యెరూషలేము ద్రోహము
16 1. ప్రభువువాణి నాతో ఇట్లనెను: 2. ”నర పుత్రుడా! యెరూషలేము చేసిన హేయమైన కార్యము లను దాని దృష్టికి తీసికొనిరమ్ము.
3. యావే ప్రభుడనైన నేను యెరూషలేముతో ఇట్లు చెప్పు చున్నాననుము:
నీవు కనాను మండలమున జన్మించితివి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు.
4. నీవు ప్టుినపుడు ఎవరును నీ బొడ్డును కోయలేదు. నిన్ను స్నానము చేయింపలేదు. నీ చర్మమునకు ఉప్పు రుద్ది నిన్ను పొత్తిగుడ్డలతో చుట్టలేదు.
5. ఎవరును నీపై దయచూపి ఈ పరిచర్యలు చేయలేదు. నీవు జన్మించినపుడు ఎవరును నిన్ను అనురాగముతో చూడక బయి పొలమున పారవేయబడి, చూచుటకు అసహ్యముగానుింవి.
6. అపుడు నేను నీ ప్రక్కగా పోవుచు నీవు నీ నెత్తురులోనే పడితన్నుకొనుచుండుటను చూచితిని. నేను ‘నీవు రక్తములో పొర్లియున్నను బ్రతుకునట్లు చేసితిని.
7. నీవు పొలములోని మొక్కవలె చక్కగా పెరుగునట్లు చేసితిని.’ నీవు పెరిగి యుక్తవయస్సునకు వచ్చి ఆభరణములు ధరించుదానవైతివి. నీ స్తనములు పుష్టిచెందెను. నీ శిరోజములు పెరిగెను. కాని నీవు దిగంబరివైయుింవి.
8. నేను నీ ప్రక్కగా పోవుచు నీకు వలపుపుట్టు కాలము వచ్చినదని గ్రహించితిని. దిగంబరివైయున్న నిన్ను నా వస్త్రముతో కప్పి నీకు మాటయిచ్చితిని: నేను నీతో వివాహబంధనము చేసికొనగా నీవు నాదానవైతివి. ఇది యావే ప్రభుడనైన నా పలుకు.
9. అంతట నేను నీకు స్నానము చేయించి, నీ నెత్తుిని కడిగివేసితిని. నీ చర్మముపై ఓలివు తైలము పులిమితిని.
10. నీకు బ్టుాలు వేసిన వస్త్రమును, మేలైన ఎఱ్ఱి తోలుచెప్పులను తొడిగించితిని. నారబట్టతో క్టుిన ఫాలప్టికతోను, పట్టుఅంగీతోను నిన్ను అలంకరించితిని.
11. నిన్ను ఆభరణాలతో, చేతికంకణములతో, మెడకు రత్నమాలలతో సింగారించి, 12. నీ ముక్కునకు, చెవులకు నగలు ప్టిె, నీ తలపై సొగసైన కిరీటము నుంచితిని.
13. నీవు వెండిబంగార ములతో చేసిన సొమ్ములు ధరించితివి. బ్టుాలు వేయించిన నారబట్టలను, పట్టుబట్ట లను తాల్చితివి. మేలిరకపు పిండితో చేసిన రొట్టెను, తేనెను, ఓలివు తైలమును భుజించితివి. సాిలేని సొగసుకత్తెవైతివి. 14. నేను నా కీర్తిని నీకు ప్రసాదించితిని. కనుక నీవు పరిపూర్ణసౌందర్యవతివని దేశదేశములందు పేరు తెచ్చుకొింవి. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు.
15. కాని నీ సౌందర్యమువలనను, కీర్తి వలనను నీకు తల తిరిగినది. నీవు నీ చెంతకు వచ్చిన వారందరి తోను వ్యభిచరించితివి.
16. నీవు నీ వస్త్రములలో కొన్నితీసి, చిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరచి, వాిమీద పడుకొని ఎన్నడును జరుగని, జరుగకూడనిరీతిగ వ్యభిచారము చేసితివి. అి్టవిక జరుగబోవు.
17. నేను నీకిచ్చిన వెండి, బంగారునగలతో పురుషవిగ్రహములను చేసి వానితో క్రీడించితివి.
18. బ్టుాలు వేసిన నీ దుస్తులను ప్రతిమ లకు తొడిగితివి. నేను నీకిచ్చిన ఓలివుతైలమును, సాంబ్రాణిని వాని కర్పించితివి.
19. నేను నీకు నాణ్యమైన పిండితో చేసిన రొట్టెను, ఓలివుతైలమును, తేనెను భోజనముగానీయగా, నీవు వానిని విగ్రహముల కర్పించి, వాని మన్నన పొందగోరితివి. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు.
20. నీవు నావలన కనిన బిడ్డలను ప్రతిమలకు బలిగా అర్పించితివి. నన్ను త్రోసిపుచ్చి జారత్వమునకు పూనుకొనుట చాలదోయన్నట్లు, 21. నా బిడ్డలను గూడ విగ్రహములకు బలియిచ్చెదవా?
22. నీవు రోత ప్టుించు వ్యభిచారిణివిగా మెలగునప్పుడు నీ బాల్య మును జ్ఞప్తికి తెచ్చుకోవైతివి. అప్పుడు నీవు దిగంబరివై యుింవి. నీ నెత్తుిలో నీవే తన్నుకొనుచుింవి.
వేశ్యగా యెరూషలేము
23. యావే ప్రభువు ఇట్లనుచున్నాడు: నీకు శ్రమయు అనర్థముసుమా! నీవింతి చెడుకు పాల్పడి తివి.
24. ఇంకను ప్రతి రహదారి ప్రక్కన విగ్రహము లకు దేవాలయములు, ఎత్తైన బలిపీఠములు నిర్మించి వ్యభిచరించితివి.
25. నీ సౌందర్యమును మంట గలిపి, ప్రతివానికి నీ శరీరమును అర్పించుకొింవి. నీ రంకులకు అంతము లేదయ్యెను.
26. కామపూరి తులును, నీ పొరుగువారునైన ఐగుప్తీయులతో శయ నించితివి. నీ చీకితప్పులవలన నా కోపమును రెచ్చగ్టొితివి.
27. కావున ఇపుడు నేను నిన్ను శిక్షించుటకు చేతినెత్తితిని. నీ జీవనోపాధిని తక్కువచేసి, నిన్ను ద్వేషించువారును, నీ రోతపనులకు సిగ్గుపడువారునైన ఫిలిస్తీయుల కుమార్తెలకు నిన్ను అప్పగించితిని.
28. నీవు అంతితో తృప్తిజెందక, అస్సీరియనుల వెంట బడితివి. వారికి వేశ్యవైతివి. కాని వారివలన కూడ నీకు తృప్తికలుగలేదు.
29. కానాను దేశము మొదలు కొని బబులోనియా దేశమువరకును నీవు వ్యభిచరించి నను తృప్తినొందవైతివి.
30. ప్రభువైన దేవుడు ఇట్లనుచున్నాడు: నీవు సిగ్గుమాలినవేశ్యవై ఈ కార్యములెల్లచేసి నా రోష మును రెచ్చగ్టొితివి.
31. నీవు ప్రతి రహదారి ప్రక్కన, ప్రతి వీధిమలుపునను విగ్రహములకు మందిరములు నిర్మించి రంకాడితివి. అయినను నీవు రంకులాడివలె డబ్బు కోరవైతివి.
32. నీవు భర్తను ప్రేమింపక అన్యులతో వ్యభిచరించు భార్యవిందానవు.
33. వేశ్య డబ్బును స్వీకరించును. కాని నీవు నీ విటుకాండ్రలకు బహుమతులిచ్చితివి. కానుకలు అర్పించి ఎల్లతావుల నుండి వారిని ఆకర్షించితివి.
34. నీవు ఇతర వేశ్యల విం దానవుకావు. ఎవరును నీ వెంటపడలేదు. నీకెవరును డబ్బు చెల్లింపలేదు. నీవే నీ విటుకాండ్రకు ఎదురు సొమ్ము చెల్లించితివి. ఇదియే నీ జారత్వము నకును, ఇతర స్త్రీల జారత్వమునకును ఉన్న బేధము. ఇది ప్రభువు వాక్కు.
యెరూషలేమునకు శిక్ష
35. వేశ్యవైన యెరూషలేమూ! ప్రభువు పలుకులు ఆలింపుము.
36. ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు: నీవు వేశ్యవలె బట్టలువిప్పి నీ విటుకాండ్రలకును, హేయ మైన విగ్రహములకును నీ శరీరమును అర్పించు కొింవి. నీ పిల్లల రక్తమును ఆ విగ్రహములకు అర్పించితిని.
37. కావున నేను నీవు సుఖమను భవించిన విటుకాండ్రనందరిని, నీకిష్టమైనవారిని, అయిష్టమైనవారిని గూడ ప్రోగుజేసికొని వత్తును. వారెల్లరును నీ చుట్టు సమకూరుదురు, నీ వలువలు ఊడదీయుదురు. వారు నీ నగ్నరూపము చూతురు.
38. నీ రంకులకును, నీ హత్యలకును నేనే నిన్ను దండింతును. మహాకోపముతోను, రోషము తోను నీకు మరణశిక్ష విధింతును.
39. నీ విటుకాండ్ర లకు నిన్ను అప్పగింతును. వారు నీవు రంకాడిన తావులనెల్ల అనగా నీవు క్టిన గుళ్ళను, నిలబ్టెిన బలిపీఠములనెల్ల కూలద్రోసి నాశనము చేయుదురు. నీ బట్టలను, నగలను తీసివేసి నిన్ను దిగంబరను చేయుదురు.
40. వారు నీ మీదికొక గుంపును తీసికొనివచ్చి నీపై రాళ్ళు రువ్వింతురు. నిన్ను కత్తితో నరుకుదురు.
41. నీ ఇండ్లను తగులబెట్టుదురు. నీవు దండన అను భవించుచుండగా చాలామంది స్త్రీలు చూతురు. నేను నీ వేశ్యావృత్తిని మాన్పింపగ నీవిక పడుపుసొమ్మీయక ఉందువు.
42. దానితో నా ఆగ్రహము చల్లారును. నేను శాంతింతును. అటుపిమ్మట నేను కోపమును, రోషమును తెచ్చుకొనను.
43. నీవు బాలికగా నున్న పుడు నేను నిన్ను ఎట్లు ఆదరించితినో మరచిపోతివి. నీ చెయిదముల ద్వారా నా కోపమును రెచ్చగ్టొితివి. కనుక నేను నీకు తగినశాస్తి చేసితిని. నీవీ హేయమైన కార్యములతోపాటు అపవిత్రకార్యములు గూడ చేసితివికదా! ఇవి యావే ప్రభుడనైన నా పలుకులు.
తల్లివలె తనయ
44. యెరూషలేమూ! ”తల్లి వలె తనయ” అను సామెతను ప్రజలు నీకు వర్తింపజేయుదురు.
45. నీవు నీ తల్లికి తగిన తనయవు. ఆమె తన భర్తను, పిల్లలను అసహ్యించుకొనెను. నీవు నీ తోబుట్టువులకు సాి దానవు. వారు తమ భర్తలను, పిల్లలను అసహ్యించు కొనిరి, నీ తల్లి హిత్తీయురాలు, తండ్రి అమోరీయుడు.
46. నీ అక్క ఉత్తరమున ఆమె కుమార్తెలతోనున్న సమరియా నగరము, దాని గ్రామములు. నీ చెల్లెలు దక్షిణమున ఆమె కుమార్తెలతోనున్న సొదొమ నగరము, దాని గ్రామములు.
47. నీవు నీ తోబుట్టువుల మార్గ ములో నడచి వారివలె హేయమైన కార్యములు చేయు టతో సరిపెట్టుకొింవా? లేదు. అనతికాలములోనే నీ దుష్కార్యముల ద్వారా వారిని మించిపోతివి.
48. యావే ప్రభుడనైన నేను చెప్పుచున్నాను వినుము. నా జీవము తోడు. నీ సోదరియైన సొదొమ పట్టణము ఆమె కుమార్తెలు, నీవు నీ కుమార్తెలు చేసినన్ని దుష్కార్యములు చేయలేదు.
49. నీ చెల్లెలైన సొదొమ, ఆమె కుమార్తెల పాపములు ఏవనగా: పొగరు, ఆహారసమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితి నుండుట. అవి దీనులను, దరిద్రులను ప్టించు కోలేదు.
50. అవి తలబిరుసుతనముతో నేను అస్య హించుకొను కార్యములు చేసెను గనుక, నేను వానిని నాశనము చేసితిని. ఈ సంగతి నీకును తెలియును.
51. నీవు చేసిన పాపములో సమరియా సగము కూడ చేయలేదు. నీవు దానికంటెను హేయమైన పనులు చేసితివి. నీ రోతపనులతో పోల్చినచో నీ తోబుట్టువులు నిర్దోషులేమోయని అనిపించును.
52. ఇపుడు నీవు నీ అవమానమును భరింపుము. నీ తప్పులెంత ఘోరమైనవనగా, నీతో పోల్చినచో నీ అక్కచెల్లెండ్రు నిర్దోషులు. నీ అక్కచెల్లెండ్రు నీకంటెను విశుద్ధురాండ్రు కనుక నీవు వెలవెలబోయి సిగ్గు చెందుము.
సొదొమ, సమరియా నగరములకు మంచిరోజులు
53. యెరూషలేమూ! నేను సమరియాను దాని నగరములను, సొదొమను దాని నగరములను మరల స్థాపింతును. వారివలెనె అపాయమొందిన నిన్నుకూడ పూర్వపుస్థితికి తెత్తును.
54. నీ కార్యములకుగాను నీవు సిగ్గుపడుదువు. నీ అవమానముతో పోల్చినచో నీ తోబుట్టువులు మంచివారుగా చలామణి అయ్యెదరు.
55. సమరియా దాని గ్రామములు, సొదొమ దాని గ్రామములు మరల పెంపుజెందును. అట్లే నీ గ్రామ ములతో పాటు నీవును పెంపుజెందుదువు.
56. నీవు పూర్వము అహంకారముతో నీ చెల్లెలయిన సొదొమను గేలిచేసితివి.
57. నీ పాపములు బట్టబయలు కాకముందు ఆమెను ఎగతాళి చేసితివి. ఇపుడు నీవును ఆమె విందానవైతివి. నిన్ను ద్వేషించు ఎదోమీయులు, ఫిలిస్తీయులు, ఇంకను నీ పొరుగుననున్న ఇతరులు నిన్నుచూచి నవ్వుచున్నారు. 58. నీవుచేసిన హేయమైన కార్యములకును, అపవిత్రక్రియలకును శిక్షను అను భవింపుము.” ఇది ప్రభువు వాక్కు.
శాశ్వత నిబంధన
59. ప్రభువైన యావే ఇట్లు చెప్పుచున్నాడు: ”నీ దుష్టవర్తనమునకు తగినట్లే నేను నిన్ను దండింతును. నీవు నీ ప్రమాణమును నిలబెట్టుకోవైతివి. నా నిబంధనను మీరితివి.
60. కాని నీవు బాలికగా ఉన్న పుడు నేను నీతో చేసికొనిన ఒడంబడికను స్మరించుకొని ఇపుడు నీతో శాశ్వతమైన నిబంధనము చేసికొందును.
61. నీ అక్కచెల్లెండ్లు నీవు చేసిన నిబంధనములో భాగస్తులు కాకున్నను, నేను వారిని నీకు కుమార్తెల నుగా ఇచ్చుచున్నాను. నీవు వారిని చేర్చుకొనినపుడు నీ ప్రవర్తనమును తలంచుకొని సిగ్గుపడుము.
62. నేను నీతో చేసికొనిన నిబంధనమును స్థాపింతును. అపుడు నేను ప్రభుడనని నీవు గ్రహింతువు.
63. నేను నీ అపరాధములెల్ల ప్రాయశ్చిత్తము చేయగా, నీవు వానిని జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడి నోరు విప్పజాలవు. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు.”