విగ్రహారాధన ఖండనము

14 1. యిస్రాయేలు పెద్దలు కొందరు ప్రభువు చిత్తమును  ఎరుగగోరి నా చెంతకు వచ్చి కూర్చుండిరి.

2. అంతట ప్రభువువాణి నాతో ఇట్లనెను: 3. ”నరపుత్రుడా! ఈ ప్రజలు తమ హృదయములను విగ్రహములకు అర్పించిరి. అవి వారిని పాపము లోనికి నడిపించుచున్నవి. ఇి్టవారికి నేను నా చిత్తమును తెలియజేయుదునా?

4. నీవు వారితో మ్లాడుము. యావే ప్రభుడనైన నా పలుకులను వారికి ఇట్లు వినిపింపుము. యిస్రా యేలీయులు తమ హృదయములను విగ్రహములకు అర్పించుకొని, వానివలన పాపములో పడుచున్నారు. అటుపిమ్మట నా చిత్తమును తెలిసికోగోరి ప్రవక్తలను సంప్రతించుచున్నారు. వారు పెక్కు విగ్రహములను సేవించుచున్నారు. అి్టవారికి నేనిచ్చు బదులు వారు చేయు కార్యములకు తగినట్లుగానే ఉండును.

5. ఆ విగ్రహములు యిస్రాయేలీయులను నా నుండి వైదొలగించెను. వారి హృదయమును లోబరచునట్లుగ ఇపుడు నేను వారికి బదులిచ్చుచున్నాను.   

6. యావే ప్రభుడనైన నా మాటలను నీవు వారితో చెప్పుము. వారు హేయమైన విగ్రహములను విడనాడి నా చెంతకు తిరిగి రావలెనని చెప్పుము.

7. యిస్రాయేలీయులలో ఒకడుకాని, వారి నడుమ వసించు అన్యజాతి ప్రజలలో ఒకడుకాని, నానుండి వైదొలగి విగ్రహములను పూజించి అటుపిమ్మట ప్రవక్తను సంప్రతించెనేని, నేను వానికి తగిన జవాబునే ఇత్తును. 8. నేను వానికి విరోధినగుదును. వానిని దుర్గతికి సూచనగానుంతును. నా ప్రజల సమాజము నుండి వానిని తొలగింతును. అపుడు వారు నేను యావేనని గుర్తింతురు.

9. ఏ ప్రవక్తయైన మోసపోయి అసత్య ప్రవచనము చెప్పెనేని, అతనిని మోసగించినది నేనే అనుకొనుడు. నా జనులైన యిస్రాయేలీయుల నుండి వానిని నిర్మూ లనము చేసెదను.

10. ఆ ప్రవక్తయు, అతనిని సంప్రతించిన వాడుకూడ అదియే దండనమును అనుభవించును.

11. నేనిట్లు చేసినచో యిస్రాయేలీ యులు నన్ను విడనాడకుందురు. తాము పాపము వలన అపవిత్రులు కాకుందురు. వారు నా ప్రజలగు దురు, నేను వారి దేవుడనగుదును. ఇది యావే ప్రభుడనైన నా పలుకు”.

వ్యక్తిగతమైన బాధ్యత

12. ప్రభువువాణి నాతో ఇట్లు అనెను: 13. ”నరపుత్రుడా! ఏ దేశమైన నన్ను నిరాకరించి నాకు ద్రోహముగా పాపము చేసెనేని, నేను చేయిచాచి దానికి ఆహారము సరఫరా కాకుండునట్లు చేయుదును. కరువునుపంపి దానిలోని నరులను, పశువులను నాశ నము చేయుదును.

14. అపుడు నోవా, దానియేలు1, యోబు అను ముగ్గురు వ్యక్తులు అచట వసించు చున్నను, వారి పుణ్యము వారిని మాత్రమే కాపాడును. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు.

15. ఒకవేళ నేను ఆ దేశముమీదికి వన్య మృగములను పంపగా అవి నరులను చంపివేసి, ఎవరును అటునిటు తిరగకుండునంతి ప్రమాద మును తెచ్చిపెట్టెననుకొనుము.

16. అపుడు ఈ ముగ్గురు జనులు ఆ దేశమున వసించుచున్నను, వారు తమ బిడ్డలనుగూడ కాపాడుకోజాలరు. తమ ప్రాణములను మాత్రమే కాపాడుకొందురు. దేశము ఎడారియై తీరును. యావే ప్రభుడను, సజీవుడనగు దేవుడనైన నేను చెప్పుచున్నాను.

17. ఒకవేళ నేను ఆ దేశము మీదికి యుద్ధ మును పంపి మారణాయుధములతో అందలి నరు లను, పశువులను చంపివేసితిననుకొనుము.

18. అప్పుడు ఈ ముగ్గురు జనులు ఆ దేశమున వసించు చున్నను, వారు తమ బిడ్డలను కాపాడుకోజాలరు. తమ ప్రాణములను మాత్రమే కాపాడుకొందురు. యావే ప్రభుడను, సజీవుడనగు దేవుడనైన నేను చెప్పు చున్నాను.  

19. ఒకవేళ నేను ఆ దేశము మీదికి అంటు రోగమునుపంపి కోపముతో చాలమందిని చంపితినను కొనుము. నరులను, మృగములను నాశనము చేసితి ననుకొనుము.

20. అపుడు నోవా, దానియేలు, యోబు అచట నివసించుచుండినను వారు తమ బిడ్డలను కాపాడుకోలేరు. వారి పుణ్యము వారిని మాత్రమే కాపాడును”.

21. ప్రభువైన యావే ఇట్లు చెప్పుచున్నాడు: ”నేను యెరూషలేము మీదికి పోరు, కరువు, వన్యమృగ ములు, రోగములు అను కఠినశిక్షలను నాలిగింని పంపి అచి నరులను, పశువులను నాశనముచేయ తీర్పు తీర్చినయెడల అి్ట వారుండినను దానిని రక్షింపను.

22. ఎవరైన బ్రతికి బయటపడి తమ బిడ్డలను కాపాడుకొందురేని, వారు మీ చెంతకు వచ్చినపుడు మీరు వారి క్రియలను పరిశీలించి చూడుడు. యెరూషలేము వాసులందరు ఎంత దుష్టులో మీకే తెలియును. కనుక నేను యెరూషలేము నకు విధించు శిక్ష తగినదేనని మీరు ఒప్పుకొందురు.

23. నేను చేయు కార్యములనెల్ల సకారణముగనే చేయుదునని మీరు గ్రహింతురు. ఇది ప్రభుడనైన నా వాక్కు.”