మన స్తోమతకు తగిన వారితోనే కలియవలెను

13 1.       కీలు ముట్టుకొన్నచో చేతులకు

                              మురికియగును.

                              గర్విష్టులతో చెలిమి చేయువాడు

                              వారివింవాడే అగును. 

2.           నీకు మించిన బరువు మోయవలదు.

               నీ కంటె ధనవంతులు,

               బలవంతులైన వారితో చెలిమి చేయవలదు.

               మ్టికుండను లోహపు పాత్ర చెంత ఉంచరాదు.

               అవి ఒకదానితోనొకి తగిలినచో కుండపగులును

3.           ధనికుడు తోివానికి

               అపకారము చేసికూడ దర్పము జూపును.

               పేదవాడు అపకారము పొందినను

               తానే మన్నింపు వేడుకోవలెను.

4.           నీవు ఉపయోగపడినంత కాలము

               ధనికుడు నిన్ను వాడుకొనును.

               కాని నీకు అవసరము కలిగినపుడు

               అతడు నిన్ను చేయివిడచును.

5.           నీ యొద్ద ధనమున్నంతకాలము

               అతడు నీతో చెలిమి చేయును.

               ఏ మాత్రము  సంకోచింపక

               నీ సొత్తును కాజేయును.

6.           అతనికి నీతో అవసరము కలిగినపుడు 

               నిన్ను  నమ్మించును.

               నవ్వు మోముతో నిన్ను ప్రోత్సహించుచున్నట్లే

               చూపట్టును.

               నీతో తీయగా మాటలాడుచు

               ”నా నుండి నీకేమైన కావలెనా?” అని అడుగును.

7.            తన విందులతో నిన్ను మోమాటప్టిె

               రెండు మూడు సార్లు నీ సొమ్ము కాజేయును.

               అటు తరువాత నిన్ను పరిహాసము చేయును.

               ఆ మీదట నీవు అతనికి ఎచ్చటైనను కన్పింతువేని

               నిన్నెరుగనట్లు నించి,

               తన దారిన తాను సాగిపోవును.   

8.           కనుక నీవు మోసమునకు గురికాకుండ

               జాగ్రత్తపడుము.

               లేదేని ఆనందమును అనుభవించుచుండగనే

               అవమానము తెచ్చుకొందువు.

9.           పలుకుబడికలవాడు ఎవడైనను

               నిన్ను తన ఇంికి ఆహ్వానించినచో

               నీవు బెట్టు చూపుము.

               అప్పుడతడు నిన్ను మరెక్కువగా బ్రతిమాలును.

10.         నీ అంతట నీవతని యొద్దకు వెళ్ళెదవేని

               అతడు నిన్ను నిర్లక్ష్యము చేయును.

               అట్లని అతడికి మిక్కిలి దూరముగా ఉండకుము. అప్పుడతడు నిన్ను పూర్తిగా విస్మరింపవచ్చును.

11.           నీవు అతనితో సరిసమానుడవు అన్నట్లు

               ప్రవర్తింపవలదు.

               అతడు ఏమేమో చెప్పినను

               ఆ మాటలు నమ్మవద్దు.

               నిన్ను పరీక్షించుటకే అతడు

               అధికముగా సంభాషించును.

               నవ్వుచున్నట్లే నించి

               నిన్ను నిశితముగా పరిశీలించి చూచును.

12.          నీ రహస్యములను దాచనివాడు నిర్దయుడు.

               అి్ట వాడు నీకు హాని చేయుటకును,

               నిన్ను చెరలో త్రోయించుటకును వెనుకాడడు.

13.          కనుక నీ రహస్యములను పొక్కనీక

               జాగ్రత్తగా ఉండుము.

               నీవు ప్రమాదకరమైన పరిస్థితిలో

               ఉన్నావని గుర్తింపుము.

14.          ఈ సంగతి గూర్చి వినగానే నిద్రమేల్కొనుము.

               నీవు జీవించినంతకాలము

               ప్రభువును ప్రేమింపుము

               అతని సహాయముకొరకు మనవిచేయుము.

15.          ప్రతిప్రాణి తనకు తుల్యమైన

               ప్రాణితో కలియగోరును.

               నరుడు తనకు సరిసమానమైన వాని పొత్తుగోరును

16. ప్రతిప్రాణి సజాతిప్రాణితో కలియును.

               నరులును తమవిం వారితో

               చెలిమి చేయుదురు.

17.          తోడేలు గొఱ్ఱెపిల్లతో కలియనట్లే,

               పాపాత్మునికి భక్తిపరునితో పొత్తులేదు. 

18.          దుమ్ముల గొండికి, కుక్కకు చెలిమిలేనట్లే,

               ధనికునికి, దరిద్రునికి బాంధవ్యము లేదు.

19.          అడవిలో సింగము గాడిదను వేాడినట్లే,

               ధనికుడు పేదవానిని వేాడును.

20. గర్వాత్మునికి వినయము పొసగదు.

               అట్లే ధనికునికి పేదవాడు అసహ్యము.

21.          ధనికుడు పడిపోయినపుడు

               అతని మిత్రులు అతనిని లేవనెత్తుదురు.

               కాని పేదవాడు కూలిపోయినపుడు

               అతని మిత్రులు అతనిని విడనాడుదురు.

22.        ధనికుడు తప్పు పలికినచో చాల మంది

               అతనిని సమర్థింతురు.

               పలుకగూడని పలుకు పలికినను 

               ఏమేమో చెప్పి అతనిని సమర్థింతురు.

               కాని  పేదవాడు  తప్పు పలికినచో

               అందరు అతనిని నిందింతురు.

               అతడు ఒప్పు పలికినపుడెవరును వినరు.

23. ధనికుడు మ్లాడినపుడెల్లరును

               మౌనముగా ఉందురు.

               అతని సంభాషణను కొండంతచేసి పొగడుదురు

               దరిద్రుడు మ్లాడినచో

               ఎల్లరును ”వీడెవడయ్యా?” అందురు.

               ఏదైనా పొరపాటు మాటచెప్పినచో

               అతనిని క్రింద పడద్రోయుదురు.

24.         పాపము లేనపుడు ధనమును చెడ్డదికాదు,

               దారిద్య్రమును చెడ్డదికాదు.

               దుష్టులు మాత్రము పేదరికమును

               చెడ్డదానినిగా ఎంతురు.

25.        నరుని హృదయములోని భావములనుబ్టి

               అతని మోము ఆనందముగానైనా,

               విచారముగానైనా చూపట్టును.

26.        నీ హృదయము సంతోషముగా ఉన్నచో 

               నీ ముఖము కూడ ఉల్లాసముగా నుండును.

               కాని లోకోక్తులను చెప్పవలెనన్న

               చాల శ్రమపడవలెను.