పాపమునకు మరణము – క్రీస్తుతో జీవము

6 1. కనుక మనము ఏమి చెప్పుదము? దైవాను గ్రహము అధికము అగుటకుగాను మనము పాపమున జీవింపవలెనని చెప్పుదమా?

2. ఎన్నికిని కాదు! పాపము విషయమున మనము మరణించితిమి కదా! మరి పాపములో ఇంకను ఎట్లు జీవింపగలము?

3. మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞాన స్నానము పొందినపుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానము పొందితిమని మీకు తెలియదా?

4. కనుక, మన జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధిచేయబడి ఆయన మరణమున పాలు పంచు కొంటిమి. ఏలయన, తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే, మనమును ఒక క్రొత్త జీవితమును గడుపుటకే అట్లు జరిగెను.

5. ఆయన మరణములో మనము ఆయనతో ఏకమైయుండినచో, ఆయన పునరుత్థానములో కూడ మనము తప్పక ఆయనతో ఏకమైయుందుము.

6. పాపపు శరీరము నశించి మనము ఇక పాపమునకు బానిసలు కాకుండునట్లు, మన పాతస్వభావము ఆయనతో సిలువపై చంపబడినది అని మనకు తెలి యును.

7. ఏలయన, మరణించినవాడు పాపము నుండి విముక్తుడాయెను.

8. మనము క్రీస్తుతో మరణించియున్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము.

9. ఏలయన, మరణమునుండి లేవ నెత్తబడిన క్రీస్తు మరల మరణింపడని మనకు తెలియును. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధి పత్యము లేదు.

10. ఆయన మరణము, పాపమునకు శాశ్వతమగు మరణము. ఇప్పటి ఆయన జీవితము దేవుని కొరకైన జీవితము.

11. మీరును మీ విషయమున అట్లే పాపమునకు మరణించితిమనియు, క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకై జీవించుచున్నామనియు తలంపవలెను.

12. కనుక శారీరక వాంఛలకు లొంగునట్లుగ, మీ భౌతిక శరీరమందు పాపము ఇక ఎంత మాత్రమును పాలన చేయనీయకుడు.

13. దౌష్ట్యమునకు సాధన ములుగ మీ శరీరములందు ఏ అవయవములను పాపమునకు అర్పింపకుడు. అంతేగాక, మృత్యువు నుండి జీవమునకు కొనిరాబడినవారుగ మిమ్ము మీరు దేవునికి అర్పించుకొనుడు. మీ శరీరములయందలి అవయవములను నీతికి సాధనములుగా ఆయనకు సమర్పించుకొనుడు.

14. ఏలయన దేవుని అనుగ్రహమునకే గాని ధర్మశాస్త్రమునకు మీరు ఇక లోబడి ఉండనందున పాపము మిమ్ము ఇక పరిపాలింపదు.

నీతికి బానిసలు 

15. అయినచో నేమి? ధర్మశాస్త్రమునకు కాక దేవుని కృపావరమునకు లోనైనవారము అగుటచే పాపము చేయుదమా? న్నటికిని కాదు!

16. లోబడు టకు దేనికి మిమ్మును మీరు అప్పగించుకుందురో అది మరణము నిమిత్తము పాపమునకేగాని, దేవుని నీతి నిమిత్తము విధేయతకేగాని దేనికి మీరు లోబడుదురో దానికే మీరు దాసులగుదురని మీకు తెలియదా?

17. కాని దేవునికి కృతజ్ఞతలు! ఏలయన, ఒకప్పుడు మీరు పాపమునకు దాసులు. కాని, ఇప్పుడు మీకు అప్పగింప బడిన బోధనలలోని సత్యములకు మీరు హృదయ పూర్వకముగ విధేయులైతిరి.

18. మీరు పాపముల నుండి విముక్తులై నీతికి దాసులైతిరి.

19. సహజముగ మీరు పరిమితులగుటచే నేను మానవరీతిగా మాట్లాడుచున్నాను. ఒకప్పుడు మీరు దుష్కార్యములను చేయు టకై అపవిత్రతకును, దుష్టత్వమునకును, మీ అవయ వములను అప్పగించితిరి. అదే విధముగ ఈనాడు మీరు మీ అవయవములను నీతికి దాసులుగ అప్ప గించి పవిత్రులు కావలెను.

20. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమున విచ్చలవిడిగా ఉంటిరి.

21. మరి ఈనాడు మీకు సిగ్గు కలిగించుచున్న ఆ పనులు చేయుటవలన అప్పుడు మీకు కలిగిన ప్రయోజన మెట్టిది? వాని ఫలితము మరణమే కదా!

22. కాని, ఈనాడు మీరు పాపమునుండి విముక్తి పొంది, దేవునికి దాసులైతిరి. పవిత్రతకు చెందిన మీ ఫలితమును మీరు స్వీకరించితిరి. అంతేకాక, చివరకు మీకు శాశ్వత జీవితము లభించును.

23. ఏలయన, పాపము యొక్క వేతనము మరణము. కాని, దేవుని కృపాను గ్రహము, మన ప్రభువగు క్రీస్తుయేసు నందు శాశ్వత జీవనము.