సంపదలు అశాశ్వతములు

ప్రధానగాయకునికి కోర కుమారులు రచించిన కీర్తన

49 1. సకలజాతి ప్రజలారా!

               ఈ సంగతిని వినుడు.

               భూమి మీద వసించు సకల జనులారా!

               ఈ విషయమును ఆలింపుడు.

2.           అధికులు, సామాన్యులు, ధనికులు,

               పేదలు ఎల్లరును వినుడు.

3.           నేను విజ్ఞాన వాక్యములు పలికెదను.

               నా హృదయ భావములు వివేకము గలవి.

4.           నేను సామెతను ఆలించిన మీదట

               పొడుపుకథను తంత్రీవాద్యముపై

               పాడి వివరింతును.

5-6. తమ కలిమిని నమ్ముకొని,

               తమ మహాసంపదలను గూర్చి

               గొప్పలు చెప్పుకొను దుష్టులైన శత్రువులు

               నన్ను చుట్టుముట్టగా నాకు వాిల్లు ఆపదలను

               గూర్చి నేనేమాత్రము భయపడను. 

7.            నరుడు డబ్బు చెల్లించి

               తన ప్రాణములు నిలబెట్టుకోలేడు.

               దేవునికి సొమ్ము చెల్లించి

               అసువులు నిలుపుకోలేడు.

8.           నరుడు తన ప్రాణములు నిలుపుకొనుటకు

               ఎంత మూల్యము చెల్లించినను చాలదు.

9.           అతడు శాశ్వతముగా జీవించుటకును,

               సమాధిగోతిని తప్పించుకొనుటకును,

               ఎంత సొమ్ము చెల్లించినను చాలదు.

10.         జ్ఞానులును గతింతురనియు,

               బుద్ధిహీనులును, మూర్ఖులునుకూడ

               చత్తురనియు, ఎల్లరును తమ సొత్తును

               తమ అనుయాయులకు వదలి పోవలసినదే

               అనియు నరునికి తెలియును.

11.           వారి సమాధులే వారికి శాశ్వతగృహములు.

               వారు తమ గోరీలలోనే సదా వసింతురు.                    ఒకప్పుడు వారికి సొంత భూములున్నను

               ప్రయోజనము లేదు.

12.          నరుని వైభవములు

               అతని ప్రాణములను కాపాడజాలదు.

               అతడు వధకు గురియైన

               మృగమువలె చావవలసినదే.

13.          తమ్ము తాము నమ్ముకొనువారికి,

               తమ సంపదల మీద తాము

               ఆధారపడు వారికి పట్టు గతి య్టిిిది.

14.          మృత్యువే వారికి కాపరియై గొఱ్ఱెలను వలెవారిని పాతాళలోకమునకు తోలుకొని పోవును.

               ఉదయమున నీతిమంతులు వారిని గెలుతురు. 

               అపుడు వారి ఆడంబరము అంతరించును. పాతాళమే వారికి నివాసమగును.

15.          కాని ప్రభువు పాతాళలోకము బారినుండి

               నా ప్రాణములను కాపాడి, నన్ను స్వీకరించును.

16.          ఎవడైనను ధనవంతుడై

               తన సంపదలను పెంచుకొనెనేని,

               అతడిం వైభవము వృద్ధిచెందెనేని

               నీవు భయపడనక్కర లేదు.

17.          అతడు చనిపోయినపుడు ఆ సొత్తును

               తనవెంట కొనిపోజాలడు.

               అతని సంపద అతనివెంట పోదు.

18-19. నరుడు తన మనుగడ వలన

               తాను సంతృప్తి పొందినను,

               తన విజయములకుగాను

               తాను ఇతరులనుండి పొగడ్తలు పొందినను,

               చనిపోయి తన పూర్వులను చేరుకోవలసినదే.

               అచట కలకాలము వెలుగును కోల్పోవలసినదే.

20.        నరుని వైభవములు

               అతని ప్రాణములను కాపాడజాలవు.

               అతడు వధకు గురియైన

               మృగములవలె చావవలసినదే.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము