రాళ్ళమీద శాసనములను లిఖింపవలయును

27 1. మోషే పెద్దలతోకూడి యిస్రాయేలు ప్రజలనిట్లు ఆజ్ఞాపించెను: ”నేడు నేను మీకు విధించిన ఆజ్ఞలన్నిని చేకొనుడు.

2. మీరు యోర్దాను దాి యావే మీకీయనున్న నేలను చేరుకొనినపిదప అచట పెద్దరాళ్ళు పాతి, సున్నము పూయుడు.

3. వాని మీద ఈ ధర్మశాస్త్రనియమములన్నిని వ్రాయుడు. ప్రభువు మీ పితరులకు వాగ్ధానము చేసిన ఆ పాలు తేనెలు జాలువారునేలను చేరుకొనగనే ఈ కార్యము నిర్వహింపుడు.

4. మీరు యోర్దాను దాటగనే నేను ఆజ్ఞాపించినట్లు ఏబాలు కొండపైన ఈ రాళ్ళుపాతి వానికి సున్నము పూయుడు.

5. తరువాత అక్కడ ఇనుపపనిముట్లు తాకని కరకురాళ్ళతో, యావేకు బలిపీఠమును నిర్మింపుడు.

6. చెక్కని ఆ కరకురాళ్ళతో యావేకు బలిపీఠము నిర్మించి దానిమీద దహన బలు లను అర్పింపుడు.

7. అచటనే సమాధానబలులుకూడ సమర్పించి ఆ నైవేద్యములను ప్రభువు ఎదుట సంతోష ముతో ఆరగింపుడు.

8. సున్నముక్టొిన ఆ రాళ్ళమీద మాత్రము ఈ దైవశాసనములన్నిని స్పష్టముగా లిఖింపుడు”.

9. అటుతరువాత మోషే లేవీయ యాజకులతో కలసి ప్రజలతో ఇట్లనెను: ”యిస్రాయేలీయులారా! మీరు నా పలుకులెల్ల సావధానముగా వినుడు. నేడు  మీరు మీ ప్రభువైన యావేకు చెందిన ప్రజలైతిరి.

10. నేడు నేను మీకు విధించిన కట్టడలను ఆజ్ఞలన్నిని పాించి ఆ ప్రభువునకు విధేయులు కండు.”

అవిధేయులకు శాపము

11-12. ఆ దినమందే మోషే ప్రజలకు ఇట్లు ఆజ్ఞాపించెను: ”మీరు యోర్దాను దాిన తరువాత షిమ్యోను, లేవి, యూదా, యిస్సాఖారు, యోసేపు, బెన్యామీను తెగలవారు గెరిసీము కొండమీద నిలు చుండియుండగా యిస్రాయేలుప్రజ దీవింపబడును.

13. మరియు రూబేను, గాదు, ఆషేరు, సెబూలూను, దాను, నఫ్తాలి తెగలవారు ఏబాలు కొండమీద నిలు చుండియుండగా యిస్రాయేలుప్రజ శపింపబడును.

14. లేవీయులు ఈ క్రింది శాపవచనములు పెద్దగా ఉచ్చరింతురు:

15. ‘కొయ్యతోగాని, రాతితోగాని, లోహముతో గాని విగ్రహమునుచేసి దానిని రహస్యముగా ఆరాధించు వాడు శాపగ్రస్తుడు. ప్రభువు విగ్రహారాధనను అసహ్యించు కొనును. అప్పుడు ప్రజలందరు ‘ఆమెన్‌’ అని జవాబు చెప్పవలయును.

16. ‘తల్లిదండ్రులను గౌరవింపనివాడు శాప గ్రస్తుడు.’ ప్రజలందరు ‘ఆమెన్‌’ అని జవాబు చెప్ప వలయును.

17. ‘పొరుగువాని పొలమునందలి సరిహద్దు గట్టురాతిని తొలగించువాడు శాపగ్రస్తుడు.’ ప్రజ లందరు ‘ఆమెన్‌’ అని జవాబు చెప్పవలయును.      

18. ‘గ్రుడ్డివానిని అపమార్గము ప్టించువాడు శాపగ్రస్తుడు.’ ప్రజలందరు ‘ఆమెన్‌’ అని జవాబు చెప్పవలయును.

19. ‘పరదేశుల, అనాధల, వితంతువుల హక్కు లను భంగపరచువాడు శాపగ్రస్తుడు.’ ప్రజలందరు ‘ఆమెన్‌’ అని బదులు చెప్పవలయును.

20. తండ్రిభార్యను కూడినవాడు శాపగ్రస్తుడు. ఏలయన అతడు తండ్రి హక్కును భంగపరిచినవాడు. ప్రజలందరు ‘ఆమెన్‌’ అని జవాబు చెప్పవలయును.     

21. ‘జంతువులను కూడువాడు శాపగ్రస్తుడు.’ ప్రజలందరు ‘ఆమెన్‌’ అని బదులు చెప్పవలయును.

22. ‘తన సహోదరితో అనగ, తన తండ్రి కుమార్తెతోగాని, తల్లికుమార్తెతోగాని కూడువాడు శాపగ్రస్తుడు.’ ప్రజలందరు ‘ఆమెన్‌’ అని బదులు చెప్పవలయును.

23. ‘అత్తను కూడువాడు శాపగ్రస్తుడు.’ ప్రజ లందరు ‘ఆమెన్‌’ అని బదులు చెప్పవలయును.     

24. ‘చాటుగా పొరుగువానిని దెబ్బతీయువాడు శాపగ్రస్తుడు.’ ప్రజలందరు ‘ఆమెన్‌’ అని బదులు చెప్పవలయును.

25. ‘నిరపరాధికి ప్రాణహాని చేయుటకు లంచము తీసికొనువాడు  శాపగ్రస్తుడు.’ ప్రజలందరు ‘ఆమెన్‌’ అని చెప్పవలయును.

26. ‘ఈ విధికి సంబంధించిన నియమములను గైకొని పాింపనివాడు శాపగ్రస్తుడు.’ ప్రజలెల్లరు ‘ఆమెన్‌’ అని బదులు చెప్పవలయును.”

 Previous                                                                                                                                                                                                    Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము