అష్దోదు వినాశనమును గూర్చి దైవవాక్కు
20 1. అస్సిరియారాజైన సర్గోను
తన సైన్యాధిపతియైన తర్తానును
అష్దోదుమీదికి పంపెను.
అతడు వచ్చి ఆ నగరమును ముట్టడించి స్వాధీనము చేసికొనెను.
2. ఆ కాలమున ప్రభువు
ఆమోసు కుమారుడైన యెషయాతో
”నీ నడుము మీది గోనెపట్టను తీసివేసి,
పాదరక్షలను విడువుము” అని చెప్పెను.
అతడు ప్రభువు ఆజ్ఞాపించినట్లే
పాదరక్షలు విడిచి దిగంబరుడుగా నడిచెను.
3. అష్దోదు లొంగిపోయినపుడు ప్రభువిట్లు పలికెను:
”నా సేవకుడైన యెషయా
మూడేండ్లనుండి పాదరక్షలు విడిచి
దిగంబరుడుగా తిరుగుచున్నాడు.
అతడు ఐగుప్తు కూషు దేశములకుపట్టు దుర్గతికి
గుర్తుగాను, సూచనముగాను ఉన్నాడు.
4. అస్సిరియారాజు ఆ రెండు దేశములనుండియు
బందీలను కొనిపోవును.
అతడు ఆ దేశములనుండి
పిన్నలను పెద్దలను గొనిపోవును.
వారు బట్టలను చెప్పులను విడచివెళ్ళవలెను.
వారి పిరుదుల మీద బట్టలేమియువుండవు.
అది ఐగుప్తునకు అవమానకరమగును.
5. యిస్రాయేలీయులు తాము నమ్మిన
కూషును గూర్చియు,
తాము గొప్పగా ఊహించుకొనిన
ఐగుప్తీయులను గూర్చియు
నిరాశచెంది సిగ్గుపడుదురు.
6. ఆ కాలము వచ్చినపుడు
సముద్రతీరమున వసించువారు,
”మనము నమ్మినవారికి
ఎి్టగతి ప్టినదో చూడుడు!
అస్సిరియారాజునకు భయపడి
మనము వారి మరుగుజొచ్చితిమి.
కాని ఇపుడు వారికి
ఎి్టదుర్గతి ప్టినదో చూడుడు.
ఇక మనమెట్లు తప్పించుకోగలము?” అని చెప్పుకొందురు.