ఎలీషా చరితము

ప్రారంభాంశములు

ఏలీయా ఆకాశమునకు కొనిపోబడుట, అతనికి మారుగా ఎలీషా ప్రవక్తయగుట

2 1. ప్రభువు ఏలీయాను సుడిగాలిలో ఆకాశము నకు కొనిపోవుసమయము ఆసన్నమయ్యెను. అప్పుడు ఏలీయా, ఎలీషా గిల్గాలునుండి బయలుదేరిరి.

2. ఏలీయా ఎలీషాతో ”నీవిచట ఆగుము. ప్రభువు నన్ను బేతేలునకు వెళ్ళమనెను” అని చెప్పెను. కాని ఎలీషా ”సజీవుడైన యావే తోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువను” అనెను. వారిరువురు బేతేలునకు వెళ్ళిరి.

3. బేతేలున వసించు ప్రవక్తల సమాజము ఎలీషా వద్దకు వచ్చి ”నేడు ప్రభువు నీ యజమానుడైన ఏలీయాను కొనిపోనున్నాడు. ఈ సంగతి నీకు తెలి యునా?” అనడిగిరి. ఎలీషా ”నాకు తెలియును. కాని మనము ఆ సంగతి ఎత్తగూడదు” అనెను.

4. ఏలీయా ఎలీషాతో ”నీవిచటఆగుము. ప్రభువు నన్ను యెరికోకు వెళ్ళమనెను” అని చెప్పెను. కాని ఎలీషా ”సజీవుడైన యావే తోడు, నీ జీవము తోడు నేను నిన్ను విడువను” అనెను. వారిరువురు యెరికోకు వెళ్ళిరి.

5. యెరికో యందలి ప్రవక్తలసమాజము ఎలీషావద్దకు వచ్చి, ”నేడు ప్రభువు నీ యజమానుడు ఏలీయాను కొని పోనున్నాడు. ఈ సంగతి నీకు తెలియునా?” అనడి గిరి. ఎలీషా ”నాకు తెలియును. కాని మనము ఈ సంగతి ఎత్తగూడదు” అనెను.

6. ఏలీయా ఎలీషాతో ”నీవిచాగుము. ప్రభువు నన్ను యోర్దానునకు వెళ్ళు మనెను” అని చెప్పెను. కాని ఎలీషా ”సజీవుడైన యావే తోడు, నీ జీవముతోడు. నేను నిన్ను విడువను” అని పలికెను. వారిరువురు కలిసి యోర్దానునకు వెళ్ళిరి.

7. ప్రవక్తలసమాజమునుండి ఏబదిమంది ప్రవక్తలుకూడ వారివెంటవెళ్ళి యోర్దానునకు కొంచెము దూరముగానిలుచుండిరి. ఏలీయా, ఎలీషా యోర్దాను నదిచెంత ఆగిరి.

8. ఏలీయా తన ఉత్తరీయమును తీసి చుట్టగాచ్టుి దానితో యోర్దాను జలమును మోదగా నీళ్ళు రెండుగావిడిపోయి దారి ఏర్పడెను. అతడు, ఏలీషా పొడిదారిన నడచిపోయి నది ఆవలి దరిని చేరిరి.

9. అటుల నదిని దాినపిదప ఏలీయా ఎలీషాతో ”ప్రభువు నన్ను కొనిపోకముందే నేను నీకేమి ఉపకారము చేయవలయునో కోరుకొమ్ము” అనెను. ఎలీషా ”నాకు నీ ఆత్మలో రెండుపాళ్ళు దయ చేయుము” అని అడిగెను. 10. ఏలీయా అతనితో ”నీ కోరికను తీర్చుట కష్టము. ప్రభువు నన్ను నీ చెంత నుండి కొనిపోవునప్పుడు నీవు నన్ను చూతువేని నీ కోరిక నెరవేరును. చూడజాలవేని నీ కోరిక  సిద్ధింపదు” అనెను.

11. వారింకను మాటలాడుకొనుచు ముందుకు సాగిపోవుచుండగా నిప్పుగుఱ్ఱములు లాగు అగ్నిరథమొకి అకస్మాత్తుగా వారి నడుమ ప్రవే శించెను. వెంటనే సుడిగాలిచేత ఏలీయా ఆకాశము నకు ఆరోహణమాయెను. 12. ఆ దృశ్యమును చూచి ఎలీషా ”ఓ నాతండ్రీ! ఓ నాతండ్రీ! యిస్రాయేలునకు రథమును దాని సారధియు నీవే!” అని  అరచెను. ఆ మీదట ఏలీయా అతనికి కన్పింపలేదు. ఎలీషా సంతా పముతో తన అంగీని రెండుముక్కలుగా చించివేసెను.

13. అతడు ఏలీయా వెళ్ళిపోవుచుండగా జారిపడిన గొంగళిని ఎత్తుకొనిపోయి యోర్దానునది ఒడ్డున నిలుచుండెను.

14. ఎలీషా ఏలీయా గొంగళితో నీిని మోది ”ఏలీయా దేవుడైన యావే ఎక్కడున్నాడు?” అని, అతడు కూడ నీిని మోదగా నీరు రెండుగా విడిపోయెను. అతడు నది ఆవలిఒడ్డునకు నడచిపోయెను.

15. యెరికోనుండి వచ్చిన ఏబదిమంది ప్రవక్తలు అతనిని చూచి ”ఇకనేమి? ఏలీయా ఆత్మ ఎలీషాకు సంక్ర మించినది” అనుకొనిరి. వారు ఎలీషాచెంతకు వెళ్ళి అతని ముందటసాగిలపడి, 16. ”మేము మొత్తము ఏబదిమందిమి. అందరము జవసత్వములు కల వారము. నీవు అనుమతిచ్చినచో మేమువెళ్ళి నీ యజమానుని వెదకివత్తుము. ప్రభువాత్మ ఏలీయాను కొనిపోయి ఏ కొండమీదనో ఏ లోయలోనో జారవిడిచి యుండును” అనిరి. ఎలీషా ”మీరెవరు పోవలదు” అనెను.

17. కాని వారు నిర్భంధింపగా కడకు అతడు సమ్మతించెను. ఆ ఏబదిమంది వెడలిపోయి మూడు దినములు ఏలీయాను గాలించిరి గాని అతని జాడ తెలియలేదు.

18. అటుపిమ్మట వారు యెరికో నగర మున బసచేయుచున్న ఎలీషా చెంతకురాగా అతడు వారితో ”నేను ముందుగనే మీరు వెళ్ళవలదని చెప్పలేదా?” అనెను.

ఎలీషా చేసిన రెండు అద్భుతములు

19. అటు తరువాత యెరికోపౌరులు ఎలీషా వద్దకు వచ్చి ”అయ్యా! ఇది సుందరమైన నగరము. కాని ఇచ్చి నీరు మంచిదికాదు. భూములు నిస్సార మగుచున్నవి” అని పలికిరి.

20. ఎలీషా ”మీరు క్రొత్తపాత్రలో కొంచెము ఉప్పువేసి నా యొద్దకు కొనిరండు” అని చెప్పగా వారట్లేచేసిరి.

21. అతడు పట్టణపు నీిబుగ్గవద్దకు వెళ్ళి ఉప్పును నీిలో పడవేసి ”ఇది ప్రభువాజ్ఞ. నేను ఈ జలమును నిర్మలము చేసితిని. ఇకమీదట ఈ నీళ్ళు చావునుగాని, గర్భ పాతమునుగాని కలిగింపవు” అని పలికెను. 22. ఎలీషా నుడివినట్లే ఆ నీళ్ళు నేివరకును ఆరోగ్య కరముగనే ఉన్నవి.

23. ఎలీషా యెరికోనుండి బేతేలునకు వెళ్ళు చుండగా త్రోవలో కొందరు చిన్నపిల్లలు అతనిని గేలిచేయుచు ”పో పో బట్టతలకాయా!” అని అరచిరి.

24. అతడు కోపముతో ఆ పిల్లలవైపు తిరిగి యావే పేరిట వారిని శపించెను. వెంటనే అడవిలో నుండి రెండు ఆడు ఎలుగుబంటులు వెడలివచ్చి నలువది ఇద్దరు పిల్లలను ముక్కలుముక్కలుగా చీల్చివేసెను.

25. ఎలీషా అచినుండి కర్మెలు కొండకు పోయి అక్కడినుండి సమరియాకు తిరిగివచ్చెను.