యోనాతాను ఫిలిస్తీయుల కావలి దండును కొట్టుట

14 1. ఒకనాడు సౌలు కుమారుడు యోనాతాను తన అంగరక్షకునితో, ఆవలనున్న ఫిలిస్తీయుల కావలి దండుమీదకు పోవుదము రమ్మనెను. కాని అతడు తండ్రికి ఈ విషయము తెలుపలేదు.

2. అప్పుడు సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మచెట్టు క్రింద విడిది చేయుచుండెను. అతనితోనున్న యోధులు సుమారు ఆరువందలమంది.

3. షిలో యాజకుడగు ఏలీ కుమారుడైన ఫీనెహాసుపుత్రుడు ఈకాబోదు అన్న యైన అహిటూబు కుమారుడైన అహీయా ప్రభుచిత్తము తెలియజేయు ఏఫోదు ధరించుకొని యుండెను. యెెూనాతాను వెళ్ళిన సంగతెవ్వరికిని తెలియదు.

4. అతడు ఫిలిస్తీయుల పాలము చేరుటకు ఒక లోయ దాటవలెను. ఈ లోయలో ఇరువైపుల రెండు కొండకొమ్ములు కలవు. మొదిదాని పేరు బోసేసు. రెండవదాని పేరు సేనే.

5. మొదిది మిక్మాషునకు ఎదురుగా ఉత్తరదిక్కున గలదు. రెండవది గిబియాకెదురుగా దక్షిణదిక్కున గలదు.

6. యోనాతాను అంగరక్షకునితో ”సున్నతి సంస్కారము లేని ఈ ఫిలిస్తీయుల దండుకాపరుల మీద పడుదము రమ్ము. ప్రభువు మనకు మేలుచేయవచ్చును. కొలది మందివలనైనను లేక అనేకులవలనైనను మనలను రక్షింప యావేకు అడ్డుకాజాలదు గదా!” అనెను.

7. అంగరక్షకుడు ”నీ ఇష్టప్రకారము కానిమ్ము. నీవు ముందు నడువుము. నేను నిన్ను అనుసరించి వచ్చెదను” అని పలికెను.

8. యోనాతాను అంగ రక్షకునితో ”మనము ఫిలిస్తీయుల సమీపమునకు పోయి వారి కంటపడుదము.

9. సైనికులు మనలను జూచి ‘నిలువుడు, మేము మీ చెంతకు వచ్చెదము’ అందురేని, వారి దగ్గరకు వెళ్ళక ఇక్కడనే ఆగిపోవు దము.

10. కాని వారు ‘మా చెంతకురండు’ అందు రేని వారియొద్దకు వెళ్ళుదము. యావే ఫిలిస్తీయులను మన వశముచేసెననుటకు అదియే గురుతు” అని చెప్పెను.

11. ఫిలిస్తీయులు యోనాతానును చూడగనే ”అరుగో! హెబ్రీయులు దాగియున్న గోతులనుండి వెలువడుచున్నారు” అని పలికిరి.

12. అంతట వారు యోనాతానును అతని అనుచరుని పిలిచి ”మా యొద్దకురండు, మీకొకమాట చెప్పవలయును” అనిరి. యోనాతాను అంగరక్షకునితో ”యావే వీరిని యిస్రా యేలీయుల వశముకావించెను. నీవు నా వెంటరమ్ము” అనెను.

13. యోనాతాను లోయనుండి చేతులతో, కాళ్ళతో కొండకొమ్ము పైకెగబ్రాకెను. ఆ రీతినే అంగరక్షకుడును అతని వెంట ప్రాకిపోయెను. ఫిలిస్తీ యులు యోనాతాను చేతబడి మడిసిరి. అంగరక్షకుడు కూడ అతని వెనువెంటనే వచ్చి అక్కడక్కడ మిగిలిన వారిని మట్టుపెట్టెను.

14. యోనాతాను మరియు అతని అనుచరుడును క్టొిన మొది దెబ్బకే సుమారు ఇరువదిమంది కూలిరి. పొలములో ఒక జతఎడ్లు ఒక దినమున దున్ను అరెకరము నేల విస్తీర్ణములో అది జరిగెను.9

యుద్ధము

15. యోనాతాను కావలిదండును కొట్టగనే ఫిలిస్తీయుల శిబిరమునందును, దాని చుట్టుపట్టు లందును భయము అలముకొనెను. వారి కావలి దండును, దోపిడిదండును భీతిచే కంపించెను. నేల అదరెను. అది యావే ప్టుించిన వణుకు.

16. సౌలు కావలి బంటులు బెన్యామీనీయులగిబియా నుండి చూడగా ఫిలిస్తీయుల శిబిరము చెల్లాచెదరగుచుండెను.

17. సౌలు తన అనుచరులతో, మన జనులను లెక్కించి ఎవరు వెళ్ళిపోయిరో తెలిసికొనుడని చెప్పెను. వారు జనులపేర్లు పిలువగా యోనాతాను, అతని అంగరక్ష కుడు కనిపింపరైరి.

18. సౌలు అహీయాను పిలిచి యావే మందసము తీసుకొనిరమ్ము అనెను. ఆ దినమున మందసము యిస్రాయేలీయుల మధ్యనుండెను.

19. కాని సౌలు యాజకునితో మ్లాడుచుండగనే ఫిలిస్తీయుల శిబిర మున కల్లోలము అంతకంతకు హెచ్చయ్యెను. కావున అతడు యాజకునితో అది అక్కరలేదు పొమ్మనెను.

20. అంతట సౌలు అతని అనుచరులు బారులుతీరి యుద్ధరంగమునకువచ్చిరి. అచ్చట శత్రువులు మిక్కిలి కలవరపాటుపడి ఒకరినొకరు గుర్తింపజాలక వారిలో వారే పోరాడుకొనుచుండిరి.

21. అంతవరకు ఫిలిస్తీయులకు దాసులైయుండి వారితోపాటు శిబిరము నకు వచ్చిన హెబ్రీయులు సౌలు, యోనాతానుల ననుసరించి వచ్చిన యిస్రాయేలీయులతో చేరిపోయిరి.

22. ఎఫ్రాయీము కొండలలో దాగుకొనియున్న యిస్రాయేలీయులు కూడ ఫిలిస్తీయులు పారిపోవు చున్నారని విని శత్రువులను వెన్నాడిరి.

23. ఆ రోజు యావే యిస్రాయేలీయులను ఈ విధముగా రక్షించెను. బేతావెను ఆవలివైపు వరకు యుద్ధము వ్యాపించెను.

యోనాతాను సౌలు ఆజ్ఞను ధిక్కరించుట

24. ఆ దినము యిస్రాయేలీయులు చాల అలసి పోయిరి. సౌలు ”నేను నా శత్రువులపై పగతీర్చు కొనువరకు, అనగా సాయంకాలమగు వరకును ఎవ్వడైనను భోజనము ముట్టుకొన్నచో శాపము పాలగును” అని ఒట్టుపెట్టెను. కనుక ఎవ్వరును ఆహారము ముట్టుకొనలేదు.

25-26. యిస్రాయేలీయులకు పొలమున ఒక తేనెపట్టు కనిపించెను. దానినుండి తేనె చిప్పిలు చుండెను. కాని ఒట్టు తప్పినట్లగునను భయమువలన తేనెపట్టుపై ఎవ్వడు చేయివేయలేదు.

27. అయినను సౌలు ఒట్టుప్టిెనమాట యోనాతానునకు తెలియదు. అతడు చేతనున్న కఱ్ఱకొనతో పట్టునుపొడిచి కొంచెము తేనెను గైకొని ఆరగించెను. దానితో అతనికి సత్తువ కలిగెను.

28. అప్పుడు భటుడొకడు యోనాతానుతో ”ఈ దినము భోజనము గైకొనినవాడు శాపమునకు గురియగునని నీ తండ్రి ఒట్టుపెట్టెను. కనుకనే గదా మన జనులు ఇంతగా బడలియున్నారు” అనెను.

29. యోనాతాను ”నా తండ్రి ప్రజలకు కష్టము కలిగించెను. నేను కొంచెము తేనెను పుచ్చుకొనగనే ఏపాి సత్తువ కలిగినదో చూడుము.

30. ఈ రీతినే మన జనులు కూడ నేడు శత్రువుల నుండి దోచుకొనివచ్చిన పశువు లను చంపి భుజించియున్నచో ఎంత మేలయ్యెడిది! ఆ బలముతో మనవారు ఫిలిస్తీయులను ఊచముట్టుగ తునుమాడి యుందురుగదా!” అనెను.

ప్రజల తప్పిదము

31. ఆ రోజు యిస్రాయేలీయులు మిక్మాషు నుండి అయ్యాలోను వరకు శత్రువులను తునుమాడిరి. కాని వారు మిక్కిలి అలసిపోయిరి.

32. అందుచే వారు శత్రువులనుండి దోచుకొనివచ్చిన గొఱ్ఱెలు, ఎడ్లు, దూడలు మొదలైన జంతువులపై ఎగబడిరి. ఎక్కడి వానిని అక్కడనే నేలమీదనే వధించిరి. నెత్తురు తొలగింపకయే మాంసముకాల్చి భుజింపమొదలిడిరి.

33. జనులు నెత్తురుతొలగింపని మాంసము భుజించి యావే యెదుట పాపము కట్టుకొనుచున్నారని సౌలు తెలిసికొనెను. అతడు ”ప్రజలు యావే ఆజ్ఞ మీరు చున్నారుగదా!” అనెను. పెద్ద రాతిబండను తన యొద్దకు దొర్లింప ఆజ్ఞయిచ్చెను.

34. చెంతనున్న వారితో ”ప్రజలకడకు వెళ్ళి ‘మీ ఎడ్లను, గొఱ్ఱెలను కొనివచ్చి ఈ రాతిబండపై కుత్తుకలుకోసి భుజింపుడు. నెత్తురుతో భుజించి యావే ఎదుట పాపము కట్టుకొన కుడు’ అని మందలింపుడు” అని చెప్పెను. కావున ప్రజలు ఆ రేయి వారివారి ఎడ్లను కొనివచ్చి రాతి బండపై వధించిరి10.

35. సౌలు ప్రభువునకు ఒక బలిపీఠము కట్టెను. అదియే అతడు నిర్మించిన మొది బలిపీఠము.

యోనాతాను తప్పిదము బయటపడుట

36. సౌలు ”రాత్రికి పోయి ఫిలిస్తీయుల మీదపడి వారిని తరుముదము. వేకువజాము వరకు వారిసొత్తు దోచుకొందము. ఒక్కడుకూడ మిగులకుండ శత్రువులను చంపుదము” అనెను. అనుచరులు నీ ఇష్టప్రకారముగనే కానిమ్మనిరి. కాని యాజకుడు మొద దేవునిచిత్తము తెలిసికొందమనెను.

37. సౌలు ప్రభువును ఉద్దేశించి ”ఫిలిస్తీయులను వెన్నాడ వచ్చునా? నీవు వారిని యిస్రాయేలు వశము గావించె దవా?” అని అడిగెను. కాని ఆ దినమున యావే ప్రత్యుత్తరము ఈయలేదు.

38. సౌలు ప్రజాధిపతు లను చూచి ”నాయకులారా! ముందుకురండు. ఈ దినము జరిగిన అపరాధమేమియో తెలిసికొనవల యును.

39. యిస్రాయేలు విమోచకుడైన యావే ప్రభువుతోడు! అపరాధము చేసినవాడు నా తనయుడు యోనాతానే అయినను తప్పక చావవలసినదే” అనెను. అతని పలుకులకు ప్రజలలో ఒక్కడును నోరు మెదప లేదు.

40. సౌలు జనులతో ”మీరందరు ఒక ప్రక్క నిలువుడు. నేనును, నా కుమారుడైన యోనాతాను మరియొకప్రక్క నిలచెదము” అనెను. వారు ”నీ ఇష్టప్రకారముగనే కానిమ్ము” అనిరి.

41. అంతట సౌలు ”యిస్రాయేలు దేవుడవైన ప్రభూ! ఈ రోజు నీ దాసునకు బదులు పలుకవైతివేల? నేనుగాని, నా పుత్రుడైన యెెూనాతానుగాని లేక ప్రజలుగాని అప రాధము చేసినచో నీవే దీనిని నిర్ణయించుము అని వేడుకొనెను. అప్పుడు చీట్లువేయగా యోనాతాను సౌలుల పేర్లు వచ్చెను. కావున ప్రజలు తప్పించు కొనిరి.

42. మరల సౌలు తనకు, తన కుమారునకు చీట్లువేయగా యోనాతాను పేరు వచ్చెను.

43. అంతట సౌలు యోనాతానుతో ”నీవేమి పాడుపని చేసితివో తెలియజేయుము” అనెను. అతడు ”నా చేతనున్న కఱ్ఱకొనతో కొంచెము తేనెనుగైకొని త్రాగితిని. నేను నిక్కముగా చావవలసినదే” అనెను.

44. సౌలు ఇట్లనెను ‘యోనాతాను, నీవు నిక్కముగా చావవలసినదే, కానిచో దేవుడు నాకు ఎంతైనా కీడు చేయునుగాక!’ అనెను. ”యోనాతాను చావవలసినదే” అని గ్టిగా ఒట్టు వేసికొనెను.

45. కాని ప్రజలు మాత్రము ”యిస్రాయేలీ యులకు ఇంతి మహావిజయము సాధించిప్టిెన యోనాతాను చనిపోవలసినదేనా? అది ఎన్నికిని కూడదు. సజీవుడైన యావేతోడు! యోనాతాను తల పూవువాడకుండుగాక! అతడు ఈ దినము సాధించిన విజయము యావే తోడ్పాటువలననే సిద్ధించినది” అనిరి. ఇట్లనుచు యోనాతానును విడిపించిరి. కనుక అతడు చావును తప్పించుకొనెను.

46. అటుపిమ్మట సౌలు ఫిలిస్తీయులను వెన్నాడలేదు. కావున వారు తమ స్థలమునకు వెళ్ళిపోయిరి.

సౌలు ఏలుబడి

47. సౌలు యిస్రాయేలు దేశమున పరిపాలన మును సుస్థిరము చేసికొనెను. చుట్టుపట్లనున్న శత్రువు లతో యుద్ధములు చేసెను. మోవాబీయులను, అమ్మోనీయులను, ఎదోమీయులను, సోబా రాజు లను, ఫిలిస్తీయులను గెలిచెను. అతడు ఏ వైపు మరలినను విజయము లభించెడిది.

48. సౌలు పరా క్రమముతో అమాలెకీయులను ఓడించి వారి దోపిడి దండుల నుండి యిస్రాయేలీయులను కాపాడెను.

49. సౌలు తనయులు: యోనాతాను, యిష్వీ, మెల్కీషూవా అనువారు. అతనికి కుమార్తెలు ఇద్దరు. మేరబు పెద్ద కూతురు. మీకాలు రెండవకూతురు.

50. అహిమాసు కూతురగు అహీనోవము సౌలు భార్య. అతని సైన్యాధిపతి నేరు కుమారుడైన అబ్నేరు. ఇతడు సౌలు పినతండ్రి కుమారుడు.

51. సౌలు తండ్రి అయిన కీషును, అబ్నేరు తండ్రియైన నేరును అబీయేలు తనయులు.

52. సౌలు బ్రతికి యున్నన్ని నాళ్ళు ఫిలిస్తీయులతో హోరాహోరిగా పోరాడెను. అతడు వీరుడుగాని, పరాక్రమవంతుడుగాని కంట బడగనే వానిని తన సైన్యమున చేర్చుకొనెడివాడు.

Previous                                                                                                                                                                                                     Next