అబ్రహాము కథ అబ్రామునకు పిలుపు

1. దేవుడు అబ్రాముతో ఇట్లు చెప్పెను: ”నీ దేశమును, నీ చుట్టపక్కాలను, నీ ప్టుినింని వదలి నేనుచూపు దేశమునకు వెళ్ళుము.

2. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను. నిన్ను ఆశీర్వ దింతును. నీ పేరు మహాగొప్పదగును. నీవు అందరికి ఒక దీవెనగా ఉందువు.

3. నిన్ను దీవించువారిని దీవింతును. నిన్ను శపించువారిని శపింతును. నీయందు సకలజాతి జనులు ఆశీర్వదింపబడుదురు.”

4. దేవుడు చెప్పిన రీతిగనే అబ్రాము బయలు దేరెను. లోతు అతనివెంట వెళ్ళెను. హారానును వదలినప్పుడు అబ్రాము వయస్సు డెబ్బదియైదేండ్లు.

5. భార్య సారయితో, సోదరుని కుమారుడు లోతుతో, గడించిన ఆస్తిపాస్తులతో, హారానులో చేర్చుకొనిన సేవకులతో అబ్రాము కనానునకు ప్రయాణమై వెళ్ళెను. వారందరు కనాను దేశమున చేరిరి.

6. అబ్రాము ప్రయాణము చేయుచు షెకెము అను స్థలమునకు చేరి, మోరేవద్ద నున్న సింధూరవృక్షము కడకు వచ్చెను. ఆ కాలమున ఆ దేశములో కనానీయులు నివసించు చుండిరి.

7. అక్కడ దేవుడు అబ్రామునకు కనబడి ”ఈ దేశమును నీ సంతతికి అప్పగించుచున్నాను” అని చెప్పెను. అబ్రాము తనకు కనబడిన దేవునకు అక్కడ బలిపీఠమును నిర్మించెను.

8. అతడు అక్కడినుండి బయలుదేరి బేతేలునకు తూర్పుగా ఉన్న కొండ నేలకు వెళ్ళెను. పడమట ఉన్న బేతేలునకు, తూర్పున ఉన్న హాయికి నడుమ గుడారములు ఎత్తెను. అక్కడ బలిపీఠమును నిర్మించి దేవుని ఆరాధించెను.

9. తర్వాత అక్కడక్కడ విడుదులు చేయుచు అబ్రాము నేగేబునకు బయలుదేరెను.

అబ్రాము ఐగుప్తుదేశము చేరుట

10. ఆ దేశములో పెద్ద కరువు వచ్చెను. దాని తాకిడికి తట్టుకొనలేక అబ్రాము కొన్నాళ్ళు ఉండుటకై ఐగుప్తుదేశమునకు వెళ్ళెను.       

11-12. ఐగుప్తుదేశమును సమీపించుచున్నపుడు అతడు భార్యయగు సారయితో ”నీవు సౌందర్యవతివి. ఐగుప్తుదేశీయులు నిన్ను చూచి – ఆమె యితని భార్యరా!- అని గుసగుసలాడుదురు. వారు నన్ను చంపి నిన్ను ప్రాణములతో వదలుదురు.

13. నాకు సోదరివి అయినట్లు వారితో చెప్పుము. ఇట్లయిన నాకు మేలుకలుగును. నీపైగల ఆదరముచే వారు నా ప్రాణములు కాపాడుదురు” అని చెప్పెను.

14. అబ్రాము ఐగుప్తుదేశములో ప్రవేశించెను. ఐగుప్తుదేశీయులు అబ్రాము భార్య లోకోత్తర సౌందర్య వతి అని కనుగొనిరి.

15. ఫరో కొలువువారు ఆమెను చూచిరి. రాజు సమ్ముఖమున ఆమె సౌందర్యమును కొనియాడిరి. వెంటనే ఆమెను ఫరో భవనమునకు కొనిపోయిరి.

16. ఫరోరాజు ఆమెనుబ్టి అబ్రామునకు మేలు చేసెను. రాజానుగ్రహము చేత అబ్రాము గొఱ్ఱెలను, పశువులను, గాడిదలను, దాసదాసీ జనమును, ఒంటెలను సంపాదించెను.

17. కాని దేవుడు అబ్రాము భార్య సారయిని కాపాడుటకు, ఫరో రాజును అతని కుటుంబమువారిని మహారోగములపాలు చేసెను.

18. ఫరో రాజు అబ్రామును పిలిపించి ”నీవు నాకు ఇంతపని చేసితివేల? ఆమె నీ భార్య అని ఏల చెప్పలేదు? 19. నీ సోదరియని ఏల చెప్పితివి? కావుననే నేను ఆమెను భార్యగా చేసికొింనిగదా! ఇదిగో! నీ భార్య! ఈమెను తీసికొని నీ దారిని నీవు పొమ్ము” అనెను.

20. ఫరో అబ్రామును పంపి వేయుడని భటులను ఆజ్ఞాపించెను. అబ్రాము భార్యను, తన సర్వస్వమును తీసికొని వెడలిపోయెను.

Previous                                                                                                                                                                                                  Next                                                                                    

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము