3 1. ఆయన నాతో ”నరపుత్రుడా! నీకు  కనబడిన దానిని భుజింపుము. నీవు ఈ గ్రంథపుచుట్టను భుజించి యిస్రాయేలీయుల వద్దకువెళ్ళి వారితో మాటలా డుము” అని చెప్పెను.

2. నేను నోరు తెరచితిని. ఆయన భుజించుటకు నాకు ఆ గ్రంథపుచుట్టను ఇచ్చి, 3. ”నరపుత్రుడా! నేను నీకు ఇచ్చు ఈ గ్రంథపుచుట్టను భుజించి దీనితో కడుపు నింపుకొనుము” అని అనెను. నేను దానిని భుజింపగా అది నానోిలో తేనెవలె మధురముగా ఉండెను.

4. అంతట ఆయన నాతో ఇట్లనెను. ”నరపుత్రుడా! నీవు యిస్రాయేలీయులవద్దకు వెళ్ళి నా మాటలను వారికి వినిపింపుము.

5. నేను నిన్ను కష్టమైన పరభాష మాటలాడు వారివద్దకు పంపుటలేదు. యిస్రాయేలీయుల వద్దకు పంపుచున్నాను.

6. నేను నిన్ను నీకు అర్థముకాని కఠినమైన భాషలు మ్లాడు పెద్ద జాతుల వారివద్దకు పంపియున్నచో వారు నీ పలుకు లాలించియుండెడివారే.

7. కాని యిస్రాయేలీ యులలో ఎవరును నీ పలుకులు వినరు. వారు నా పలుకులనే వినలేదు. వారు మొండివారు, కఠిన చిత్తులు.

8. కాని నేను నిన్నిపుడు వారివలె మొండి వానినిగాను, కఠినునిగాను చేయుదును.

9. నేను నిన్ను చెకుముకి రాయివలెను, వజ్రమువలెను కఠిను నిగా చేయుదును. కనుక నీవు ఆ తిరుగుబాటుదారు లకు భయపడవలదు.”

10. ఆయన ఇంకను ఇట్లనెను: ”నరపుత్రుడా! నేను నీతో చెప్పు మాటలన్నింని సావధానముగా విని జ్ఞప్తియందుంచుకొనుము.

11. అటుపిమ్మట ప్రవాసముననున్న మీ ప్రజల యొద్దకుపోయి, వారు వినినను, వినకున్నను యావే దేవుడనైన నా సందేశ మును వారికి తెలియజెప్పుము.”

12. అంతట దేవుని ఆత్మ నన్ను పైకిలేపెను. నేను నా వెనుక ప్రక్కన ఒక మహాస్వరము ”ప్రభువు వాసస్థలమున ఆయన మహిమకు స్తుతి కలుగును గాక!” అని పలుకుటను వింని.

13. ఆ నాలుగు ప్రాణుల రెక్కలు ఒకదానితోనొకి తాకుటవలన, ఆ రెక్కల ప్రక్కల ఉన్న చక్రములవలన కలిగిన చప్పుడు గొప్ప ప్రకంపనల ధ్వనిగా ఉండెను.

14. దేవుని హస్తము బలముగా నన్ను ఆవహించెను. దేవుని ఆత్మ నన్ను పైకి తోడ్కొనిపోగా నాకు కోపమును, బాధ యును కలిగెను.

15. ఆ రీతిగా నేను కెబారు నది చెంతగల టెలాబీబునకు వచ్చితిని. ప్రవాసులు అచటనే వసించుచుండిరి. నేను నిశ్చేష్టుడనై ఏడునాళ్ళు అచట నుింని.

కావలివాడుగా ప్రవక్త

16. ఏడుదినములైన తరువాత ప్రభువు వాణి నాతో ఇట్లనెను: 17. ”నరపుత్రుడా! నేను నిన్ను యిస్రాయేలీయులకు కావలివానినిగా నియమించితిని. నీవు నా హెచ్చరికలను వారికి తెలియజేయుచుండ వలెను.

18. నేను ఎవడైన దుర్మార్గుడు ‘చచ్చును’ అని చెప్పితిననుకొనుము. నీవు అతనిని హెచ్చరించి అతడు తన దుష్టత్వము విడనాడి మరల బ్రతుకునట్లు చేయనందున అతడు పాపిగానే చనిపోయెను అను కొనుము. అప్పుడు అతని మరణమునకు నీవు బాధ్యుడ వగుదువు.

19. కాని నీవు దుష్టుని హెచ్చరించినను అతడు తనపాపము నుండి వైదొలగక ఆ పాపములోనే చచ్చిపోయెనను కొనుము. అప్పుడు నీ ప్రాణమునకు ముప్పు కలుగదు.

20. సజ్జనుడొకడు చెడుకు పాల్పడెననుకొనుము. నేనతనికి వలపన్నితిననుకొనుము. నీవు హెచ్చరింప నిచో అతడు చనిపోవుననుకొనుము. అతడు తన పాప ఫలితముగా నశించును. అతడు చేసిన మంచిని నేను గుర్తుంచుకొనను. కాని అతని చావునకు నీవు బాధ్యు డవు అగుదువు. 

21. నీవు సజ్జనుని పాపము చేయ వలదని హెచ్చరింపగా అతడు పాపమునుండి వైదొలగె నేని చావును తప్పించుకొనును. నీ ప్రాణమును దక్కును.”

యెరూషలేము పతనమును గూర్చిన ప్రవచనములు

ప్రవక్త మూగవాడగుట

22. ప్రభువు హస్తము నన్నావహించెను. ఆయన నాతో ”నీవు మైదానపుభూమికి పొమ్ము, నేనచట నీతో మ్లాడుదును” అని చెప్పెను.

23. నేను మైదానపు భూమికి వెళ్ళితిని. అచట కెబారునది చెంత చూచినట్లే ప్రభువు తేజస్సును చూచి నేలపై బోరగిలబడితిని.

24. అంతట ప్రభువు ఆత్మ నాలో ప్రవేశించి నన్ను పైకి లేపి నిలబెట్టెను. ప్రభువు నాతో ఇట్లనెను: ”నీవు ఇంికి వెళ్ళి తలుపులు వేసికొని లోపల ఉండిపొమ్ము.

25. నరపుత్రుడా! నీవు త్రాళ్ళతో బంధింపబడుదువు. వెలుపలికి వెళ్ళజాలవు.

26. నేను నీ నాలుక పడి పోవునట్లు చేయుదును. నీవు మూగవగుదువు. కనుక ఆ తిరుగుబాటుదారులను హెచ్చరింపజాలవు.

27. నేను మరల నీతో మాటలాడి నీ మూగతనమును తొలగింతును. అప్పుడు నీవు ప్రభుడనైౖన నా సందేశ మును వారికి విన్పింపుము. వారిలో కొందరు విందురు. కొందరు వినరు. వారు తిరుగుబాటు చేయుజాతి”.