నెహెమ్యా సాంఘిక సమస్యలను పరిష్కరించుట

5 1. యూదయా స్త్రీలు, పురుషులు కూడ వారి సోదరయూదులమీద అభియోగము తెచ్చిరి.

2. కొందరు ”మా బిడ్డలను మారకము వేసి, మేము ధాన్యము తెచ్చుకొని తిని బ్రతుకవలసి వచ్చినది” అనిరి.

3. మరికొందరు ”మేము ధాన్యము తెచ్చుకొనుటకు మా పొలములు, ద్రాక్షతోటలు ఇండ్లు తాకట్టు పెట్టవలసి వచ్చినది”అని పలికిరి.

4. ఇంకా కొందరు ”మా పొలములను, ద్రాక్షతోటలను కుదువబ్టెి డబ్బు అప్పు తీసికొని రాజుగారికి పన్ను కట్టవలసివచ్చినది.

5. మేము మా తోి యూదులవింవారము కామా? వారికి అవసరమైనవి మాకు మాత్రము అవసరము కాదా? మా పిల్లలు వారిపిల్లల వింవారు కారా? అయినను మా బిడ్డలు దాసత్వములో  ఉండిరి. మా ఆడుపిల్లలు కొందరిని ఇదివరకే దాసీలుగా అమ్మి వేసితిమి. మా పొలములు, ద్రాక్షతోటలనిదివరకే అన్యులదగ్గర కుదువబ్టెితిమి, గనుక దాసులుగా అమ్ముడుపోయిన పిల్లలను తిరిగి కొనితెచ్చుకోజాల కున్నాము” అని పలికిరి.

6. వారి మొర విని నేను మండిపడితిని.

7. ఆ సంగతి నాకు నేనే ఆలోచించి చూచుకొని ప్రజా నాయ కులను, అధిపతులను పిలిపించి చీవాట్లు ప్టిెతిని. ”మీరు మీ తోడి యూదులను పీడించి వడ్డి వసూలు చేయుచున్నారు” అని చెప్పితిని. అటు పిమ్మట ప్రజల నందరిని ప్రోగు చేయించితిని.

8. ”మేము అన్యజాతి ప్రజలకు దాసులుగా అమ్ముడు పోయిన మన తోడి యూదులను మా శక్తికొలది దాసత్వమునుండి విడి పించుచున్నాముగదా! ఇప్పుడు మీరు మీ సోదర ప్రజ లను తోడి యూదులకే దాసులుగా అమ్మివేయుచు న్నారు” అని మందలించితిని. ప్రజానాయకులు నా మాటలకు జవాబు చెప్పజాలక మౌనము వహించిరి.

9. నేను మరల ”మీరు చేయుపని మంచిదికాదు. మీరు దేవునికి భయపడి ఇి్ట దుష్కార్యములు చేయుట మానుకోవలెనుగదా! అప్పుడుగాని మన శత్రువులైన అన్యజాతిప్రజలు మనలను అవహేళన చేయకుండ ఉండరు.

10. మీవలె నేను కూడ ఈ ప్రజలకు డబ్బును, ధాన్యమును అరువిచ్చితిని. నా స్నేహితులు, నాతో పనిచేయువారును అటులనే చేసిరి. ఇప్పుడు మనమందరము ప్రజలు ఈ అప్పులు  తీర్చనక్కర లేదని నిర్ణయించుకొందము.

11. కనుక నేడే ఈ ప్రజల పొలములు, ద్రాక్షతోటలు, ఓలీవుతోటలు, ఇండ్లు ఎవరివి వారికి వదిలివేయుడు. డబ్బు, ధాన్యము, ద్రాక్షసారాయము, ఓలీవునూనె మొదలైన అప్పుల న్నిని మన్నించి వదలివేయుడు” అని పలికితిని.

12. ప్రజా నాయకులు ”మేము నీవు చెప్పినట్లే చేయు దుము. వారి పొలములు వారికి ఇచ్చివేయుదుము. మేమిచ్చిన అప్పులు తిరిగి వసూలు చేయము” అని పలికిరి. వెంటనే యాజకులను పిలిపించి నాయకుల చేత వారెదుటనే ప్రమాణము చేయించితిని.

13. నేను నడికట్టుగా కట్టుకొన్న బట్టను విప్పి వారి యెదుటనే దులిపితిని. ”ఇప్పుడు మీరు చేసిన ప్రమాణములను నిలబెట్టుకొననిచో ప్రభువు కూడ మీ యిండ్లనుండి, మీ జీవనోపాధికి మీరు చేయు పనినుండి ఇట్లే దులిపి వేయును”అని నుడివితిని. అక్కడ గుమిగూడిన వారందరు ”ఇట్లే జరుగునుగాక!” అని బదులు పలికి ప్రభువునుసన్నుతించిరి. తరువాత వారందరు తమ మాట నిలబెట్టుకొనిరి.

నెహెమ్యా చిత్తశుద్ధి

14. ఇంకను రాజు నన్ను యూదా రాజ్యమునకు అధికారిగా నియమించిన పండ్రెండేండ్లు, అనగా అర్తహషస్తరాజైన యిరువదియవయేినుండి ముప్పది రెండవ యేివరకు, నేనును, నా బంధువులును ప్రజలనుండి అధికారికి లభింపవలసిన భోజనవేతన ములను ముట్టుకొనియెరుగము.

15. నాకు ముందు అధికారులుగా పనిచేసినవారు వారి అన్నపానీయ ములకు ప్రజలనుండి రోజుకు నలుబది వెండి నాణెములు వసూలుచేసి వారిని వేధించెడివారు. వారి సేవకులు కూడ ప్రజలను పీడించెడివారు. కాని నేను దేవునికి భయపడి అి్ట దుష్కార్యములు చేయనైతిని.

16. నా శక్తినంతిని ప్రాకారము కట్టుటకు ధార పోసితిని. నేను పొలముపుట్ర సంపాదించుకోలేదు. నా తోిపనివారందరు గోడ కట్టుటలో నిమగ్నులైరి.

17. దినదినము నూట యేబదిమంది యూద నాయకులు, అధిపతులు నా ఇంట భోజనము చేసెడి వారు. ఇంకను ఇరుగుపొరుగు జాతులప్రజలు కూడ నా యిిింకొచ్చి అన్నము తినిపోయెడివారు.

18. ప్రతిదినము ఒక కోడెను, ఆరు మంచి పొట్టేళ్ళను, చాల కోళ్ళను కోయించెడివాడను. పదిరోజులకు ఒక సారి ద్రాక్షసారాయము తెప్పించి నిల్వచేసెడివాడను. ఇంత వ్యయమైనప్పికీ అధికారి పోషణకు లభింప వలసిన పన్నును వసూలు చేయింపలేదు. ప్రజల ప్పికే దారిద్య్రభారము వలన నలిగిపోవుచుండిరి.

19. ‘ప్రభూ! నీవు మాత్రము నేనీ ప్రజలకు చేసిన ఉపకారమును జ్ఞప్తియందుంచుకొనుము’.

Previous                                                                                                                                                                                                     Next