ప్రవక్త జీవితమే ఒక సంకేతము

16 1. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు విన్పించెను.

2. నీవిచట పెండ్లియాడవలదు. పిల్లలను కనవలదు.

3. ఇచట ప్టుిన పిల్లలకును, వారి తల్లిదండ్రులకును ఎి్ట గతిపట్టునో చెప్పెదను వినుము.

4. వారు ఘోరవ్యాధులతో చత్తురు. వారి కొరకు ఎవరును విలపింపరు. వారిని ఎవరును పాతిపెట్టరు. వారి పీనుగులు నేలపై ఎరువువలె కుప్పలుగా పడియుండును. వారు ఆకలివలనను, యుద్ధము వలనను చత్తురు. పకక్షులు, వన్యమృగములు వారి శవములను తినివేయును.

5. నీవు ప్రజలు శోకించు ఇంిలోనికి పోవలదు. ఎవరికొరకును విలపింపవలదు. నేను ఈ ప్రజలను దీవింపను. వారికి నా ప్రేమను, కరుణను చూపింపను.

6. ఈ దేశమున సంపన్నులు, పేదలుకూడ చత్తురు. ఎవరును వారిని పాతిపెట్టరు, వారి కొరకు శోకింపరు. వారిపట్ల సంతాపము చూపుటకుగాను ఎవరును తమ శరీరములకు గాయము చేసికొనరు, తమ తలలు గొరిగించుకొనరు.

7. బంధువులను కోల్పోయిన వారికి ఎవరును అన్నపానీయములు ఈయరు. తల్లి దండ్రులను కోల్పోయిన వారిపట్లగూడ ఎవరును సంతాపము చూపరు. 

8. నీవు ప్రజలు ఉత్సవము చేసికొను ఇంిలోనికి వెళ్ళవలదు. వారితోకలిసి అన్నపానీయములు సేవింప వలదు.

9. యిస్రాయేలు దేవుడను, సైన్యములకు అధి పతియు ప్రభుడనైన నా పలుకులు ఆలింపుము. నేను ప్రజల ఆనందనాదములను, వివాహోత్సవములలో వధూవరులనోట విన్పించు సంతోషధ్వానములను అణచి వేయుదును. ఇచి ప్రజలు బ్రతికిఉండగనే ఈ కార్యము జరుగును.

10. నీవు ఈ సంగతు లన్నియు ప్రజలతో చెప్పగా వారు ‘ప్రభువు మమ్మింత క్రూరముగా దండింపనేల? మేమేమి తప్పుచేసితిమి? మా దేవుడైన ప్రభువునకు ద్రోహముగా ఏమి పాపము చేసితిమి?’ అని నిన్ను అడుగుదురు.

11. అప్పుడు నీవు నా మాటగా వారితో ఇట్లు చెప్పుము: మీ పితరులు నన్ను విడనాడి అన్యదైవములను కొలిచిరి. వానిని సేవించిపూజించిరి. వారు నన్ను త్యజించి నా ఆజ్ఞలను పాింపరైరి.

12. మీరు మీ పూర్వులకంటెను దుష్టులైతిరి. మీలో ప్రతివాడును తన మొండి హృదయము, తన దుష్టహృదయము చెప్పినట్లుగా చేసి, నా మాట పెడచెవిన పెట్టెను.

13. కనుక నేను మిమ్ము ఈ దేశమునుండి గిెంవేయుదును. మీకు గాని, మీ పితరులకు గాని తెలియని పరదేశమునకు మిమ్ము పంపివేయుదును. అచట మీరు రేయింబ వళ్ళు అన్యదైవములనే పూజింతురు. నేను మీ మీద ఎంత మాత్రము దయచూపను.

యిస్రాయేలీయులు

ప్రవాసము నుండి తిరిగివచ్చుట

14. ప్రభువు ఇట్లనుచున్నాడు: నేను ఆ జనులను పూర్వము వారి పితరులకిచ్చిన నేలకే మరల తోడ్కొని వత్తును. కనుక రాబోవుదినములలో నా ప్రజలు ‘యిస్రాయేలును ఐగుప్తునుండి తోడ్కొని వచ్చిన సజీవుడైన ప్రభువు పేరు మీదుగా మేము ప్రమాణము చేయు చున్నాము’ అని చెప్పరు.

15. ‘యిస్రాయేలును ఉత్తరదేశము నుండియు, వారు చెల్లాచెదరైన అన్యదేశ ముల నుండియు తోడ్కొనివచ్చిన యావే జీవము తోడని ప్రమాణము చేయుచున్నాము’ అని వారు పలుకుదురు. ఇది ప్రభుడనైన నా వాక్కు.

రానున్న శిక్ష

16. ప్రభువు ఇట్లనుచున్నాడు: నేను జాలరులను చాలమందిని పిలిపింతును. వారు ఈ ప్రజలను చేపలనుప్టినట్టు పట్టుకొందురు. అటుపిమ్మట చాల మంది వేటగాండ్రను ప్రతిపర్వతముమీదను, గుట్ట మీదను, ప్రతి గుహలోను యీ ప్రజలను వేాడుటకై పిలిపింతును.

17. ఏలయన, నేను ఈ జనులు చేయుపనులెల్ల చూచుచునేయున్నాను. నాకు మరుగై యుండునది ఏదియులేదు. వారి పాపములు నాకు కన్పింపకపోవు.

18. వారు పీనుగుల విం విగ్రహ ములతో నా దేశమును అపవిత్రము చేసిరి. హేయ మైన ప్రతిమలతో దానిని నింపివేసిరి.” కనుక నేను వారు తమ పాపములకును, దుష్కార్యములకును రెండంతలు శిక్ష అనుభవించునట్లు చేయుదును.

జాతులు పరివర్తన చెందుట

19.          ప్రభూ! నీవు నాకు బలము ఒసగువాడవు,

               నాకు ఆశ్రయణీయుడవు,

               ఆపదలలో నన్ను ఆదుకొనువాడవు.

               నేల నాలుగుచెరగులనుండి జాతులు నీ వద్దకు వచ్చి

               ”మా పితరులు నిరర్థకదైవములను కొలిచిరి,

               నిష్ప్రయోజకములైన విగ్రహములను సేవించిరి.

20.        నరుడు తన దైవములను తానే చేసికొనునా?

               చేసికొనినచో, అవి దైవములే కావు”

               అని పలుకును.

21.          ప్రభువు ఇట్లనుచున్నాడు:

               నేను నా బలమును, నా మహత్తును జాతులు

               ఖండితముగా గ్రహించునట్లు చేయుదును.

               వారు నన్ను ప్రభునిగా గుర్తించునట్లు చేయుదును.