భూలోక న్యాయాధిపతులకు న్యాయాధిపతి

ప్రధానగాయకునికి అల్‌తష్‌హెత్‌ అను రాగముమీద పాడదగిన, దావీదు రచించిన అనుపదగీతము

58 1. న్యాయాధిపతులారా!

               మీరు న్యాయయుక్తముగా తీర్పుతీర్చుచున్నారా?

               నరులందరికి నిష్పక్షపాతముగా

               తీర్పు చెప్పుచున్నారా?

2.           లేదే, మీ యెదలో పరపీడనము

               గూర్చియే తలపోయుచున్నారు.

               మీరు భూమిమీద దౌర్జన్యములు జరుపుచున్నారు.

3.           ఈ దుర్మార్గులు ప్టుినప్పినుండియు

               పెడత్రోవనే ప్టిరి.

               తాము జన్మించినప్పినుండియు

               అబద్ధములే చెప్పిరి.

4-5. వారికి పామునకువలె విషముండును.

               పాములు పట్టువాని స్వరమును వినక,

               నేర్పరియైన మాంత్రికుని మంత్రములకు లొంగక,

               మొండిదైయుండు నాగుబామువలె

               వారును చెవులు మూసికొనిరి.

6.           దేవా! నీవు వారి మూతిపండ్లు రాలగొట్టుము.

               ఆ సింగముల కోరలు ఊడబెరుకుము.

7.            వారు కారిపోయెడి నీరువలె ఇంకిపోవుదురుగాక!

               కాలి క్రిందపడి నలిగిపోయెడు

               గడ్డివలె ఎండిపోవుదురుగాక!

8.           తాను స్రవించిన జిగటద్రవంలో

               తానే కరిగిపోవు నత్తవలెను,

               గర్భస్రావము కాగా వెలుగునుగాంచజాలని

               పిండమువలెను నాశనమగుదురుగాక! 

9.           మీ కుండలు పచ్చివైనను, ఎండినవైనను,

               వాికి ముండ్లకంపసెగ తగలకమునుపె,

               ప్రభువు వారిని పొట్టునువలె ఎగురగొట్టునుగాక!

10.         దుర్మార్గులకు పడు శిక్షను జూచి

               సజ్జనులు సంతసింతురు.

               ఆ దుష్టుల నెత్తుిలో తాము

               కాళ్ళు కడుగుకొందురు.

11.           ”పుణ్యపురుషులకు బహుమతి లభించుననియు,

               లోకములో న్యాయముచేయు దేవుడొకడున్నాడు”

               అనియు జనులు చెప్పుదురు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము