7 1.         కుమారా! నా పలుకులాలింపుము.

                              నా ఉపదేశమును నిధినివలె

                              భద్రపరచుకొనుము.

2. నా సూక్తులను పాింతువేని

               నీకు జీవనము అబ్బును.

               నా బోధను కింపాపనువలె

               జాగ్రత్తగా చూచుకొనుము.

3.           ఈ ఉపదేశములను

               నీ ముందట ఉంచుకొనుము.

               నీ హృదయ ఫలకముపై లిఖించుకొనుము.   

4.           విజ్ఞానమును నీ సోదరినిగను,

               తెలివిని నీ చెలికత్తెనుగను భావింపుము.

5.           జ్ఞానము నిన్ను పరస్త్రీలనుండి కాపాడును.

               వారి మోసపు మాటలనుండి నిన్ను రక్షించును.

వ్యభిచారిణి

6.           నేను మా ఇంి గవాక్షమునుండి

               వీధివైపు పారజూడగా

7.            అచట లోకజ్ఞానములేని

               యువకులనేకులు కన్పించిరి.

               వారిలో ఒకనికి బుద్ధి యిసుమంతయును లేదు.

8.           అతడు వీధివెంట బోవుచు ఆ మలుపున వసించు ఒకానొక వనిత ఇంి దగ్గరికి వచ్చెను.

9.           అది సందెవేళ,  రేయి  చిమ్మచీకట్లు క్రమ్మినవి.

10.         ఆ కాంత అతనిని కలిసికొనినది.

               ఆమె వేశ్యవలె దుస్తులు ధరించి

               పన్నుగడలతో వచ్చినది.

11.           ఆమెకు సాహసము మెండు, సిగ్గులేదు,

               ఇంిలో కాలు నిలువదు.

12.          వీధిలోను, రచ్చపట్టునను తిరుగాడుచు,

               మూలమూలను విటులకొరకు గాలించుచుండును

13.          ఆ ఉవిద అతనిని కౌగిలించుకొని ముద్దాడెను. సిగ్గుమాలిన ముఖముతో

               అతనివైపు చూచి ఇట్లనెను:

14.          ”నేను నేడు బలియర్పించి

               వ్రతములను చెల్లించితిని.

15.          ఇప్పుడు వెలుపలికి వచ్చి నీ కొరకు గాలించితిని. నేను నిన్ను వెదకరాగా నీవు నా కంటబడితివి.

16.          ఐగుప్తునుండి కొనివచ్చిన చిత్రవర్ణ వస్త్రములతో

               శయ్యనలంకరించితిని.

17.          సుగంధతైలములను చిలుకరింపగా

               పడక సువాసనలు గుబాళించుచున్నవి.

18.          కావున రమ్ము, మనము వేకువవరకు

               ప్రేమ జలధిలో మునిగితేలుదము.

               తృప్తిదీర సుఖము ననుభవింతము.

19.          మగడు ఇంట లేడు

               దూరదేశమునకు వెడలిపోయెను. 

20.        రూకల సంచులుగూడ తీసికొనిపోయెను.

               కనుక పున్నమివరకు తిరిగిరాడు.”

21.          ఆ రీతిగా ఆమె అతనిని ప్రలోభపెట్టెను.

               వలపుమాటలతో అతనిని లోపరచుకొనెను.

22.        ఇకనేమి, కోడె వధ్యస్థానమునకు పోయినట్లు, లేడి ఉచ్చులలో తగుల్కొనబోయినట్లు

               అతడు ఆ ఉవిద వెంటపోయెను.

23.        పక్షి ఉరివద్దకు త్వరపడునట్లు

               తన ప్రాణమును హరించునని తెలియక

               తన గుండెను అంబు చీల్చువరకు

               అతడు దానిననుసరించును

24.         కనుక కుమారా! నా పలుకులు ఆలింపుము. నామాటలను శ్రద్ధగా వినుము.

25.        నీ హృదయమును అి్ట వనితకు అర్పింపవలదు

               నీవామె వెంటపోవలదు.

26.        ఆ కాంత చాలమందికి ముప్పుతెచ్చును.

               ఆమె చేతచిక్కి చచ్చిన వారనేకులు కలరు.   

27.         ఆమె ఇంికి పోవుటయనగా

               పాతాళలోకమునకు పోవుటయే.

               మృత్యుద్వారము చేరుకొనుటయే.