యూదులు శత్రుశిబిరము మీద దాడిచేయుట

14 1. అంతట యూదితు పురజనులను చూచి ”సోదరులారా! నా మాటవినుడు. ఈ శిరస్సును కొనిపోయి నగరప్రాకారముమీద వ్రేలాడదీయుడు.

2. మీరొక నాయకుని ఎన్నుకొనుడు. తెల్లవారగనే మీలో యుద్ధము చేయగలవారందరును ఆయుధములు చేప్టి పట్టణమునుండి కదలిపొండు. మీరు మన నగరమునకు చేరువలోనున్న అస్సిరియా దండుమీద దాడిచేయుటకు పోయినట్లుగా కన్పింపవలెను. కాని మీరు వారి దగ్గరకు మాత్రముపోరాదు.

3. మిమ్ము చూచి అస్సిరియా సైనికులాయుధములు చేప్టి శిబిర మునకు పరిగెత్తుకొనిపోయి తమ సైన్యాధిపతులను లేపుదురు. ఆ సేనాపతులు హోలోఫెర్నెసు గుడార ములకు పరుగెత్తుదురు. కాని అచట అతడు వారి కంటబడడు. అపుడు వారి సైన్యమంత కలవరపడి పారిపోవును. మీరు వారి వెంటబడవచ్చును.

4. మీరును ఇతర యిస్రాయేలీయులును వారిని వెన్నాడి ముక్కలుముక్కలు చేయవచ్చును.

5. కాని మీరు మొదట అమ్మోనీయుడయిన అకియోరును ఇచికి పిలిపింపుడు. హోలోఫెర్నెసు యిస్రాయేలీయులను చులకనచేయుచు మ్లాడెను. అకియోరునుగూడ మనతో చంపదలచి అతడిని ముందుగనే యిచికి పంపెను. అి్టవానిని అకియోరు ఇప్పుడు గుర్తింప గలడేమో చూతము” అనెను.

6. కనుక వారు ఉజ్జీయా ఇంి నుండి అకియోరును పిలిపించిరి. అతడు వచ్చి అచట గుమి గూడియున్నవారిలో ఒకనిచేత వ్రేలాడు హోలోఫెర్నెసు శిరస్సును చూచి అక్కడికక్కడే మూర్ఛపోయి నేల కొరిగెను.

7.  జనులు అతనిని పైకిలేవనెత్తిరి. అకియోరు యూదితు పాదముల మీదవ్రాలి ఆమెకు నమస్కారము చేసి:

               ”యూదియాలోని ప్రతి కుటుంబము

               నిన్ను దీవించునుగాక!

               నీ పేరు విని ప్రతిజాతియు

               గడగడ వణకునుగాక!”

అని పలికెను.

8. మరియు అతడు ఈ గడచిన దిన ములలో నీవేమేమి చేసితివో మాకు తెలుపుము అని యూదితునడిగెను. ప్రజలెల్లరును వినుచుండగ యూదితు తాను బెతూలియా నుండి వెడలిపోయిన నాినుండి ఇప్పి వరకు నిర్వహించిన కార్యముల నెల్ల పూసగ్రుచ్చినట్లు వివరించి చెప్పెను.

9. ఆమె తన కథను ముగింపగా ప్రజలెల్లరు హర్షధ్వానములు చేసిరి. నగరము వారి ఉత్సాహధ్వనులతో మారు మ్రోగెను.

10. అకియోరు యిస్రాయేలు దేవుడు చేసిన మహాకార్యములెల్ల చూచి ఆ ప్రభువును విశ్వసించెను. అతడు సున్నతిని పొంది యిస్రాయేలు సమాజమున చేరెను. అతని వంశజులు నేికిని యూదులుగనే జీవించుచున్నారు.

11. మరునాి ఉదయము యిస్రాయేలీయులు హోలోఫెర్నెసు శిరస్సును నగరప్రాకారమునకు వ్రేలాడ గ్టిరి. వారెల్లరు ఆయుధములు చేప్టి గుంపులు గుంపులుగా క్రింది లోయలోనికి దిగిరి.

12. వారిని చూచి అస్సిరియా సైనికులు తమ నాయకులకు వార్త పంపిరి. ఆ నాయకులు సైన్యాధిపతులకు సమాచార మందజేసిరి.

13. ఆ సైన్యాధిపతులు హోలోఫెర్నెసు గుడారమునకు వెళ్ళి బగోవాసుతో ”దొరను నిద్ర లేపుము. ఆ యిస్రాయేలు బానిసలకు కొమ్ములు వచ్చి నవి. వారు మనమీదికే దాడి చేసిరి. అసలు వారికి పోగాలమువచ్చినది”అని చెప్పిరి.

14. బగోవాసు గుడారములోని శయనాగారపు తెర ముందట నిలు చుండి చప్పట్లుక్టొి  శబ్దము  చేసెను.  అతడు హోలోఫెర్నెసు ఇంకను యూదితుతో నిద్రించుచు ఉండెననుకొనెను.  

15. కానియెంత సేపికిని లోపలినుండి జవాబు రాకుండుటచే తెరను ప్రక్కకు లాగి లోపలికి వెళ్ళెను. అచట హోలోఫెర్నెసు మొండెము మంచము క్రింద పాదపీఠముమీద పడియుండెను.

16. ఆ దృశ్యమును చూచి బగోవాసు గావుకేకలు పెట్టెను. దుఃఖముతో వెక్కివెక్కి యేడ్చుచు బట్టలు చించుకొనెను.

17. అతడు యూదితు గుడారముకు వెళ్ళి చూడగా ఆమె కన్పింప దయ్యెను. అంతట అతడు హోలోఫెర్నెసు సైన్యాధి పతుల యొద్దకు వచ్చి, 18. ”ఆ బానిసతొత్తులు మనలను వంచించిరి. ఒక హీబ్రూ ఆడుది నెబుకద్నెసరు సామ్రా జ్యము అంతికిని తలవంపులు తెచ్చినది. హోలోఫెర్నెసు మొండెము నేలమీద పడియున్నది. తలలేదు”  అని అరచెను.

19.ఆ మాటలు విని సేనాపతులు విచార ముతో బట్టలుచించుకొనిరి. వారి శిబిరమున కల వరము పుట్టగా వెఱ్ఱియేడ్పులు హాహారావములు విన్పించెను.