సీమోను స్తుతి

14 1. దెమేత్రియసు రాజు గ్రీకుశకము నూటడెబ్బదిరెండవ యేట (అనగా క్రీ.పూ. 140లో) సైన్యములను ప్రోగుజేసికొని మేదియాకు వెళ్ళెను. అక్కడ ఇంకా ఎక్కువ సైన్యమును చేకూర్చుకొని త్రూఫోనుతో పోరాడవలెనని అతడి సంకల్పము.

2. కాని మేదియా పారశీకముల ప్రభువు అర్సాకెను తన దేశమున దెమేత్రియసు కాలు పెట్టెనని విని అతడిని ప్రాణములతో పట్టుకొనిరమ్మని తన సైన్యాధిపతిని పంపెను.

3. ఆ సేనాపతి దెమేత్రియసును ఓడించి బందీని చేసి అర్సాకెను వద్దకు కొనివచ్చెను. ఆ రాజు అతడిని చెరలోప్టిెంచెను.

4. సీమోను బ్రతికి యున్నంతకాలము యూదయాదేశమున శాంతి నెల కొనెను.

               సీమోను తన జీవితాంతము ప్రజల మేలెంచి పరిపాలించెను.

               అతని ఆధిపత్యమును జనులు మిగుల మెచ్చుకొనిరి.

5.           అతడి అనేక వీరకృత్యములకు

               జీవిత కాలమంతయు అతడిని ఆదరించిరి. ప్రతీకగా యొప్పాను జయించి

               ఓడరేవుగా మార్చి, ఆవలిద్వీపములకు రాకపోకలు ఏర్పరచెను.

6.           అతడు తన రాజ్యము నంతిని వశము చేసికొని, తన దేశపు పొలిమేరలను విస్తరింపజేసెను.

7.            బందీలైన తన వారిని అనేకులను

               మాతృభూమికి కొనివచ్చెను.

               గేసేరు, బేత్సూరులను

               యెరూషలేము కోటను జయించెను.

               వాని నెల్లను శుద్ధిచేయింపగా

               అతనిని ఎదిరించు వారు లేరైరి.

8.           యూదులు నిశ్చింతగా సేద్యము చేసికొనిరి.

               వారి పొలములలో పంటపండెను,

               చెట్లు కాయలు కాసెను.

9.           పెద్దలు రచ్చబండవద్ద కూర్చుండి,

               తమకు ప్రాప్తించిన

               లాభములను గూర్చి ముచ్చించుకొనిరి. యువకులు సైనికుల దుస్తులు, 

               ఆయుధములు ధరించిరి.

10.         సీమోను నగరములకు భోజనపదార్థములు, రక్షణాయుధములు సమృద్ధిగా సరఫరా చేసెను అతని పేరు ఎల్లెడల మారుమ్రోగెను.

11.           అతడు దేశమున శాంతి నెలకొల్పగా యిస్రాయేలీయుల ఆనందము మిన్నుముట్టెను.

12. ప్రతివాడును తన ద్రాక్షతోటలో,

               అంజూరపుతోటలో భయమనునది లేకయే సంతోషముగా కాలము వెళ్ళబుచ్చెను.

13.          ఆ రోజులలో శత్రురాజులెల్ల ఓడిపోయిరి. కనుక యూదులతో పోరాడువారే లేరైరి.    

14.          అతడు పేదసాదలనెల్ల ఆదుకొనెను.

               ధర్మశాస్త్రమును శ్రద్ధగా పాించెను.

               దాని నియమములను

               అనుసరింపని వారినెల్ల మట్టుపెట్టెను.

15.          దేవాలయమును వైభవోపేతముగా అలంకరించి, పూజాసమయమున వాడు పాత్రములు అనేకములు సరఫరా చేసెను.

స్పార్టా నగరముతో పొత్తు

16. రోము,  స్పార్టా  నగరముల  పౌరులు యోనాతాను చనిపోయెనని విని మిగుల చింతించిరి.

17. వారు  యోనాతానునకు బదులుగా సీమోను ప్రధానయాజకుడయ్యెనని వినిరి. యూదయా దేశ మును దాని నగరములు అతని అధీనములోనున్నవని తెలిసికొనిరి.

18. వారు సీమోను సోదరులైన యూదా యోనాతానులతో పూర్వము తాము చేసికొనిన సంధి షరతులను కొనసాగించుటకు అంగీకరించుచున్నా మని ఇత్తడిపలక మీద వ్రాసి ఆ పలకను సీమోను వద్దకు పంపిరి.

19. ఆ లేఖను యెరూషలేము పౌరులయెదుట చదివి వినిపించిరి.

20. స్పార్టాప్రజలు వ్రాసిన లేఖ యిది:

”యూదుల ప్రధానయాజకుడగు సీమోనుకును, వారి యాజకులకును,  ప్రజలకును శుభములు పలికి స్పార్టాప్రజలు, పాలకులు వ్రాయునది.

21. మీరు మా చెంతకు పంపిన దూతలు మీ కీర్తి ప్రతిష్ఠలగూర్చి చెప్పిరి. వారిని చూచి మేము ఆనందభరితులమైతిమి.

22. వారి రాకను గూర్చి మేము మా దస్తావేజులలో ఇట్లు వ్రాయించితిమి. అంియోకసు కుమారుడు నుమేనియసు, యాసోను కుమారుడు ఆంిపాతెరును యూదుల దూతలుగా వచ్చి పూర్వము వారు మనతో చేసికొనిన సంధి షరతులను నూత్నీకరించుకొనిరి.

23. మా శాసనసభ సభ్యులు ఈ దూతలను గౌరవాదరములతో ఆహ్వా నించిరి. వారు కొనివచ్చిన సందేశమును మా దస్తా వేజులలో లిఖించి భద్రపరచితిమి. ప్రధానయాజకుడైన సీమోనునకు ఒక ప్రతిని పంపుటకు ఈ లేఖ నకలు కూడ వ్రాయించితిమి.”

24. అటుతరువాత సీమోను నుమేనియసును రోమునకు కూడ పంపెను. అతడు వేయి తులముల బరువుగల బంగారు డాలును బహుమతిగా కొని పోయి యూదులు రోమీయులతో చేసికొనిన సంధి షరతులను నూత్నీకరించుకొని వచ్చెను.

సీమోనునకు గౌరవ సత్కారములు

25. పై సంగతులెల్ల విని యిస్రాయేలు ప్రజలు ”మనము సీమోనును, అతని కుమారులను ఉచిత రీతిని సత్కరించుటెట్లు?

26. అతడు అతని సోదరులు, అతని తండ్రి కుటుంబమంతయు మన ప్రజలను కాపాడుటకు ధైర్యముగా ముందునకు వచ్చిరి. వారు శత్రువులతో పోరాడి మనకు స్వాతంత్య్రము సంపా దించిప్టిెరి” అని అనుకొనిరి.

27-28. వారు ఈ క్రింది శాసనమును రాగిరేకుల మీద వ్రాయించి వానిని సియోను కొండపైనున్న స్తంభముల మీద ప్టిెంచిరి. ఆ శాసనమిది:

గ్రీకుశకము నూటడెబ్బదిరెండవ యేడు (అనగా క్రీ.పూ. 140లో) ఏలూలు అను పేరుగల నెల           పదునెనిమిదవ దినమున సీమోను ప్రధానయాజ కుడుగా పనిచేయుచున్న కాలమున మూడవ యేడు యాజకులు, ప్రజలు, అధికారులు, పెద్దలు సమావేశ మైన అసారామెల్‌ అనబడు మహాసభలో ఈ క్రింది విషయములు తెలియజేయబడినవి:

29. ”మన దేశమున యుద్ధములు పెచ్చు పెరిగి నప్పుడు యోవారీబు గోత్రమునకు చెందిన యాజ కుడగు మత్తతీయ కుమారుడు సీమోను, అతని సోద రులు ప్రాణములకుకూడ తెగించి శత్రువులతో పోరాడి మన దేశమును, ధర్మశాస్త్రమును కాపాడిరి. వారు మన జాతికెనలేని గౌరవమును చేకూర్చిప్టిెరి.     

30. యోనాతాను మన ప్రజలను ఏకము చేసి మనకు ప్రధానయాజకుడైన తరువాత కన్నుమూసెను.

31. యూదుల శత్రువులు వారి దేశము మీద దండెత్తి వారి దేవాలయమును నాశనము చేయబూనిరి.

32. అపుడు సీమోను నాయకుడై తన దేశము కొరకు పోరాడెను. అతడు తన దేశమును రక్షించుటకు పోరాడు సైనికులకు ఆయుధములు సరఫరా చేసెను. జీతము చెల్లించెను. ఇందుకు తన సొంత సొమ్మునే వెచ్చించెను. 33. అతడు యూదయాలోని నగరము లను సురక్షితము చేసెను. యూదయా సరిహద్దులో నున్న బేత్సూరు నగరమున పూర్వము శత్రువులు ఆయుధములను పదిలపరచెడివారు. సీమోను ఆ దుర్గమును కూడ సురక్షితముచేసి అచట సైనికదళము లను కాపుపెట్టెను.

34. అతడు ఓడరేవగు యొప్పాను సురక్షితము చేసెను. అసోటసు చేరువలోనున్న గేసేరు నకు కూడ ప్రాకారములు నిర్మించెను. అంతకు పూర్వము ఆ నగరమున శత్రుసైనికులు వసించెడివారు. మరియు అతడు ఆ తావున యూదులకు నివాసము కల్పించి వారికి కావలసినవన్నియు సరఫరా చేయించెను.

35. సీమోను దేశభక్తిని, తన జాతికి కీర్తిప్రతిష్ఠలను తీసికొని వచ్చుటకుగాను అతడు చేసిన కృషిని చూచి ప్రజలు అతనిని నాయకునిగను, ప్రధానయాజకునిగను నియమించిరి. అతడు చేసిన కార్యములను, ధర్మమును నిలబ్టెిన తీరును, తన జాతికి గౌరవమును చేకూర్చు టలో అతడు చూపిన ఆసక్తిని చూచి ప్రజలతనికి పైపదవులు ఒప్పజెప్పిరి.

36. సీమోను నాయకత్వమున యూదులు అన్య జాతి వారిని తమ దేశమునుండి పారద్రోలిరి. దేవాల యమునకు ఉత్తరభాగమున ఉన్న దుర్గమునుండి శత్రు సైన్యమును వెళ్ళగ్టొిరి. వారు ఆ దుర్గమునుండి వెడలి వచ్చి పవిత్రమైన దేవాలయమును అమంగళము చేసెడివారు.

37. అతడు దుర్గమున యూదులకు నివాసము కల్పించి దానిని సురక్షితము చేయగా అది యెరూషలేము నగరమును, దేశమును గూడ కాపాడ గలిగెను. అతడు యెరూషలేము ప్రాకారముల ఎత్తు కూడ పెంచెను.

38. ఈ సేవను మెచ్చుకొని దెమేత్రియసు రాజు సీమోను యాజకత్వమును సుస్థిరము చేసెను.

39. అతనికి రాజమిత్రుడన్న బిరుదమును గూడ ఇచ్చెను. ఇంకనతనిని మిగుల సత్కరించెను.

40. రోమీయులు యూదులను తమ మిత్రులనుగాను, తమ పక్షమువారిగాను, తమ సోదరులుగాను గణించిరి. వారు సీమోను పంపిన రాయబారులను గౌరవాద రములతో ఆహ్వానించిరి. కనుకనే దెమేత్రియసు కూడ సీమోనును సన్మానించెను.

41. నమ్మదగిన ప్రవక్త ఒకడు పొడచూపినవరకు సీమోను అతని కుమారులు తమకు ప్రధానయాజ కులుగాను, నాయకులుగాను కొనసాగవలెనని యూద ప్రజలు, వారి యాజకులు నిర్ణయించిరి.

42. సీమోను దేశాధిపతిగను, సైన్యాధిపతిగను, దేవాలయాధిపతి గను పనిచేయును. అధికారులను నియమించును. అతడు సైన్యము వాడు ఆయుధములు సరఫరా  చేయును. కోట సంరక్షకుడుగా నుండును. దేశము లోని ప్రజోపయోగకరమైన పనులన్నిని పర్యవే క్షించును.

43. అందరు అతనిని విధేయించవలెను. ప్రభుత్వపు దస్తావేజులన్నియు అతని పేరు మీదుగా లిఖింపబడును. అతడు రాజవస్త్రములను, బంగారు   భుజకీర్తిని  ధరింపవచ్చును.

44. ప్రజలు, యాజకులు ఈ నియమములనెల్ల అంగీకరింపవలెను. ఎవరును సీమోను చేసిన నియమములు మీరరాదు. అతని అను మతిలేనిదే ఎవరును ఎచటను ఎి్టసభను జరుప రాదు. ఎవరును రాజవస్త్రములను, బంగారు భుజకీర్తిని ధరింపరాదు.

45. ఈ నియమములను పాింపని వారు శిక్షార్హులగుదురు.”

46. సీమోను ఈ నియమ ములను అమలు జరిపింపవచ్చునని ప్రజలెల్ల అంగీ కరించిరి.

47. సీమోను ప్రధాననాయకుడుగను, సైన్యాధిపతిగను, ప్రజలకును, యాజకులకును అధిపతిగను ఉండుటకు అంగీకరించెను.

48. ప్రజలు ఈ శాసనమును ఇత్తడి రేకులపై వ్రాయించి దానిని దేవాలయ పరిసరములలో ప్రముఖ స్థానమున ప్టిెంపవలెనని నిశ్చయించిరి.

49. ఆ శాసనమునకు నకలు వ్రాయించి దేవాలయ కోశా గారమున ఉంచినచో సీమోను అతని కుమారులు అవసరము వచ్చినపుడు దానిని వాడుకోవచ్చునని భావించిరి.