5 1.         ఆ రోజున పుణ్యపురుషుడు

                              ధైర్యముగా లేచి నిలుచుండును.

                              పూర్వము తనను హింసించి,

                              తన బాధను అనాదరము చేసినవారిని

                              అతడు ఎదుర్కొనును.

2.           ఆ దుర్మార్గులు అతనిని చూచి

               భయముతో కంపింతురు.

               తాము ఊహింపని రీతిగా అతడికి

               భద్రత లభించినందుకు ఆశ్యర్యము చెందుదురు.

3. వారు తాము చేసిన దుష్టకార్యమునకుగాను

               పశ్చాత్తాపపడి, బాధతో మూలుగుచు,

               ఒకరితోనొకరిట్లు  చెప్పుకొందురు: 

4. ”పూర్వము మనము ఇతడిని చూచి నవ్వితిమి,

               గేలిచేసితిమి. కాని మనమే పిచ్చివారలము.

               ఇతనిది వ్టి వెఱ్ఱి జీవితము అనుకొింమి.

               ఇతడు నికృష్టమైన చావు చచ్చెననుకొింమి.

5.           కాని ఎందుకు ఇప్పుడితడు

               దేవుని పుత్రుడుగా గణింపబడుచున్నాడు?

               ఎందుకు ప్రభువు భక్తుడుగా

               లెక్కింపబడుచున్నాడు? 

6.           కాని మనము సత్యమార్గమునుండి

               వైదొలగితిమి.

               ధర్మజ్యోతి మనమీద ప్రకాశింపనేలేదు.

               నీతిసూర్యుని పొడుపును మనమసలు దర్శింపనేలేదు

7.            మనము నడచినవి దుష్టమార్గములు,

               వినాశ పథములు.

               త్రోవలులేని ఎడారులందెల్ల తిరుగాడితిమి.

               కాని దైవమార్గమును మాత్రము విస్మరించితిమి.

8.           మన అహంకారము వలన ప్రయోజనమేమి?

               మన సంపదలవలనను,

               దర్పమువలనను మనకొరిగినదేమి?

9.           ”అవియెల్ల ఇపుడు నీడలవలె గతించినవి.

               వదంతులవలె దాిపోయినవి.

10.         అలలు చెలరేగిన సముద్రముగుండ

               ఓడ సాగిపోవుటవలె అది వెడలిపోయిన

               పిదపగాని దాని జాడతెలియరాదు.

11.           పక్షి గాలిలో ఎగురునట్లు అది తన రెక్కలతో

               తేలికయైన గాలిని దబదబ బాదును.

               ఆ గాలిని పాయలుగా చీల్చివేసి వేగముగల

               రెక్కలతో ముందునకు దూసికొనిపోవును.

               అది వెడలిపోయిన తరువాత

               దాని జాడ తెలియరాదు.

12.          లక్ష్యమును గురిచూచి బాణము వేయుదుము,

               అమ్ము వెడలుటకు తావిచ్చిన గాలి

               తిరిగి కలిసికొనును.

               అటు పిమ్మట ఆ బాణము

               ఏ మార్గమున పోయెనో చెప్పజాలము.

13.          మన సంగతియు ఇంతియే.

               మనము పుట్టగనే చచ్చితిమి.

               మనము చేసిన పుణ్యకార్యములేమియు లేవు.

               మన దుష్టత్వమే మనలను నాశనము చేసినది”.

14.          దుష్టుల ఆశ గాలితగిలిన పొట్టువలె ఎగిరిపోవును

               సముద్రపు నురగవలె చెదరిపోవును.

               పొగవలె తేలిపోవును.

               ఒక్కరోజు మాత్రము ఉండి వెళ్ళిపోయిన

               అతిథినిగూర్చిన స్మరణమువలె మాసిపోవును.

15.          కాని పుణ్యపురుషులు మాత్రము

               శాశ్వతముగా జీవింతురు.

               ప్రభువు వారిని బహూకరించును,

               మహోన్నతుడు వారిని కాపాడును.

16.          ప్రభువు వారికి రాజవైభవములు

               అబ్బునట్లు చేయును.

               సుందరములైన కిరీటములను ఒసగును.

               తన దక్షిణ హస్తముతో వారిని కాపాడును.               తన బాహుబలముతో సంరక్షించును.

17.          ప్రభువు తన దృఢనిశ్చయమునే

               కవచముగా ధరించి,

               ఈ సృష్టిని ఆయుధముగా తాల్చి,

               తన శత్రువులతో యుద్ధమునకు పోవును.

18.          అతడు తన ధర్మమును వక్షస్త్రాణముగాను,

               తీర్పును శిరస్త్రాణముగాను ధరించును.

19.          తన పావిత్య్రమును గెలువరాని డాలుగాను ధరించి

               కఠోరకోపమును ఖడ్గముగా నూరుకొనును.

20.        ప్రకృతిశక్తులన్నియు ప్రభువుతో వెడలివచ్చి,

               ఆయనను ఎదిరింపబూనిన 

               సాహసికులతో పోరాడును.

21.          అతడు మేఘములనెడు ధనుస్సునెక్కుప్టిె,

               బాణములను గుప్పించుచున్నాడో అన్నట్లు

               మెరుపులు వచ్చి దుష్టులను తాకును.

22.        వడిసెలనుండి వచ్చిన రాళ్ళవలె

               వడగండ్లు వారిమీదికి ఉగ్రముగా దిగివచ్చును.

               సముద్రము వారిమీదికి పొంగిపారును.

               నదులు వారిని నిర్దయతో ముంచివేయును.

23.         పెనుగాలివాన వీచి వారిని పొట్టువలెనెగరగొట్టును

               అధర్మవర్తనము

               ప్రపంచమునంతిని తుడిచిపెట్టును.

               దుష్టవర్తనము రాజులను

               సింహాసనము మీదినుండి కూలద్రోయును.