రేకాబీయుల సదాదర్శము

35 1. యోషీయా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము పరిపాలనాకాలమున ప్రభువు నాకు తన వాక్కును వినిపించి, 2. ”నీవు రేకాబీయుల తెగవద్దకువెళ్ళి వారితో సంభాషింపుము. వారిని దేవాలయపు గదిలోనికి తీసికొనివచ్చి త్రాగు టకు ద్రాక్షారసమునిమ్ము” అని చెప్పెను.

3. నేను రేకాబీయుల తెగనంతిని అనగా హబజ్జిన్యా మనుమ డును యిర్మీయా కుమారుడునైన యజన్యాను, అతని కుమారులను, సోదరులను దేవాలయములోనికి తీసి కొనిపోయితిని.

4. ఇగ్డల్యా కుమారుడును ప్రవక్త యునగు హానాను శిష్యులు వసించుగదిలోనికి వారిని తోడ్కొనిపోతిని. ఈ గది ఇతర అధికారులు వసించు గదికి ప్రక్కనను, షల్లూము కుమారుడును ద్వార పాలకుడునైన మాసేయా వసించు గదిమీదనున్నది.

5. నేను ద్రాక్షారసపు కూజాలను, పాన పాత్రములను రేకాబీయుల ముందుప్టిె ‘కొంచెము పానీయము సేవింపుడు’ అంిని.

6. వారు ”అయ్యా! మేము ద్రాక్షరసము త్రాగము. మేముగాని, మా సంతతిగాని  దానినెప్పుడును ముట్టు కోరాదని రేకాబు కుమారుడును, మా పితరుడునైన యోనాదాబు ఆజ్ఞాపించెను.

7. ఇంకను అతడు మేము ఇండ్లు కట్టుకోరాదనియు, సేద్యము చేయరాదనియు, ద్రాక్షతోటలు పెంచరాదనియు, వానిని కొనరాదనియు శాసించెను. మేము సదా గుడారములలోనే వసింప వలెననియు, అటులయిన పరదేశులముగా బ్రతుకు నేలమీద మేము చిరకాలము మనుదుమనియు చెప్పెను.

8. మేము యోనాదాబు ఆజ్ఞలెల్ల పాించితిమి. మేము, మా భార్యలు, పుత్రీపుత్రులు ద్రాక్షారసము ముట్టుకోము. 9-10. మేము ఇండ్లు కట్టుకొనక గుడారములలోనే వసింతుము. మాకు ద్రాక్షతోటలు లేవు. పొలమున విత్తనములు చల్లము. మేము మా పితరుడైన యోనాదాబు ఆజ్ఞలెల్ల ఖండితముగా పాించితిమి.

11. కాని ఇపుడు బబులోనియా రాజైన నెబుకద్నెసరు దేశముమీదికి దాడిచేయగా బబులోనియా సిరియా సైన్యముల నుండి తప్పించుకొనుటకుగాను యెరూషలేమునకు రావలెనని నిశ్చయించుకొింమి.  కావుననే ఇపుడిచట వసించుచున్నాము” అని చెప్పిరి.

12. అప్పుడు ప్రభువు నాకు తన వాక్కునిట్లు విన్పించెను: 13. సైన్యములకు అధిపతియు, యిస్రాయేలు దేవుడునైన ప్రభువిట్లు నుడువుచున్నాడు: నీవు యూదా యెరూషలేము ప్రజలయొద్దకు వెళ్ళి వారితో ఇట్లు చెప్పుము. మీరు నా మాటనేల విన రైతిరి, నా ఉపదేశమునేల పాింపరైతిరని ప్రభుడనైన నేనడుగుచున్నాను.

14. యోనాదాబు తన కుమారు లకు ద్రాక్షారసమును ముట్టుకోగూడదనెడు ఆజ్ఞ నీయగా వారు పాించిరి. నేివరకును వారు ఆ పానీయమును త్రాగుటలేదు. కాని నేను నిరంతరము మీతో మాటలాడుచున్నను, మీరు నా ఆజ్ఞలను గైకొను టలేదు.

15. నేను సదా వేకువనే నా సేవకులైన ప్రవక్తలను మీ యొద్దకు పంపుచునేయుింని. వారు, దుష్కార్యములను విడనాడి ధర్మమును పాింప వలెనని మీకు బోధించిరి. పరదైవములను పూజింప రాదని మిమ్ము హెచ్చరించిరి. అట్లయిన నేను  మీకును, మీ పితరులకును ఇచ్చిన ఈ నేలమీద మీరు శాశ్వత ముగా మనుదురని చెప్పిరి. కాని మీరు నామాట వినరైతిరి.

16. యోనాదాబు అనుయాయులు తమ పితరునాజ్ఞలను పాించిరి.  కాని  మీరు నా మాట వినరైతిరి.

17. కనుక సైన్యములకు అధిపతియైన యిస్రాయేలు దేవుడనైన నా పలుకులివి. నేను పేర్కొనిన వినాశములన్నిని యూదా, యెరూషలేము ప్రజల మీదికి రప్పింతును. నేను మీతో మాటలాడి నపుడు మీరు వినలేదు. మిమ్ము పిలిచినపుడు మీరు పలుకలేదు.”

18. అంతట నేను రేకాబీయుల తెగకిట్లు చెప్పి తిని. ”సైన్యములకు అధిపతియును యిస్రాయేలు దేవుడునైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు. మీరు మీ పితరుడైన యోనాదాబు ఆజ్ఞలలు పాించితిరి. అతని ఉపదేశములను, శాసనములను అనుసరించితిరి.

19. కనుక యిస్రాయేలు దేవుడను, సైన్యములకు అధిపతియునైన నేను మీకు ఈ ప్రమాణము చేయు చున్నాను. రేకాబు కుమారుడైన యోనాదాబు వంశజు డొకడు సదా నన్ను సేవించుచుండును.”