రఫాయేలు
12 1. వివాహఉత్సవము ముగిసిన తరువాత తోబీతు కుమారుని పిలిచి ”నాయనా! నీ స్నేహితునికి వేతనము చెల్లింపవలెనుగదా! అతనికి మనమొప్పు కొనిన దానికంటే ఎక్కువగానే సొమ్ము చెల్లింపుము” అని చెప్పెను.
2. కుమారుడు తండ్రితో ”నాయనా! నన్ను ఇతనికి ఎంత చెల్లింపుమందువు? మేము తెచ్చిన సొత్తులో సగము ఇతనికిచ్చినను నష్టములేదు.
3. ఇతడు నన్ను సురక్షితముగా నీ చెంతకు కొనివచ్చెను. గబాయేలు వద్దకు వెళ్ళి మన సొమ్మును తీసికొని వచ్చెను. నా భార్యకు భూతవిముక్తి, నీకు రోగవిముక్తి కలిగించెను. ఈ ఉపకారములు అన్నికిగాను ఇతనికి ఎంత సొమ్ము చెల్లింపమందువు?” అని అడిగెను.
4. తోబీతు ”అతడు కొనివచ్చిన సొత్తులో సగము పంచియిమ్ము. అతడు అంత వేతనమునకు అర్హుడు” అని చెప్పెను.
5. కనుక తోబియా రఫాయేలును పిలిచి ”నేస్తమా! నీవు తీసికొనివచ్చిన డబ్బులో సగము పుచ్చు కొనుము. నీవు నాకు చేసిన మేలుకు ఇది బహు మానము. ఇక క్షేమముగా మీ ఇంికి పొమ్ము” అని చెప్పెను.
6. అప్పుడు రఫాయేలు ఆ తండ్రి కొడుకులను ప్రక్కకు పిలిచి వారితో ఇట్లనెను: ”మీరు ప్రభువును స్తుతింపుడు. అతడు మీకు చేసిన ఉపకారములను ఎల్లరికిని విదితము చేయుడు. అప్పుడు ఇతరులు కూడ ఆ ప్రభువును సన్నుతించి కీర్తింతురు. ప్రభువు చేసిన ఉపకారములను ఎల్లరికిని తెలియజేయుడు. మీరు ఎన్నడు అతనిని స్తుతించుట మానవలదు.
7.రాజును గూర్చిన రహస్యమును ఎవరికి చెప్ప కుండుట మేలు. కాని దేవుడు చేసిన మేలును ఎల్లరికి ప్రకించుట మంచిది. అప్పుడు అందరు ఆయనను గౌరవింతురు. మీరు మంచిచేయుదురేని మీక్టిె కీడును కలుగదు.
8. ధనమును కూడబెట్టుకొని దుష్ట జీవితము జీవించుటకంటె చిత్తశుద్ధితో ప్రార్ధనచేయుట, మంచి జీవితమును గడుపుచు దానధర్మములు చేయుట మెరుగు. బంగారమును కూడబెట్టుకొనుటకంటెను, దానముచేయుట మేలు.
9. దానము మిమ్ము మృత్యువునుండి కాపాడును. మీ పాపములనెల్ల కడిగి వేయును. దానము చేయువారు దీర్ఘాయుష్మంతులు అగుదురు.
10. పాపపు పనులను, దుష్కార్యములను చేయువారు తమకుతామే కీడుతెచ్చుకొందురు.
11. రాజును గూర్చిన రహస్యమును గుప్తముగా నుంచవలెననియు, దేవుడుచేసిన మేలులను ఎల్లరికిని ప్రకింపవలెననియు నేను ముందుగనే చెప్పితిని. ఇప్పుడు ఏమియు దాచక మీకు పూర్ణసత్యమును తెలియజేసెదను.
12. తోబీతు! నీవు, సారా ప్రార్ధనము చేసినపుడు మీ మనవులను నేను దేవుని దివ్యసన్నిధిలో అర్పించితిని. నీవు చచ్చినవారిని పాతిప్టిెనపుడును నేనట్లే చేసితిని.
13. నీవు భోజనమునకు కూర్చుండి ఆహారము తినకయే లేచిపోయి శవమును పాతిప్టిె వచ్చినపుడు ప్రభువు నీ విశ్వాసమును పరీక్షించుటకు నన్ను పంపెను. మరియు నీకు ఆరోగ్యదానము చేయుటకును, నీ కోడలు సారాను పిశాచ పీడనము నుండి విడిపించుటకును దేవుడు నన్ను పంపెను.
15. నేను దేవుని దివ్యసన్నిధిలో నిలిచి అతనికి సేవలు చేయుటకు సిద్ధముగా నుండు ఏడుగురు దేవదూత లలో ఒకడైన రఫాయేలును.”
16. ఆ పలుకులు విని ఆ తండ్రి కొడుకులు భయకంపితులై గడగడ వణకుచు నేలమీద బోరగిల బడిరి.
17. కాని దేవదూత వారితో ”మీరు భయపడ కుడు. మీక్టిె కీడు కలుగదు. ప్రభువును సదా కీర్తింపుడు.
18. నాయంతట నేను మీయొద్దకు రాలేదు. మీకు తోడ్పడుటకు ప్రభువే నన్ను మీ చెంతకు పంపెను. కనుక మీ జీవితకాలమంతయు ఆ ప్రభువును కీర్తింపుడు.
19. మీకు నేను భోజనము చేయుచున్నట్లే కన్పించితిని. మీ దృష్టికి అటుల కనిపించితినేగాని నేను యథార్ధముగా భోజనము చేయలేదు.
20. మీరు ఈ భూమి మీద ప్రభువును స్తుతించి కీర్తింపుడు. ఇపుడు నేను నన్ను పంపిన దేవునిచెంతకు వెళ్ళవలెను. మీకు జరిగిన సంఘటనలన్నిని పుస్తకమున వ్రాసి ఉంచుకొనుడు” అని చెప్పెను.
21. ఇట్లుచెప్పి దేవదూత ఆకసమునకు ఎగసెను. తోబీతు, తోబియా నేలమీదనుండి లేచి నిలుచుండిరి. కాని అతడు వారికి మరల కన్పింపలేదు.
22. వారు కీర్తనలతో దేవుని స్తుతించిరి. దేవదూత తమచెంత నున్నపుడు ఆ ప్రభువు తమకు చేసిన అద్భుత కార్యములకుగాను అతనిని కీర్తించిరి.