ఉపోద్ఘాతము:
పేరు: ఈ గ్రంథమునకు రచయిత తన పేరు పెట్టుకొనెను. ఇతను యెరూషలేము నివాసి సీరాపుత్రుడైన యేసు. ఈ గ్రంథమునకు తన పేరుతో పాటు తన తండ్రి పేరును కూడా జోడించెను. సీరాకు ఎలియెజెరు పుత్రుడు.
కాలము: క్రీ.పూ. 190-180లో హీబ్రూభాషలో వ్రాయబడినది. క్రీ.పూ. 132 నాికి గ్రీకు భాషలోనికి అనువదించబడినది.
రచయిత: సీరాపుత్రుడైన యేసు స్వయముగా వ్రాసెనని చెప్పుకొనెను (50:27). అతని మనుమడు దీనిని గ్రీకుభాషలోనికి అనువదించెను.
చారిత్రక నేపథ్యము: మక్కబీయుల తిరుగుబాటు (క్రీ.పూ. 167-64) నాికి యూదమతము, సంఘము ఏ స్థితిలో వుండెనో ఈ గ్రంథము ద్వారా తెలుసుకొనెదము. నాి ఆర్థికస్థితి, ధనిక, పేద, తారతమ్యాలతో విడిపోయినది. లింగవివక్ష, ధర్మాచారులు, ధర్మరాహిత్యులు అనే విభజనలు కనిపించినవి.
ముఖ్య అంశములు: జ్ఞానగ్రంథము శైలిలో నీతినియమాల అంశములను బోధించిరి. (1:1-43:33). యిస్రాయేలీయుల చరిత్రలో ఆదర్శవంతులైన నీతిమంతులు, నాయకుల జీవితగాథలను ప్రేరణ వృత్తాంతాలుగా మలచి ప్రజలకు బోధించిరి (44:1-50:24). కృతజ్ఞతా గీతము (51:1-12) మరియు జ్ఞానకావ్యము (51:13-30) ఈ గ్రంథమునకు కిరీటములుగా నిలుచును. యూదుల మతచక్రాలైన చట్టము, ప్రవచనాలు మరియు జ్ఞానగ్రంథాల బోధనల సారాంశములను విరివిగా రచయిత వాడుకొనెను.
క్రీస్తుకు అన్వయము: సీరా గ్రంథము ధర్మశాస్త్రము, ప్రవచనాలు, దైవజ్ఞానము అనే వాిని మార్గదర్శ సూత్రాలుగా చూపిస్తుంది. ఈ మూడు అంశాలు క్రీస్తులో సంపూర్ణముగా నెరవేరుతాయి (చూడుము. లూకా 9:28-36; యోహాను 14:6; లూకా 24:44).
గ్రీకు అనువాదకుని పీఠిక
1-2. ధర్మశాస్త్రము వలనను, ప్రవక్తల వలనను, తరువాత వచ్చిన ఇతర రచయితల వలనను మనకు గొప్పలాభములు చేకూరినవి.
3. విజ్ఞానమును, ఉప దేశమును అందించినందులకుగాను యిస్రాయేలీయు లను తప్పక అభినందింపవలెను. 4. కాని వేద గ్రంథ ములను అధ్యయనము చేయువారు తాము స్వయ ముగా విజ్ఞానమును ఆర్జించినంత మాత్రమున చాలదు.
5-6. జ్ఞానార్జన చేయువారు తమ ఉపదేశముల ద్వారాను, రచనలద్వారాను ఇతరులకును మేలు చేయ వలెను. 7-11. కావుననే మాతాతయైన యేసు, ధర్మశాస్త్రమును, ప్రవక్తలను, మన పితరులు రచించిన ఇతర గ్రంథములను చక్కగా అధ్యయనము చేసి వానిలో పాండిత్యమును గడించెను.
12. తరువాత అతడు విజ్ఞానార్జనమును గూర్చి స్వయముగా ఒక గ్రంథమును వ్రాసెను.
13-14. విజ్ఞానమునందు ఆసక్తిగలవారికి ఆ పుస్తకము ఉపయోగపడును. దాని సాయముతో వారు ధర్మశాస్త్రమును అధికశ్రద్ధతో పాింపగలుగుదురు.
15-17. పాఠకులు ఈ గ్రంథమును శ్రద్దతోను, ఆర్ద్రతతోను చదువుదురుగాక.
18-20. నేనెంత జాగ్రత్తగా కృషిచేసినను కొన్నిసందర్భాలలో ఆయా పదములను తగినరీతిగా అనువదింప జాలనైతిని. కనుక చదువరులు నన్ను మన్నింతురు గాక.
21-26. హీబ్రూ భాషలో వ్రాయబడిన విషయములను ఇతర భాషల లోనికి అనువదించునపుడు మూలార్థ మును యథావిధిగా అనువాదములోనికి తీసికొని రాలేము. ఈ సమస్య ఒక్క ఈ గ్రంథము విషయముననే గాదు. ధర్మశాస్త్రము, ప్రవక్తలు, ఇతర గ్రంథములను వీని గ్రీకు అనువాదమును పరిశీలించి చూచితిమేని అవి మూలముననున్న దానికంటె భిన్నముగా చూపట్టును.
27-28. యూయెర్గెటెసు రాజు పరిపాలనాకాలము ముప్పది ఎనిమిదవయేట, నేను ఐగుప్తునకు వచ్చి కొంతకాలము అచట వసించితిని. అచట నాకు అధ్యయనమునకు మంచి అవకాశము లభించినది.
29-30. అప్పుడు నాకు ఈ గ్రంథమును గ్రీకులోనికి అనువదించుట అవసరమనిపించినది.
31-35. నేను వ్యయప్రయాసలకోర్చి దీర్ఘకాలము కృషిచేసి దీనిని అనువదింపపూనితిని. అన్యదేశములలో స్థిరపడిన వారికిని, ధర్మశాస్త్రమును అధ్యయనముచేసి దాని ప్రకారము జీవింపవలెనను సాహసము కలవారికిని, ఈ గ్రంథమును అందుబాటులోనికి తీసికొనిరావలె నని సంకల్పించుకొింని.