప్రవక్త నాతాను కూడ వచ్చెను.

23. ప్రవక్త వచ్చెనని పరిచారకులు రాజునకు విన్నవించిరి. నాతాను రాజు ఎదుికి వచ్చి తలవంచి దండము పెట్టెను.

24. అతడు ”ప్రభూ! మీ తరువాత అదోనీయా రాజు కావలెనని తమరు ఆజ్ఞాపించితిరా?

25. అతడు నేడే పొట్టేళ్ళను, ఎడ్లను, బలిసిన కోడెలను మిక్కుటముగా వధించి బలిఅర్పించెను. రాజకుమారులను సైన్యాధి పతియగు యోవాబును, యాజకుడగు అబ్యాతారును విందునకు ఆహ్వానించెను. అదిగో! చూడుడు! వారిప్పుడే విందారగించుచున్నారు. మా రాజు అదోనీయాకు దీర్ఘాయువు అని అరచుచున్నారు.

26. కాని వారు నన్నుగాని, యాజకుడు సాదోకునుగాని, బెనాయాను గాని, సొలోమోనునుగాని ఆహ్వానింపరైరి. 27. ప్రభూ! ఇది అంతయు మీ అనుమతితోనే జరిగినదా? అట్లయిన ఏలినవారు తమ కొలువుకాండ్రకు ఈ సంగతి తెలుపరైతిరేమి?” అని అడిగెను.

సొలోమోనును రాజుగా అభిషేకించుట

28. దావీదు బత్షెబను పిలిపింపగా ఆమె వచ్చి అతనియెదుట నిలుచుండెను.

29. అతడు ఆమెతో ”నన్ను సకల ఆపదలనుండి కాపాడిన సజీవుడగు దేవునిపేర ప్రమాణము చేయుచున్నాను వినుము.

30. నా తరువాత నా కుమారుడు సొలోమోను నిక్క ముగా రాజగునని యిస్రాయేలు దేవునిపేర మునుపు నేను నీకిచ్చిన మాట ఈ దినముననే నెరవేర్చుదును” అని చెప్పెను.

31. బత్షెబ సాగిలపడి రాజునకు నమస్కరించి ”ప్రభువులవారు కలకాలము జీవింతురు గాక!” అని అనెను.

32. అంతట రాజు యాజకుడైన సాదోకును, ప్రవక్తయైన నాతానును, బెనాయాను పిలిపింపగా వారు అతని చెంతకు వచ్చిరి.

33. రాజు వారితో ”నా కుమారుడు సొలోమోనును నా కంచరగాడిదపై ఎక్కించుకొని గీహోను చెలమవద్దకు తీసికొనిపొండు. నా కొలువుకాండ్రను కూడ మీ వెంట కొనిపొండు.

34. అచట యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను సొలోమోనును యిస్రాయేలు రాజుగా అభి షేకింపవలయును. తరువాత బాకాను ఊదించి ‘సొలోమోనునకు దీర్ఘాయువు!’ అని ప్రకటన చేయుడు.

35. అటుపిమ్మట మీరందరు సొలోమోను వెంటనడ చుచు, సింహాసనముపై కూర్చుండబెట్టుటకై అతనిని ఇచటకు కొనిరండు. అతడు నాకు బదులుగా రాజ గును. యిస్రాయేలును, యూదాను పరిపాలించుటకై నేను సొలోమోనును నియమించితిని” అని చెప్పెను.

36. ఆ మాటలకు బెనాయా ”ఏలినవారు చెప్పినట్లే చేయుదుము. మీరు కొలుచు యావే ప్రభువు మీ మాటను స్థిరపరచునుగాక!

37. ప్రభువు మీకు తోడైయున్నట్లే సొలోమోనునకు కూడ తోడైయుండు గాక! అతడు మీకంటెను ప్రసిద్ధుడగునుగాక!” అని అనెను.

38. అంతట యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను, యెహూయాదా కుమారుడగు బెనాయా, రాజు అంగరక్షకులగు కెరెతీయులు, పెలెతీయులు సొలోమోనును రాజుగారి కంచరగాడిదపై కూర్చుండ బ్టెి గీహోను చెలమవద్దకు తోడ్కొనిపోయిరి.

39. ప్రభుగుడారమునుండి కొనివచ్చిన కొమ్ములోని నూనెతో యాజకుడైన సాదోకు సొలోమోనును అభిషేకించెను. అటుపిమ్మట బాకానూదింపగా జనులెల్లరు ”సొలోమోను రాజునకు దీర్ఘాయువు!” అని నినాదములు చేసిరి.

40. అంతట ప్రజలు పిల్లనగ్రోవులూదుచు, సంతోషము మిన్నుముట్టగా నేల దద్దరిల్లిపోవునట్లు కేకలిడుచు సొలోమోనును రాజసౌధమునకు తీసికొనివచ్చిరి.

అదోనీయా భయపడుట

41. అచట చాకిరేవు చెంత అదోనీయా, అతని అనుచరులు విందు ముగించుచుండగా ప్రజల పొలి కేకలు వినిపించినవి. యోవాబు బాకానాదము విని ”పట్టణములో ఆ కోలాహలమేమి’ అని ప్రశ్నించెను.

42. అతడు ఇంకను ప్రశ్నించుచుండగనే అబ్యాతారు కుమారుడు యోనాతాను వచ్చెను. అతనిని చూచి అదోనీయా ”రా రమ్ము! నీవు యోగ్యుడవు కనుక మాకు మంచివార్తలనే తెచ్చియుందువు” అని అనెను.

43. యోనాతాను ”అవును, మన ప్రభువగు దావీదు సొలోమోనును రాజును చేసెను.

44. సొలోమోను వెంట యాజకుడైన సాదోకును, ప్రవక్తయైన నాతానును, బెనాయాను, కెరెతీయులను, పెలెతీయులను రాజు పంపెను. వారతనిని రాజుగారి కంచరగాడిదపై ఎక్కించుకొనిపోయిరి.

45. యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను అతనిని గీహోనున రాజుగా అభిషేకించిరి. అటుతరువాత వారందరు సంతోష ముతో కేకలు వేయుచు పట్టణమునకు మరలివచ్చిరి. నగరమంతయు అల్లకల్లోలముగానున్నది. మీరు వినిన నినాదమదియే.

46. ఇపుడు సొలోమోను సింహాసనముపై ఆసీనుడైయున్నాడు.

47. పైపెచ్చు కొలువుకాండ్రు దావీదును దర్శింపవచ్చి ‘దేవుడు సొలోమోనును మీకంటె అధికుని జేయుగాక! అతని రాజ్యమును మీ రాజ్యముకంటె సుప్రసిద్ధము చేయు గాక!’ అని దీవించిరి.

48. ఆ మాటలకు దావీదురాజు పడుక పైనుండియే సాగిలపడి నమస్కరించి ‘యిస్రాయేలు ప్రభువైన దేవునికిస్తుతి కలుగునుగాక! ప్రభువు నేను చూచుచుండగనే నేడు నా కుమారుని సింహాసనముపై కూర్చుండబెట్టెనుకదా’ అని పలికెను!” అని చెప్పెను.

49. ఆ మాటలు విని అదోనీయా, అతిథులు మిగుల భయపడి ఎవరిత్రోవన వారు వెడలిపోయిరి.

50. అదోనీయా సొలోమోనునకు భయపడి ప్రభు మందిరము ప్రవేశించి బలిపీఠము కొమ్ములకు1 పెన వేసికొనెను.

51. అదోనీయా సొలోమోనునకు వెరచి బలిపీఠము కొమ్ములను ఆశ్రయించెననియు, రాజు తనను చంపనని మాటయిచ్చిననేకాని అచటనుండి కదల ననుచున్నాడనియు సొలోమోనునకు తెలియ జేసిరి.

52. సొలోమోను ”అదోనియా విశ్వాసయోగ్య ముగా ప్రవ ర్తించినచో అతనిమీద ఈగైన వ్రాలదు. కాని అతడు కపటబుద్ధి అయ్యెనేని తప్పక ప్రాణములు కోల్పో వలసినదే” అని అనెను.

53. అంతట రాజు సేవకులనంపగా వారు అదోనీయాను బలిపీఠము వద్దనుండి తీసికొనివచ్చిరి. అదోనీయా సొలోమోను నకు సాష్టాంగపడి నమస్కరించెను. రాజతనితో ”ఇక నీ ఇంికి వెడలిపొమ్ము” అనెను.