రాజు యెషయాను సంప్రతించుట

37 1. వారిమాటలు విని హిజ్కియా విచారముతో వస్త్రములు చించుకొని గోనెపట్ట తాల్చి ప్రభు మందిర మునకు వెళ్ళెను.

2. అతడు ప్రాసాద రక్షకుడగు ఎల్యాకీమును, రాజలేఖకుడగు షెబ్నాను, వృద్ధులైన యాజకులును ఆమోసు కుమారుడును, ప్రవక్తయైన యెషయా వద్దకు పంపెను. వారందరు గోనెలు తాల్చియే వెళ్ళిరి.

3. వారు యెషయా ప్రవక్త వద్దకు వచ్చి, అతనితో ఇట్లనెను:

               ”హిజ్కియా సెలవిచ్చునదేమన,

               ‘నేడు మనకు ఇక్కట్టులు వచ్చినవి.

               శత్రువులు మనలను శిక్షించి,

               అవమానముపాలు చేయుచున్నారు.

               మనము ప్రసవకాలము వచ్చినను

               బలము చాలనందున

               బిడ్డలనుకనలేని గర్భిణులవలె ఉన్నాము. 

4.           అస్సిరియా రాజు పంపిన రబ్షాకె

               సజీవుడైన ప్రభువును తూలనాడెను.

               నీవు కొలుచు ప్రభువు

               ఈ నిందావాక్యములను ఆలించుగాక!

               వానిని పలికినవారిని శిక్షించునుగాక!

               నీవు మాత్రము మన జనమున

               శేషముగాయున్నవారిని కరుణింపుమని

               ప్రభువునకు మనవిచేయుము.’ ”

5. హిజ్కియా దూతలు తన చెంతకురాగా యెషయా రాజునకు ఈ ప్రతిసందేశము పంపెను.

6. ”ప్రభువు సందేశమిది: అస్సిరియారాజు అధికారులు పలికిన వాక్యములను దేవదూషణములను విని నీవు భయపడవలదు.

7. నేను ఆ రాజునకు దుష్టప్రేరణ కలిగింతును. అతడొకవదంతిని విని తనదేశమునకు మరలిపోవును. తన దేశముననే  కత్తివాతపడును. ఇదంతయు నేను చేయుపని.”

సైన్యాధిపతి తిరిగిపోవుట

8. అస్సిరియా సైన్యాధిపతి రబ్షాకె తన రాజు లాకీషు నుండి వెడలిపోయి లిబ్నా నగరమును ముట్ట డించుచున్నాడని వినెను. కనుక అతడు రాజును కలిసికొనుటకై అచికి వెళ్ళెను.

9. అంతలో కూషు రాజగు తిర్హాకా ఐగుప్తు సైన్యముతో అస్సిరియామీదికి దండెత్తి వచ్చుచున్నాడని వార్తవచ్చెను.

సన్హెరీబు బెదరింపుల గూర్చి మరియొక రచన

ఆ వార్త అందినపిదప అస్సిరియా రాజు యూదా రాజు హిజ్కియాకు తన దూతలద్వారా లేఖ పంపెను.

10.         ”యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి, నీవు నమ్ముకొనియున్న నీ దేవునిచేత మోసపోకుము.

11. ఇంతవరకు అస్సిరియా రాజులు నానా రాజ్యములనెట్లు నాశనముచేసిరో నీవు వినియేయుందువు. నా దాడినుండి నీవుమాత్రము తప్పించుకోగలవా?

12. మా పూర్వులు గోషాను, హారాను, రెసపు పట్టణములను నాశనము చేసిరి. తెలస్సారు మండలమున వసించుచున్న బేతేదేను ప్రజలను సంహరించిరి. వారిదైవములు వారిని రక్షింప గలిగిరా?

13. హామాతు, అర్పాదు, సెఫర్వాయీము, హినా, ఇవ్వా రాజులిప్పుడేరీ?”

14-15. హిజ్కియారాజు దూతలనుండి ఆ లేఖను అందుకొని చదివెను. అంతట అతడు దేవాలయమున ప్రవేశించి, లేఖను ప్రభు సమక్షమునప్టిె ఇట్లు ప్రార్థించెను.

16.          ”కెరూబీముదూతలనడుమ

               ఆసీనుడవైయున్న దేవా! 

               భూమ్యాకాశములను సృజించినవాడవు నీవే.

               ఈ లోకమందున్న సకలరాజ్యములకు

               దేవుడవైయున్నావు.

17.          సైన్యములకధిపతియైన ప్రభూ!

               వీనులొగ్గివినుము. కన్నులు విప్పిచూడుము.

               సజీవుడవైన దేవుడవగు నిన్ను కించపరచుటకుగాను

               సన్హెరీబు పలికిన పలుకులు ఆలింపుము.

18. అస్సిరియా రాజులు నానాజాతులను జయించి

               వారి దేశములను నాశనము చేసిరి.

19.          ఆ జాతుల దైవములను కాల్చివేసినది నిజమే!

               కాని వారు నిజముగా దైవములుకారు.

               నరులుమలచిన రాతిబొమ్మలు, కొయ్యబొమ్మలు.

               కనుకనే వారు వానిని నాశనము చేయగలిగిరి.

20. కావున ప్రభూ! ఇప్పుడు నీవు మమ్ము

               అస్సిరియా రాజు దాడినుండి కాపాడుము.

               అప్పుడు సకల రాజ్యములును

               నీవు ఒక్కడవే నిక్కముగా దేవుడవని గుర్తించును.”

యెషయా రాజునకు సందేశము పంపుట

21. అంతట యెషయా హిజ్కియా వద్దకు సేవకు లను పంపి ఇట్లు చెప్పించెను: ”అస్సిరియా రాజునుండి కాపాడుమని నీవుప్టిెన మొరకు ప్రభువు ఇచ్చిన సమాధానమిది. 22. ఆ రాజును గూర్చిన దైవవాక్కిది.

               ‘ఓయి!

               యెరూషలేము కన్య నిన్నుచూచి నవ్వుచున్నది.

               నిన్ను  చిన్నచూపు చూచుచున్నది.

               యెరూషలేము కన్య నీవు వెనుదిరిగి పోవుటను

               చూచి తలఊపుచున్నది.

23.        నీవెవరిని అవమానించి

               దూషించితివో గుర్తించితివా?

               కన్నుమిన్నుగానక ఎవరిని నిందించితివో

               తెలిసికొింవా?

               నీవు యిస్రాయేలు పరిశుద్ధ దేవుడనైన

               నన్నే తృణీకరించితివి.

24-25. నా రథసమూహముతో

               నేను ఎత్తయిన లెబానోను కొండలను గెల్చితిని.

               అచట ఉన్నతములైన దేవదారులను,

               శ్రేష్ఠములైన తమాలములను నరికించితిని.

               అడవుల అంతర్భాగము వరకును వెళ్ళితిని.

               అన్యదేశములలో బావులుత్రవ్వించి నీళ్ళుత్రాగితిని.

               నా సైన్యముల పాదతాడనమువలన

               నైలునది ఎండిపోయినదని నీవు నీ సేవకుల

               ముఖమున నా ఎదుట ప్రగల్భములాడితివి.

26. కాని ఈ విజయములు అన్నిని

               నేను పూర్వమే నిర్ణయించితినని నీవువినలేదా?

               ఇప్పుడు నేను వానిని

               క్రియాపూర్వకముగా జరిగించితిని.

               నీవునాకు సాధనమాత్రుడవై

               సురక్షితపట్టణములను నేలమట్టముచేసితివి.

27.         ఆ పట్టణములందలి ప్రజలు దుర్బలులైరి,

               భయపడి నిశ్చేష్టులైరి.

               వారు తూర్పుగాలికి సోలిపోవు

               పొలములోని పైరువలెను,

               బీళ్ళలోను మిద్దెలమీదను

               ఎదుగు గడ్డివలెను నలిగిపోయిరి.

28.        నీ సంగతులెల్ల నాకు బాగుగా తెలియును.

               నీ రాకపోకలు, నీ చెయిదములు

               నేను ఎరుగుదును.

               నీవు నామీద మండిపడుటను నేను గుర్తించితిని.

29.        నేను నీ పొగరును గూర్చి వింని.

               నా గాలము నీ ముక్కుకు తగిలింతును.

               నీ నోికి కళ్ళెముప్టిెంతును.

               నీవు వచ్చిన త్రోవవెంటనే

               నిన్ను వెనుకకు పంపింతును.’

హిజ్కియాకు గుర్తు

30. హిజ్కియా, నీవు ఈ గుర్తును గమనింపుము.

               ఈ సంవత్సరము, వచ్చు సంవత్సరముకూడ

               మీకు పడిమొలిచిన ధాన్యమే లభించును.

               కాని మూడవ సంవత్సరము

               మీరు పైరువేసి, కోతకోసుకొందురు.

               ద్రాక్షలుపెంచి వానిపండ్లు కోసికొందురు.

31.          యూదామండలమున

               తప్పించుకొని శేషముగా ఉన్నవారు

               యెరూషలేమునుండి బయలుదేరుదురు.

               వారు నేలలోనికి వేళ్ళుతన్ని,

               పండ్లు కాయు వృక్షములవలె వృద్ధి చెందుదురు.

32.        యెరూషలేమున, సియోను కొండమీద

               ప్రజలు మిగిలియుందురు.

               తన ప్రజలపట్ల ప్రేమగల

               సైన్యములకధిపతియైన ప్రభువు

               ఈ కార్యమును సాధింపసమకట్టెను.”

అస్సిరియా రాజును గూర్చి దైవోక్తి

33.        అస్సిరియా రాజును గూర్చి ప్రభువు వాక్కిది:

               ”అతడు ఈ పట్టణమున ప్రవేశింపజాలడు.

               దీనిమీద ఒక్క బాణమును కూడ రువ్వజాలడు.

               డాలుతో దీనిచెంతకు రాజాలడు.

               దీనిచుట్టు ముట్టడికిగాను

               మ్టిదిబ్బలు పోయజాలడు.

34.         ఇతడు తానువచ్చిన త్రోవప్టి వెడలిపోవును.

               ఈ నగరమున ఎంతమాత్రము ప్రవేశింపజాలడు.

35.        నా గౌరవార్థము,

               నా సేవకుడగు దావీదు నిమిత్తము,

               నేను ఈ నగరమును రక్షింతును.”

సన్హెరీబునకు శిక్ష

36. ఆ రాత్రి ప్రభువుదూత అస్సిరియా శిబిరము నకు పోయి అచట లక్షయెనుబది ఐదువేల మంది సైనికులను సంహరించెను. వేకువనే లేచిచూడగా వారందరు చచ్చిపడియుండిరి.

37. అంతట అస్సిరియా రాజు సైన్యమును తరలించుకొని నీనెవెకు వెడలి పోయెను.

38. అచట ఒకనాడు సన్హెరీబు దేవళమున తన దేవత నిస్రోకును ఆరాధించుచుండగా అద్రమ్మలేకు, షరెసేరు అను అతని కుమారులిద్దరు అతనిని కత్తితో వధించి ఆరారాతునకు పారిపోయిరి. అటుపిమ్మట ఏసర్హద్దోను అను అతని మరియొక పుత్రుడు తండ్రికి బదులుగా రాజయ్యెను.