నీనెవె మీదికి దాడి

2 1. నీనెవే!

               నిన్ను నాశము చేయువాడు

               నీ మీదికి ఎత్తివచ్చుచున్నాడు.

               నీ బురుజులను సంరక్షించుకొనుము.

               నీ త్రోవకు కావలివారిని కాపుపెట్టుము.

               నీ సైన్యమును ప్రోగుజేసికొని పోరునకు

               సిద్ధము కమ్ము.

2.           ప్రభువు యిస్రాయేలీయుల

               ఐశ్వర్యమును పునరుద్ధరించును.

               శత్రువులు నాశనము చేయక

               మునుపు ఉన్న వైభవమును తిరిగి నెలకొల్పును.

3.           నీ విరోధులు ఎఱ్ఱని డాళ్ళను చేబూనియున్నారు.

               ఎఱ్ఱని దుస్తులు ధరించియున్నారు.

               వారు నీ మీద పడుటకు తయారుగాఉన్నారు.

               వారి రథములు నిప్పువలె మెరయుచున్నవి.

               వారి అశ్వములు పోరునకు ఉత్సాహించుచున్నవి.

4. రథములు పురవీథులలో పరుగెత్తుచున్నవి.

               రాజమార్గమున ఇటునటు ఉరుకుచున్నవి.

               అవి దివిీలవలె మెరయుచున్నవి.

               మెరుపులవలె ఇటునటు దుముకుచున్నవి.

5. సైనిక నాయకులను పిలుచుచున్నారు.

               వారు తడబడుచు వచ్చుచున్నారు.

               శత్రుసైనికులు ప్రాకారముచెంతకు

               పరుగెత్తుచున్నారు.

               గోడలనుకూల్చు యంత్రమును అమర్చి

               దానికి కప్పువేయుచున్నారు.

6.           నదికెదురుగానున్న ద్వారములు తెరచుకొనినవి.

               రాజప్రాసాదము భయముతో నిండిపోయినది.

7.            ఇది నిశ్చయము!

               రాణి దిగంబరియై కొనిపోబడుచున్నది

               ఆమె దాసీలు గువ్వలవలె ఆర్తనాదముచేయుచు, సంతాపముతో రొమ్ముబాదుకొనుచు

               మూలుగుచున్నారు.

8. పూర్వమునుండి నీనెవె నీికొలనువింది

               అయినను, ప్రజలు నీనెవె నుండి

               పరుగెత్తుచున్నారు.

               ఆగుడు! ఆగుడు! అను కేకలు వినిపించుచున్నవి.

               కాని ఎవరును వెనుకకు తిరిగి చూచుటలేదు.

9.           వెండిని దోచుకొనుడు,

               బంగారమును కొల్లగొట్టుడు.

               నగరమున సంపదలు అనంతముగాఉన్నవి.

               ప్రశస్తవస్తువులు  అనేకములున్నవి.

10. నీనెవెను నాశనముచేసి కొల్లగ్టొిరి,

               అది పాడువడెను.

               ప్రజలగుండెలు భీతితో కంపించుచున్నవి.

               మోకాళ్ళు వణకుచున్నవి, సత్తువ నశించినది.

               మొగములు తెల్లబోయినవి.

11.సింహముల గుహవలె

               అలరారిన నగరము ఇపుడేది?

               సింగపు కొదమల మేతస్థలమేమాయెను?

               అచట పోతుసింగము, పిెంసింగము

               వేటకు వెళ్ళగా వాని పిల్లలు

               నిర్భయముగా మనుస్థలము ఏమాయెను?

12.ఎరను చంపి ముక్కలుముక్కలుగా చీల్చి

               పిెంసింగమునకు, పిల్లలకు నిచ్చుచూ

               తన గుహను చీల్చిన మాంసముతో             

               వేాడిప్టిన ఎరతోను నింపిన

               పోతుసింహమేమాయెను?

13. సైన్యములకధిపతియైన ప్రభువిట్లనుచున్నాడు:

               నేను నీకు శత్రువునగుదును.

               నీ రథములను కాల్చివేయుదును.

               నీ సైనికులు పోరున చత్తురు.

               నీవు కొల్లగ్టొి తెచ్చిన సొత్తును

               నేను కొల్లగొట్టుదును.నీ దూతల బెదరింపులను

ఇక ఎవరును లెక్కచేయరు.

Previous                                                                                                                                                                                                  Next