భక్తిమంతులకు దీవెనలు
యాత్ర కీర్తన
128 1. ప్రభువుపట్ల భయభక్తులు చూపుచు
అతని మార్గములలో నడచు నరులు ధన్యులు.
2. నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు.
నీవు ఆనందమును,
అభ్యుదయమును బడయుదువు.
3. నీ లోగిట నీ భార్య ఫలించిన ద్రాక్షతీగవలెనుండును
నీ భోజనపు బల్లచుట్టు
నీ పిల్లలు ఓలివు పిలకలవలె ఒప్పుదురు.
4. దేవునిపట్ల భయభక్తులుగల నరుడు
ఇి్ట దీవెనలు బడయును.
5. నీ జీవితకాలమందెల్ల ప్రభువు
సియోనునుండి నిన్ను దీవించునుగాక!
నీవు యెరూషలేము అభ్యుదయమును కాంతువుగాక
6. నీ బిడ్డల బిడ్డలను కన్నులారా చూతువుగాక!
యిస్రాయేలీయులకు శాంతి కలుగునుగాక!