ఆదాము వంశీయులు

1. ఆదాము వంశీయుల వృత్తాంతము ఇది. దేవుడు ఆదాము1ను సృష్టించినప్పుడు అతనిని తనను పోలినవానిగా చేసెను.

2. వారిని స్త్రీ పురుషులనుగా చేసెను. వారిని సృష్టించినప్పుడే ఆశీర్వదించి వారికి ”నరుడు” అను పేరు పెట్టెను.

3. ఆదాము నూటముప్పది యేండ్ల వయస్సున తన పోలికయున్న రూపముగల కుమారుని కని అతనికి షేతు అను పేరుపెట్టెను.

4. షేతు ప్టుిన తరువాత ఆదాము ఎనిమిదివందలయేండ్లు బ్రతికెను. అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు కలిగిరి. 5. అతడు తొమ్మిదివందలముప్పది యేండ్లు బ్రతికి చనిపోయెను.

6-7. ఎనోషు ప్టుినపుడు షేతు వయసు నూట ఐదేండ్లు. తరువాత అతడు ఎనిమిదివందల యేడేండ్లు జీవించి కుమారులను, కుమార్తెలను కనెను.

8. షేతు తొమ్మిదివందల పండ్రెండేండ్లు బ్రతికి చనిపోయెను.          

9-10. కేనాను ప్టుినప్పుడు ఎనోషు తొంబది యేండ్లవాడు. తరువాత ఎనోషు ఎనిమిదివందల పదునైదేండ్లు జీవించి, కుమారులను కుమార్తెలను కనెను.

11. అతడు తొమ్మిదివందల ఐదేండ్లు బ్రతికి చనిపోయెను.

12-13. మహలలేలు ప్టుినపుడు కేనాను వయస్సు డెబ్బదియేండ్లు. అతడు ప్టుిన తరువాత కేనాను ఎనిమిదివందల నలువదియేండ్లు జీవించి కుమారులను కుమార్తెలను కనెను.

14. అతడు తొమ్మిదివందల పదియేండ్లు బ్రతికి చనిపోయెను.

15-16. మహలలేలు అరువది అయిదు యేండ్లప్పుడు యెరెదును కనెను. తరువాత అతడు ఎనిమిదివందల ముప్పదియేండ్లు జీవించి, కుమారు లను కుమార్తెలను కనెను.

17. మహలలేలు ఎనిమిది వందల తొంబదిఅయిదేండ్లు బ్రతికి చనిపోయెను.

18. యెరెదు నూటఅరువది రెండేండ్లప్పుడు హనోకును కనెను.

19. పిదప ఎనిమిదివందల యేండ్లు జీవించి, కుమారులను కుమార్తెలను కనెను.

20. యెరెదు తొమ్మిదివందల అరువదిరెండేండ్లు బ్రతికి చనిపోయెను.

21-22. హనోకు అరువది అయిదేండ్లప్పుడు మెతూషెలాను కనెను. మెతూషెలా ప్టుిన తరువాత హనోకు మూడువందల యేండ్లు దేవునితో నడచుచూ కుమారులను, కుమార్తెలను కనెను.

23. అతడు మూడువందల అరువదిఅయిదేండ్లు బ్రతికెను. 

24. హనోకు దేవునకు సహచరుడై జీవించెను. ఆ తరువాత జనులు అతనిని చూడలేదు. దేవుడు హనోకును కొనిపోయెను.

25. మెతూషెలా నూటయెనుబది యేడేండ్లు అప్పుడు లెమెకును కనెను.

26. లెమెకు ప్టుిన తరువాత అతడు ఏడువందల ఎనుబదిరెండేండ్లు జీవించి కుమారులను కుమార్తెలను కనెను.

27. మెతూషెలా తొమ్మిదివందల అరువది తొమ్మిదేండ్లు బ్రతికి చనిపోయెను.

28. లెమెకు నూటయెనుబది రెండేండ్లు బ్రతికి  ఒక కొడుకును కనెను.

29. ”దేవుడు ఈ భూమిని శపించెను. కావున ఎడతెగని పని, వ్టెిచాకిరి మా పాలివాయెను. ఈ బాలుడు వీినుండి మమ్ము ఓదార్చి ఉపశమింపచేయును” అని తలంచి లెమెకు తన కుమారునకు నోవా1 అని పేరు పెట్టెను.

30. నోవా ప్టుిన తరువాత లెమెకు ఐదువందల తొంబది యైదేండ్లు వచ్చువరకు కుమారులను కుమార్తెలను కనెను.

31. లెమెకు ఏడువందల డెబ్బది యేడేండ్లు బ్రతికి చనిపోయెను.

32. నోవా ఐదువందల యేండ్లు జీవించి షేము, హాము, యాఫెతులను కనెను.

Previous                                                                                                                                                                                               Next                                                                                     

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము