దైవసహాయము కొరకు ప్రార్థన

ప్రధానగాయకునికి దావీదు కీర్తన

13 1. ప్రభూ! నీవు నన్నెంతకాలము

                              విస్మరింతువు? కలకాలమునా?

                              నీ దివ్యముఖమును ఎంతకాలము

                              నా నుండి దాచుకొందువు?

2.           నా హృదయము ఎంతకాలము

               రేయింబవళ్ళు దిగులుతో నిండియుండవలెను?

               ఎంతకాలము నా శత్రువులు

               నా మీద పై చేయిగా రెచ్చిపోవుదురు?

3.           నా దేవుడవైన ప్రభూ!

               నీవు నావైపుచూచి నాకు జవాబు చెప్పుము.

               నాకు ఆరోగ్యమును దయచేసి

               మృత్యువునుండి నన్ను కాపాడుము.

4.           అప్పుడు నా శత్రువులు ”మేమే గెలిచితిమి”

               అని భావింపకుందురు.    

               నా భంగపాటును చూచి,

               వారు ఆనందింపకుందురు కదా!

5.           నామట్టుకు నేను నీ కృపను నమ్ముకొనియున్నాను.

               నీ రక్షణలో

               నా హృదయము సంతోషించుచున్నది.

6.           ప్రభువు నాకు మేలు చేసెను కనుక

               నేను ఆయనను స్తుతించి కీర్తింతును.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము