7 1. ఎలీషా రాజుతో ”ప్రభువు సందేశము వినుము. రేపీపాికే సమరియా అంగడిలో ఒకమానిక మంచి గోధుమపిండి,  రెండు మానికల యవలను ఒకవెండి నాణెమునకు అమ్మెదరు” అనెను.

2. ఆ మాటలకు రాజు అంగరక్షకుడు ”ప్రభువు వెంటనే ఆకాశకికీలు తెరిచిననూ, నీవు చెప్పినంత చౌకగా ధాన్యము అమ్ముడు పోదు” అనెను. ఎలీషా ”నీ కన్నులారా చూతువు కాని నీవుమాత్రము ఆ ధాన్యముతో వండిన భోజన మును ముట్టుకోజాలవు” అని మారుపలికెను.

సిరియనులు శిబిరములు వీడి పారిపోవుట

3. అప్పుడు కుష్ఠరోగులు నలుగురు సమరియా నగరద్వారమువద్ద పడిఉండిరి. వారు తమలో తాము ”మనము ఆకలితో చచ్చువరకు ఇక్కడనే పడి ఉండ నేల? 

4. నగరమున ప్రవేశించినచో, నగరమున కరువుఉన్నందున అక్కడను చత్తుము. అటులని ఇక్క డున్నను చావు తప్పదు. కనుక ఇపుడు సిరియనుల శిబిరమునకు వెళ్ళుదమురండు. వారు మనలను చంపి నచో చత్తుము. బ్రతుకనిచ్చినచో బ్రతుకుదుము” అనుకొనిరి.

5. ఇట్లనుకొని వారు సందెచీకిన శత్రు శిబిరమునకు పోయి చూచెదమని లేచి, శిబిరమును చేరిచూడగ అచట ఎవ్వరును కన్పింపలేదు.

6. ప్రభువు సిరియనులకు రథములతో, గుఱ్ఱములతో వచ్చు మహా సైన్యనాదము విం ధ్వని విన్పడునట్లు చేయగా, ఆ శబ్దమువిని సిరియనులు యిస్రాయేలురాజు హిత్తీయ రాజులకును, ఐగుప్తురాజులకును బత్తెమిచ్చి  తమమీద పడుచున్నాడు కాబోలునని కలవరపడిరి.

7. కనుక వారు తమ గుడారములను, గుఱ్ఱములను, కంచరగాడిదలను విడనాడి శిబిరమును ఉన్నదానిని ఉన్నట్లు వదలిప్టిె బ్రతుకుజీవుడా అని సందెచీకిలో పారిపోయిరి.

8. కుష్ఠరోగులు పాళెము చొచ్చి ఒక గుడారమున జొరబడి అచటనున్న అన్న పానీయములు పుచ్చుకొనిరి. అచట దొరకిన వెండి బంగారములు, వస్త్రములు దోచుకొనిపోయి ఒక తావున దాచివచ్చిరి. మరల ఇంకొక గుడారమున ప్రవేశించి దానినిగూడ దోచుకొనిపోయిరి.

ముట్టడి ముగియుట, కరువు ఆగిపోవుట

9. అంతట ఆ నలుగురు ఒకరితోనొకరు ”మనము పాడుపని చేయుచున్నాముకదా! ఇది నేడు పట్టణమున వినిపింపదగిన శుభసందేశము. అయి నను మనము నోరు కదుపుటలేదు. రేపు ప్రొద్దు పొడుచువరకు ఈ సంగతిని దాచెదమేని అధికారులు మనలను దండింతురు. కావున వెంటనేవెళ్ళి జరిగిన సంగతిని రాజోద్యోగులకు తెలియజేయుదము” అని తమలో తాము మథనపడిరి.

10. కనుక వారు శిబిరమునుండి సమరియా నగరద్వారము వద్దకు వచ్చి అచటకాపున్న ద్వారపాలకులతో ”మేము సిరియనుల మకామునకు వెళ్ళితిమి. కాని అచట ఎవరును కన్పింపలేదు. జనసందడి కూడలేదు. గుఱ్ఱములు, గాడిదలు క్టిపడియున్నవి, గుడారములు ఎక్కడివక్కడే నున్నవి” అని చెప్పిరి.

11. ద్వారపాల కులు ఆ వార్తను రాజసౌధమున వినిపింపజేసిరి.

12. అప్పికింకను చీకట్లు విచ్చిపోలేదు. అయి నను రాజు పడకనుండిలేచి తన ఉద్యోగులతో ”మీరు ఈ సిరియనుల పన్నాగము నెరిగితిరా? మనమిక్కడ కరవుతో చచ్చిపోవుచున్నాముకదా! కనుక వారు శిబిరము వీడిపోయినట్లు నించి ఎక్కడనో పొలమున దాగుకొనిఉందురు. మనము భోజనపదార్థములు సేకరించుకొనుటకు నగరము వీడివత్తుమని వారి తలపు. అప్పుడు మనమీదపడి మనలను బంధించి, మన నగరమును స్వాధీనము చేసికొనవచ్చునని వారి కుట్ర” అనెను.

13. అప్పుడు రాజోద్యోగి ఒకడు ”ప్రభూ! ఇక ఈ పట్టణమున మిగిలియున్నవారును గతించినవారివలె చచ్చుట నిక్కము. కనుక ఆ మిగిలి యున్న అయిదు గుఱ్ఱములపై కొందరిని శత్రు శిబిర మునకు పంపుదము. వారు వెళ్ళి ఏమి జరిగినదో తెలిసికొనివత్తురు” అనెను3.

14. అంతట ఉద్యోగులు జనులను కొందరిని ఎన్నుకొనగా రాజు వారిని రెండు రథములపైపంపి, మీరుపోయి సిరియనుల శిబిర మున ఏమి జరిగినదో తెలిసికొనిరండని చెప్పెను.

15. అటుల వెళ్ళిన వారు సిరియనులను గాలించుచు యోర్దాను వరకు వెళ్ళిరి. శత్రువులు పారిపోవుచు త్రోవలో జారవిడిచిన బట్టలను సామగ్రిని చూచిరి. వారు తిరిగివచ్చి తాము చూచినదంతయు రాజునకు  విన్నవించిరి. 16. వెంటనే యిస్రాయేలు పౌరులు ఒక్కుమ్మడిగా పరుగెత్తుకొనిపోయి సిరియా శిబిరమును దోచుకొనిరి. అపుడు ప్రభువు చెప్పినట్లుగనే నగరమున ఒకమానిక మంచి గోధుమపిండి, రెండుమానికల యవలు ఒకవెండినాణెమునకు అమ్ముడుపోయెను.

 17. ఆ సమయమున రాజు తన అంగరక్షకునే నగరద్వారమునకు కాపుంచి ఉండెను. కాని ప్రజలు శిబిరమునకుపోవు సంబరమున అతనిని త్రొక్కివేసిరి. మునుపు రాజు తనను చూడబోయినప్పుడు ఎలీషా ప్రవచించినట్లే ఆ అంగరక్షకుడు మరణించెను.

18. రేపు ఈ పాికి సమరియా అంగడిలో ఒక మానిక మంచి గోధుమపిండి, రెండుమానికల యవలు ఒక వెండినాణెమునకు అమ్ముడుపోవునని ప్రవక్త రాజుతో చెప్పెనుకదా! అతడు చెప్పినట్లే జరిగెను.

19. అపుడు రాజు అంగరక్షకుడు ప్రభువు వెంటనే ఆకాశకికీలు తెరిచిననూ నీవు చెప్పినంతచౌకగా ధాన్యము అమ్ముడు వోదు అనెను. అందుకు ఎలీషా ”నీ కన్నులారా చూతువు కాని నీవు మాత్రము ఆ ధాన్యముతో వండిన భోజనమును ముట్టుకోజాలవు” అని నుడివెను గదా!

20. అతడు చెప్పినట్లే జరిగెను. నగరద్వారమున ప్రజలు అంగరక్షకుని త్రొక్కుకొని పోగా అతడు మరణించెను.