బబులోనియా పతనము
21 1. సముద్రతీర ఎడారి ప్రాంతమును గూర్చి దైవవాక్కు:
ఎడారిగుండ నేగేబున సుడిగాలి వీచినట్లే,
భయంకరమైన దేశమునుండి
విపత్తు వచ్చును.
2. నేనొక భీకరదృశ్యమును గాంచితిని.
కొల్లగొట్టువారు కొల్లగొట్టుదురు,
ధ్వంసము చేయువారు ధ్వంసము చేయుదురు.
ఏలామూ! నీవు యుద్ధమునకు పొమ్ము.
మాదీయా! నీవు పట్టణమును ముట్టడింపుము.
ప్రభువు బబులోనియావలన
కలిగిన దుఃఖము తీర్చును.
3. ఆ దృశ్యమునుగాంచి
నా నడుము బహునొప్పిగానుండినది.
ఆ బాధ ప్రసవవేదనను అనుభవించు
స్త్రీ శ్రమవింది.
నేను వేదనలవలన వినజాలనైతిని,
భయమువలన కనజాలనైతిని.
4. నా గుండె కొట్టుకొనుచుండెను.
నేను భీతితో కంపించుచుింని.
నేను సాయంకాలముకొరకు
ఎదురుచూచుచుింని.
కాని మునిమాపు నాకు భీతినే కలిగించెను.
5. ప్రజలు భోజనము సిద్ధముచేసి
అతిథులు కూర్చుండుటకు కంబళ్ళు పరచిరి.
వారు విందారగించుచుండగానే
‘సైన్యాధిపతులారా! మీ డాళ్ళను సిద్ధము
చేసికొనుడు’ అని అరుపులు విన్పించెను.
6. అంతట ప్రభువు నాతో ఇట్లనెను:
”నీవుపోయి గస్తీవానిని నియమింపుము.
అతడు తాను చూచినది నీతో చెప్పవలెను.
7. రౌతులు గుఱ్ఱములనెక్కి జంటలుజంటలుగా
వచ్చుటను అతడు చూచెనేని,
నరులు గాడిదలపైనను, ఒంటెలపైనను
వరుసలుగా వచ్చుటను గాంచెనేని
వారిని జాగ్రత్తగా పరిశీలించిచూడవలెను.”
8. గస్తీవాడు ”అయ్యా!
నేను ఈ బురుజు మీదినుండి
రేయింబవళ్ళు గస్తీ కాయుచున్నాను.
9. అవిగో అశ్వదళములు! రౌతులు గుఱ్ఱములనెక్కి
జంటలుజంటలుగా వచ్చుచున్నారు”
అని బిగ్గరగ కేకలిడెను.
మరియు గస్తీవాడు ఇట్లు అనుచున్నాడు:
”బబులోనియా ధ్వంసమైనది, ధ్వంసమైనది.
ఆ నగరప్రజలు కొలుచు
విగ్రహములన్నియు కూలి నేలమీద పడినవి”.
10. నా ప్రజలైన యిస్రాయేలీయులారా!
శత్రువులు మిమ్ము కళ్ళమున
ధాన్యమువలె త్రొక్కించిరి.
యిస్రాయేలుదేవుడును,
సైన్యములకధిపతియునైన ప్రభువు
నాతో చెప్పినసంగతినే నేను మీకు తెలిపితిని.
ఎదోమును గూర్చి దైవవాక్కు
11. ఎదోమునుగూర్చి దైవవాక్కు:
సేయీరునుండి నన్నెవరో గొంతెత్తి పిలిచి
”కావలివాడా! రేయి ఎంతవేళయినది?”
అని అడిగెను.
12. ”ఓయి! వేకువవచ్చుచున్నది,
కాని రేయి మరల వచ్చును.
నీవు మరల నన్ను ప్రశ్నింపగోరెదవేని తిరిగివచ్చి
ప్రశ్నింపుము” అని గస్తీవాడు చెప్పుచున్నాడు.
అరేబియాను గూర్చి దైవోక్తి
13. అరేబియాను గూర్చి దైవోక్తి:
అరేబియాఎడారులలో విడిదిచేయు
దెదాను సార్దవాహులారా!
దప్పికగొనినవారికి నీళ్ళుగొనిరండు.
14. తేమా దేశనివాసులారా!
మీరు కాందిశీకులను కలిసికొని
వారికి భోజనము పెట్టుడు.
దప్పికగొన్నవారికి నీళ్ళుతెండు.
15. వారు తమను నాశనముచేయు
ఖడ్గముల నుండి పారిపోవుచున్నారు.
ఎక్కు ప్టిెన విల్లులనుండి
తప్పించుకొని పోవుచున్నారు.
యుద్ధాపాయములకు జంకి పరిగెత్తుచున్నారు.
కెదారును గూర్చి దైవోక్తి
16. ప్రభువు నాతో ”ఖండితముగా ఒక సంవత్సరము ముగియకమునుపే కెదారు వైభవము అంతమగును.
17. కెదారు జనులలో విలుకాండ్రు మహాశూరులు. కాని వారిలో కొద్దిమంది మాత్రమే మిగులుదురు. యిస్రాయేలు దేవుడైన ప్రభువు ఆజ్ఞ ఇది” అని చెప్పెను.