మందసమును సియోనునకు కొనిపోవుట

యాత్ర కీర్తన

132 1.    ప్రభూ! దావీదును,

                              అతడు అనుభవించిన శ్రమలను జ్ఞప్తియందుంచుకొనుము.

2.           అతడు నీకు చేసిన శపథమును,

               బలాఢ్యుడవగు యాకోబు దేవుడవైన నీకు

               చేసిన ప్రమాణమును జ్ఞప్తియందుంచుకొనుము.

3-5. ”ప్రభువునకు ఒక స్థానము సిద్ధము చేయువరకు

               బలాఢ్యుడగు యాకోబు దేవునికి వాసస్థలము

               తయారుచేయువరకు, నేను ఇంికి పోను,

               పడుకనెక్కను, నేను నిద్రింపను, రెప్పవాల్పను”

               అని దావీదు బాస చేసెను.

6.           ఎఫ్రాతాలో మనము మందసమును గూర్చి వింమి

               యెయారీము పొలములలో దానిని కనుగొింమి

7.            ”ప్రభువు మందిరమునకు పోయి,

               ఆయన పాదపీఠమునొద్ద

               ఆయనను పూజింతము” అనుకొింమి.

8.           ప్రభూ లెమ్ము!

               నీ బలసూచకమైన మందసముతో

               నీ విశ్రాంతిస్థలమునకు కదలిరమ్ము.

9.           నీ యాజకులు సదా నీతిని పాింతురుగాక!

               నీ భక్తులు సంతసముతో పాడుదురుగాక!

10.         నీ దాసుడైన దావీదును జూచి

               నీవు ఎన్నుకొనిన రాజును చేయివిడువకుము.

11.           ఆడినమాట తప్పని నీవు

               దావీదునకు ఇట్లు బాసచేసితివి.

               ”నీ కుమారుడు రాజై

               నీ తరువాత పరిపాలనము చేయును.

12.          నీ తనయులు నా నిబంధనములు అనుసరించి నేను ఉపదేశించిన ఆజ్ఞలను పాింతురేని

               వారి పుత్రులును నీ సింహాసమును అధిరోహించి

               శాశ్వతముగా పరిపాలనము చేయుదురు”.

13.          ప్రభువు సియోనును ఎన్నుకొనెను.

               దానిని తన వాసస్థలముగా చేసికొనెను.

14.          అతడిట్లు పలికెను:

               ”ఇది నాకు సదా విశ్రాంతిస్థలమగును.

               ఇది నేను కోరుకొనిన వాసస్థలము.

15.          నేను సియోను పౌరుల అవసరములెల్ల తీర్తును.

               ఆ నగరములోని పేదలకు ఆహారము పెట్టుదును.

16.          దానిలోని యాజకులకు రక్షణమును ఒసగుదును.

               దానిలోని భక్తులు

               సంతసముతో పాటలు పాడుదురు.

17.          ఇచట నేను దావీదు వంశజుని

               ఒకనిని నెలకొల్పుదును.

               నా అభిషిక్తుని కొరకు నేనచట 

               ఒక  దీపము సిద్ధము చేయుదును.

18.          అతని శత్రువులను అవమానమున ముంచెదను అతని కిరీటము అతనిమీదేయుండి తేజరిల్లును”.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము