2 1. దుష్టులు మూర్ఖబుద్ధితో ఇట్లు తలంచిరి:

               ”మన ఈ జీవితము స్వల్పకాలికమైనది,       శోకమయమైనది.

               మరణము ఆసన్నమైనపుడు డెవడును

               తప్పించుకోజాలడు.

               మృత్యులోకమునుండి తిరిగివచ్చిన వాడెవడునులేడు.

2.           మనముకేవలము యాదృచ్చికముగా ప్టుితిమి,

               మరణము తరువాత

               మన ఉనికి ఏమియు మిగులదు.

               మన ఊపిరి పొగవింది.

               మన బుద్ధిశక్తి కేవలము

               హృదయస్పందనము వలన ప్టుిన రవ్వ.

3.           ఈ రవ్వ ఆరిపోగానే మన దేహము బుగ్గియగును,

               మన ఊపిరి గాలిలో కలిసిపోవును.

4.           కాలక్రమమున మన పేరు మాసిపోవును.

               మనము సాధించిన కార్యములనెవరును

               గుర్తుంచుకొనరు.

               మన బ్రతుకులు మబ్బులవలె మాయమైపోవును. ఎండ వేడిమి సోకిన పొగమంచువలె

               కరిగిపోవును.

5.           ఈ నేలమీద మన బ్రతుకులు

               నీడలవలె గతించును.

               మనమెవరమును మృత్యువును నిరోధింపజాలము.

               నరులెల్లరికి చావు విధింపబడినది.

               ఎవరును దానిని తప్పించుకోజాలరు.

6.           కనుక ఈలోకమున సుఖభోగములు అనుభవించుచు

               యువకులవలె కాలము గడుపుచు సుఖింతము.

7.            విలువగల మద్యములను, 

               లేహ్యములను సేవింతము.

               వసంతకాల పుష్పములన్నిని వాడుకొందము.

8.           వాడిపోకమునుపే గులాబీలను కోసి

               అలంకరించు కొందము.

               మనలోనెవడును మన పాలబడిన  భోగములను

               విడనాడకూడదు.

9.           మనమనుభవించిన ఆనందములను జ్ఞప్తికితెచ్చు

               గురుతులను ఎల్లతావుల నిలుపుదము.

               విలాసజీవితము మన భాగధేయము.           

10.         ”దరిద్రుడును, నీతిమంతుడునైన

               నరుని ప్టి పీడింతము.

               వితంతువులను తలనెరసిన ముదుసలులను

               అనాదరము చేయుదము.

11.           మనబలమే మనగొప్ప.

               లోకములో దౌర్బల్యమునకు తావులేదు.

12.          నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకొందము.

               ఉచ్చులుపన్ని అతనిని కూలద్రోయుదము,

               అతనికి మన కార్యములు గిట్టుటలేదు.

               మనము ధర్మశాస్త్రములను, పూర్వాచారములను

               పాించుటలేదని అతడు

               మనలను నిందించుచున్నాడు

13.          తాను దేవుని అనుభవమునకు తెచ్చుకొనెననియు,

               తాను దేవుని బిడ్డడననియు

               అతడు చెప్పుకొనుచున్నాడు.

14.          అతని పోకడలు మన భావములకు

               విరుద్ధముగానున్నవి

               కావున అతనినెంత మాత్రము సహింపరాదు.

15.          అతడు ఇతరుల వింవాడుకాదు.

               వాని చెయిదములు చోద్యముగానున్నవి.

16.          అతని దృష్టిలో మనము చలామణికాని

               నాణెముల విం వారలము.

               మన కార్యములు అశుద్ధమువలె నింద్యములైనవి.

               పుణ్యపురుషులు ఆనందముతో మరణింతురని

               అతని వాదము.

               దేవుడు తనకు తండ్రియని

               అతడు గొప్పలు చెప్పుకొనుచున్నాడు.

17.          అతని పలుకులు యదార్థమేనేమో పరిశీలింతము.

               అతని మరణము ఏ తీరున ఉండునో చూతము.

18.          నీతిమంతుడు దేవుని కుమారుడౌనేని

               దేవుడతని కోపు తీసికొనును.

               శత్రువులబారినుండి అతనిని కాపాడును.  

19.          కనుక అతనిని క్రూరముగా అవమానించి,

               హింసించి, పరీక్షకు గురిచేయుదము.

               అతని శాంత భావమేపాిదో,

               సహనభావమెంతగొప్పదో, పరీక్షించి చూతము.

20.        అతనిని నీచమైన చావునకు గురిచేయుదము.

               దేవుడే తనను రక్షించునని

               అతడు చెప్పుకొనుచున్నాడుకదా!”

               అది ఎంత నిజమో చూతుము.

దుష్టులభావములు తప్పు

21. దుష్టుల భావములు ఇట్లులుండును,

               కాని వారు పొరపాటు చేసిరి.

               వారు తమ దుష్టత్వము వలననే మూర్ఖులైరి.

22.        కాని వారికి దేవుని మర్మములు తెలియవు.

               పవిత్రమును, నిర్మలమైన జీవితమునకు

               బహుమతి కలదనియు వారికి తెలియదు. 

23.        దేవుడు నరుని అమరునిగా చేసెను.

               అతనిని తనవలె అమరునిగా చేసెను.

24.         కాని పిశాచము అసూయవలన     మృత్యువు లోకములోనికి ప్రవేశించెను.

               పిశాచపక్షమును అవలంబించువారు

               చావును చవిజూతురు.