యిత్రో మోషేను కలిసికొనుట

1. దేవుడు మోషేకును, యిస్రాయేలీయుల కును మేలు చేసెననియు, వారిని ఐగుప్తుదేశమునుండి కొనివచ్చెననియు మిద్యాను యాజకుడును మోషే మామయునగు యిత్రోకు తెలిసెను.

2. కనుక అతడు మోషే భార్య సిప్పోరాను ఆమె కుమారులిద్దరిని అతని కడకు తోడ్కొని వచ్చెను. అంతకు ముందు మోషే సిప్పోరాను పంపివేసియుండెను.

3. మోషే ఆ కుమా రులలో ఒకనికి ”నేను పరదేశములో అపరిచితునివలె యుింని” అనుకొని గెర్షోము3 అను పేరు పెట్టెను.

4. రెండవ వానికి ”నా తండ్రి దేవుడే నాకు ఆదరువు. ఆయనయే ఫరోరాజు కత్తికి ఎరకాకుండ నన్ను కాపాడెను” అనుకొని ఎలియెజెరు4 అని పేరుపెట్టెను.

5. మోషే మామ యిత్రో అతని భార్యను బిడ్డలను వెంటబెట్టుకొని ఎడారిలో దేవునికొండ దగ్గర దిగిన మోషేకడకు వచ్చెను.

6. ”నీ భార్యతో ఇద్దరు బిడ్డలతో మీ మామ యిత్రో నిన్ను చూడవచ్చెను” అన్నమాట మోషే చెవిని పడెను.

7. మోషే తన మామను కలిసికొనుటకు ఎదురువెళ్ళెను. మామ ఎదుట వంగి దండముప్టిె అతనిని ముద్దాడెను. ఒకరి యోగక్షేమ మును ఒకరు తెలిసికొనిన తరువాత వారు గుడారము నకు వచ్చిరి.

8. అప్పుడు మోషే తన మామతో యిస్రా యేలీయులను రక్షించుటకై యావే ఫరోను ఐగుప్తు దేశీయులను ఎట్లు కష్టములపాలు చేసెనో, త్రోవలో వారెట్లు కడగండ్లుపడిరో, యావే వారినెట్లు రక్షించెనో పూస గ్రుచ్చినట్లు చెప్పెను.

9. యిస్రాయేలీయులను ఐగుప్తీయులనుండి విడిపించి, వారికి యావే చేసిన మేలంతయు విని యిత్రో హర్షించెను.

10. ”ఐగుప్తు దేశీయులనుండి ఫరోరాజు నుండి నిన్ను రక్షించిన దేవుడు, ఐగుప్తు దేశీయులనుండి యిస్రాయేలీయులను రక్షించిన దేవుడు స్తుతింపబడునుగాక!

11. యిస్రాయేలీయులను అహంకారముతో హింసించియున్న ఐగుప్తుదేశీయు లను అణచివేసిన యావే దేవాదిదేవుడని నేడు తెలిసి కొింని” అని అతడనెను.

12. మోషే మామ యిత్రో దేవునికి దహనబలిని, బలులను సమర్పించెను. దేవుని సమ్ముఖమున మోషే మామతోపాటు విందులో పాల్గొనుటకై అహరోను యిస్రాయేలు పెద్దలందరితో వచ్చెను.

న్యాయమూర్తుల నియామకము

13. మరునాడు మోషే యిస్రాయేలీయులకు తీర్పులు తీర్చుటకు కొలువుతీరెను. ఉదయమునుండి సాయంకాలమువరకు వారు అతని చుట్టు నిలబడిరి.

14. మోషే యిస్రాయేలీయులకొరకు పడిన పాటు లెల్ల చూచి అతని మామ యిత్రో ”ఈ ప్రజల కొరకు నీవు ఈ బరువెల్ల నెత్తికెత్తుకొననేల? ఉదయమునుండి సాయంకాలమువరకు వీరందరు చుట్టు నిలిచియుండ నీవొక్కడవే ఇక్కడ కూర్చుండనేల?” అనెను.

15. దానికి మోషే మామతో ”ఏల అందువా? దేవునిచిత్తము తెలిసికొనుటకై ఈ జనులు నా వద్దకు వత్తురు. 16. వారి నడుమ తగవులు వచ్చినపుడు వారు నా కడకు వత్తురు. నేనేమో ఇద్దరినడుమ ప్టుిన తగవులు తీర్తును. దేవుడు నిర్ణయించిన విధులను ఆజ్ఞలను వారికి తెలియజేయుదును” అని చెప్పెను.

17. మోషే మామ అతనితో ”నాయనా! ఈ పని అంతయు నీమీద వేసికొనుట మంచిదికాదు.

18. ఇట్లయినచో నీవు తట్టుకొనలేక నలిగిపోదువు. నీతోపాటు ఈ ప్రజలును నలిగిపోదురు. ఈ పని నీ తలకు మించిన్టిది. దీనిని నీవొక్కడవే చేయజాలవు.

19. నా ఉపదేశమును పాింపుము. దేవుడు నీకు తోడుగా ఉండును. నీవు దేవునియెదుట ఈ ప్రజలకు ప్రతినిధిగా ఉండుము. వారి తగవులను గూర్చి ఆయనతో చెప్పుము.

20. దేవుడు నిర్ణయించిన విధులను, ఆజ్ఞలను వారికి బోధింపుము. వారు నడువదగిన త్రోవను వారికి చూపుము. చేయదగిన పనులను  వారికి  తెలుపుము.

21. ఈ ప్రజలందరలో సమర్థులను, దైవభీతిగల వారిని, విశ్వాసపాత్రులను, లంచగొండులు కానివారిని ఏరి వారికి నాయకులనుగా చేయుము. వేయిమందికి, వందమందికి, ఏబదిమందికి, పదిమందికి ఒక్కొక్కని చొప్పున నాయకులను నిర్ణయింపుము.

22. ఎల్లవేళల ఆ నాయకులే తీర్పులుచేయుచు ఈ ప్రజలకు తోడ్పడు దురు. వారు పెద్ద పెద్ద తగవులను నీకడకు కొనివత్తురు. చిన్నచిన్నతగవులకు వారియంతటవారే తీర్పులు చెప్పుదురు. దీనివలన నీ పని తేలిక అగును. నీ బరువును వారుకూడ మోసినవారగుదురు.

23. ఇట్లు చేసిన నీవును శ్రమకు తట్టుకొందువు. ప్రజలును తృప్తిపడుచు ఇండ్లకు వెళ్ళుదురు. దేవుడును ఈ పద్ధతినే నిర్ణయించునుగాక!” అనెను.

24. మోషే మామ మాటలువిని అతడు చెప్పినట్లే చేసెను.

25. యిస్రాయేలీయులనుండి సమర్థులను ఏరి వారికి నాయకులునుగా చేసెను. వేయిమందికి, వందమందికి, ఏబదిమందికి, పదిమందికి ఒక్కొక్కని చొప్పున న్యాయాధిపతులను ఏర్పరచి వారిని ప్రజల మీద ప్రధానులనుగా నిర్ణయించెను.

26. ఎల్లవేళల ఆ నాయకులు తీర్పులుచెప్పుచు ప్రజలకు సాయపడు చుండిరి. వారు పెద్దపెద్ద తగవులను మోషేకడకు కొనితెచ్చుచుండిరి. చిన్నచిన్నతగవులను వారియంతట వారే తీర్చుచుండిరి.

27. అప్పుడు మోషే తన మామ వెళ్ళిపోవుటకు ఒప్పుకొనెను. అతడు తిరిగి స్వదేశము నకు వెళ్ళిపోయెను.

Previous                                                                                                                                                                                               Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము